E-Paper
Advertisement

కావ్య శ్రీతో ఏడు అడుగులు వెయ్యబోతున్న సుధీర్..ఇదెక్కడి ట్విస్ట్ మావా?

కావ్య శ్రీతో ఏడు అడుగులు వెయ్యబోతున్న సుధీర్..ఇదెక్కడి ట్విస్ట్ మావా?
Advertisement

Kavya Shree: బుల్లితెరపై సుడిగాలి సుధీర్‌ (Sudigali Sudheer) కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాకు దూరంగా ఉన్నా, ఆయనపై వచ్చే గాసిప్‌లకు మాత్రం కొదవే ఉండదు. గతంలో రష్మీతో లవ్ స్టోరీ, ఇటీవలే నిశ్చితార్థం బ్రేకప్ వార్తలు నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. అయితే తాజాగా మరో యాంకర్ కావ్య శ్రీతో సుధీర్‌కు పెళ్లి జరగబోతోందంటూ సరికొత్త లింకప్ వార్తలు బయటకు వచ్చాయి. ఈ సంచలన రూమర్‌పై స్వయంగా కావ్య శ్రీ స్పందిస్తూ అసలు విషయాన్ని బయటపెట్టింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

కుకింగ్ షోలో ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌గా సుధీర్ సరదా:

తాజాగా రిలీజ్ అయిన ‘ప్రాజెక్ట్ కే’ కుకింగ్ షో ప్రోమోలో సుడిగాలి సుధీర్ స్పెషల్ గెస్ట్‌గా సందడి చేశాడు. షోలోకి రాగానే యాంకర్ సుమ “ఎవరు నువ్వు?” అని అడగ్గా, “నేను ఫుడ్ ఇన్‌స్పెక్టర్ ని.. సెట్‌లో నాకంటే ఆకలి గురించి ఎవరికీ తెలీదు” అంటూ తనదైన శైలిలో నవ్వులు పూయించాడు. ఇక ఆ తర్వాత కిచెన్‌లో వంట చేసుకుంటున్న కావ్య శ్రీ దగ్గరకు వెళ్లి రకరకాల డ్రామాలు చేస్తూ అక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారాడు.

కావ్యతో సుధీర్ పులిహోర.. రొమాంటిక్ సీన్స్:

Advertisement

కావ్య ఉల్లిపాయలు కట్ చేస్తుంటే సుధీర్ దగ్గరకు వెళ్లి ఆమె చేయి పట్టుకుని మరీ కట్ చేయించడంలో సహాయం చేశాడు. ఈ క్రమంలో కళ్లమ్మట నీళ్లు వస్తున్నాయని కావ్య అనగానే, సుధీర్ ఎంతో రొమాంటిక్‌గా ఆమె ముఖం మీద పడిన జుట్టును చెవి వెనక్కి సర్దాడు. ఇక బ్యాక్‌గ్రౌండ్‌లో రొమాంటిక్ సాంగ్స్ ప్లే అవ్వడం, సుధీర్ సిగ్గుపడిపోవడంతో సెట్‌లో ఉన్న సుమ, అమర్‌దీప్ లు వేసిన పంచ్‌లు ప్రోమోకే హైలైట్‌గా నిలిచాయి.

ALSO READ: నోరుజారిన ముఖేష్.. కన్నీళ్లు పెట్టుకున్న నీతూ.. ఇలా తయారయ్యారేంట్రా?

సుధీర్‌తో పెళ్లి రూమర్‌పై కావ్య రియాక్షన్:

Advertisement

ఇక షోలో సుమ “మీ మీ లైఫ్‌లలో విన్న అతిపెద్ద గాసిప్ ఏంటి?” అని ప్రశ్నించగా కావ్య శ్రీ వెంటనే రియాక్ట్ అయింది. సుధీర్ వైపు చూస్తూ.. “నువ్వు, నేను త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నామంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టేశారు” అని చెప్పింది. దానికి నవ్వుతూ స్పందించిన కావ్య.. “ఏముందిలే, ఈ గాసిప్ మీద వచ్చే రోజుల్లో మరో నాలుగైదు టీవీ ఈవెంట్లు ప్లాన్ చేస్తారు” అని సెటైర్ వేయడంతో అక్కడున్న వారంతా నవ్వేశారు.

ఇక మొత్తానికి చూస్తే, రష్మీ తర్వాత సుధీర్ పేరును ఇప్పుడు యాంకర్ కావ్య శ్రీతో లింక్ చేస్తూ సోషల్ మీడియాలో కొత్త రూమర్లు పుట్టుకొచ్చాయి. అయితే అవన్నీ కేవలం ప్రచారంలో ఉన్న గాసిప్స్ మాత్రమేనని ఈ కుకింగ్ షో ప్రోమోతో స్పష్టమైంది. ఇక బుల్లితెరపై సుధీర్, కావ్య కలసి చేసిన ఈ సరదా హంగామా ఫ్యాన్స్‌కు మంచి వినోదాన్ని పంచుతోంది..

Related News

నోరుజారిన ముఖేష్.. కన్నీళ్లు పెట్టుకున్న నీతూ.. ఇలా తయారయ్యారేంట్రా?

7వ వారం నామినేషన్ లో నిలిచింది ఎవరంటే?

త్రివిక్రమ్ కమెడియన్ సునీల్ మధ్య గొడవలు.. ఇన్నాళ్లకు బయటపడ్డాయా?

షాలిని చెల్లా.. ఈ సడన్ ట్విస్ట్ ఏంటి రోహిత్?

పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ..వరుడు ఎవరంటే..?

ముఖేష్ ను అడ్డుపెట్టుకొని వర్షిని సర్వైవ్ అవుతోందా? నీతూ షాకింగ్ కామెంట్స్!

Karthika Deepam2 : వంటలక్క ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. విలన్ అవుట్..

Big Stories

Advertisement
×