Rohit Sharma On Vaibhav Sooryavanshi: టీమిండియా కుర్ర క్రికెటర్ 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీపై హిట్ మ్యాన్ రోహిత్ శర్మ హాట్ కామెంట్స్ చేశారు. వాడు 15 ఏళ్ల బుడ్డోడేనని…వాడికేం చేతకాదు అంటూ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. చిన్న వయసులో టీమిండియాలోకి వచ్చాడు కానీ… ఇంకా ఎదగాల్సిన సమయం ఉందన్నారు. అలాగే ఈ బుడ్డోడికి తన కారు అస్సలు ఇవ్వనంటూ తేల్చి చెప్పాడు. 22 సంవత్సరాలు పూర్తయితేనే, వైభవ్ డ్రైవింగ్ చేయాలని పేర్కొన్నాడు. అప్పటి వరకు అతడు ఎలాంటి వాహనాలు నడపకూడదని సూచించాడు.
న్యూజిలాండ్ టూర్ వెళ్తున్న క్రమంలో రోహిత్ శర్మను (Rohit Sharma) వైభవ్ సూర్యవంశీ ( Vaibhav Sooryavanshi) కలిసాడు. ఈ సందర్భంగా కొత్త కారు రోహిత్ శర్మ కొనుగోలు చేస్తే, తానే ముందు డ్రైవింగ్ చేస్తానని సరదాగా అన్నాడు వైభవ్ సూర్యవంశీ. దీంతో వెంటనే సీరియస్ అయిన రోహిత్ శర్మ…ఒరేయ్ నువ్వు ఇంకా బచ్చా గాడివే ? నువ్వు ముందు టీమిండియాలో స్థానం కోసం ప్రయత్నించు.. 22 సంవత్సరాలు దాటిన తర్వాత డ్రైవింగ్ పైన ఫోకస్ చేయాలని హితువు పలికారు. అప్పటి వరకు డ్రైవింగ్ చేయకూడదని అది చట్టరీత్యా నేరమన్నారు. అలా కాదని 15 ఏళ్ల వయసులోనే నువ్వు డ్రైవింగ్ చేస్తే పెను ప్రమాదమేనని హెచ్చరించారు. దీంతో వీళ్లిద్దరి మధ్య జరిగిన సంభాషణ వైరల్ గా మారింది.
15 ఏళ్ల వయసులోనే టీమిండియాలోకి వచ్చిన వైభవ్ సూర్య వంశీ ( Vaibhav Sooryavanshi)… మొన్నటి వరకు జరిగిన విండీస్ టి20 సిరీస్ లో మాత్రం తుది జట్టులో స్థానం సంపాదించుకోలేకపోయాడు. సంజు శాంసన్ ఓపెనర్ గా ఉన్న నేపథ్యంలో ఐదు టి20 లలో వైభవ్ సూర్యవంశీని పక్కకు పెట్టారు. చాలా మంది సీనియర్లు వైభవ్ ను ఆడించాలని మీడియా ముందుకు వచ్చి మొత్తుకున్నా… సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా గౌతమ్ గంభీర్ మాత్రం వినలేదు. వైభవ్ సూర్యవంశీకి ఏజ్ తక్కువేనని… భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయని టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా క్లారిటీ ఇచ్చాడు.
అక్టోబర్ 22వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్న న్యూజిలాండ్ టీమిండియా టి20 సిరీస్ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో అవకాశం వస్తుందని అంటున్నారు. విదేశీ గడ్డలపై గతంలో కూడా ఇతడికి అవకాశాలు ఉండకాయి. జింబాబ్వే పైన అద్భుతంగా రాణించి టీమిండియాను గెలిపించాడు. ఈ క్రమంలో న్యూజిలాండ్ గడ్డపై కచ్చితంగా వైభవ్ ఆడతాడని అంచనా వేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.