E-Paper
Advertisement

Premante Movie: ఏఎంబీ థియేటర్లో ‘ప్రేమంటే’ టీమ్ స్నానాలు.. ఇదెక్కడి ప్రమోషన్‌రా బాబు!

Premante Movie: ఏఎంబీ థియేటర్లో ‘ప్రేమంటే’ టీమ్ స్నానాలు.. ఇదెక్కడి ప్రమోషన్‌రా బాబు!
Advertisement

Premante Movie: సాధారణంగా ఏ బిజినెస్ కైనా ప్రమోషన్ అనేది చాలా అంటే చాలా ముఖ్యం. ఎన్ని కోట్లు పెట్టి బిజినెస్ చేసినా కూడా దాన్ని ప్రజల మధ్యకి తీసుకురావాలి. అది ప్రజల నోటిలో నానితేనే లాభాలు అనేవి ఎక్కువ వస్తాయి. అలాగే సినిమా విషయంలో.. ఎంత డిఫరెంట్ గా, ఎంత ఎక్కువగా ప్రమోషన్స్ చేస్తే సినిమా సక్సెస్ కు అంత దగ్గరగా వెళ్లినట్లు అని చెప్పొచ్చు. అందుకే ఈమధ్య మేకర్స్ సినిమాకు బడ్జెట్ ఎంత పెట్టామో అనే దానికన్నా ప్రమోషన్స్ కి ఎంత ఖర్చు చేసాము అనేది ఆలోచిస్తున్నారు.  ఎంత ఖర్చైనా పర్వాలేదు ప్రజల మధ్యకు మన సినిమా వెళ్ళాలి అని డిఫరెంట్ గా  ప్రమోషన్స్ చేయడం మొదలుపెట్టారు.

కొంతమంది తమ కథకు సంబంధించినట్లు హారర్ సినిమా అయితే దయ్యాలుగా మారి నడిరోడ్డు మీద నిలబడుతున్నారు. ఇంకొందరు ప్రజలను భయపెట్టడానికి అస్తిపంజరాలను రోడ్డు పక్కన ఉంచుతున్నారు. మరికొందరు కిడ్నాప్ చేసినట్లు ఫ్రాంక్ వీడియోలు చేస్తున్నారు. ఇలా ఎవరి దారి వారిది.  తాజాగా ప్రేమంటే థ్రిల్లు ప్రాప్తిరస్తు సినిమా టీమ్  ఏకంగా ఏఎంబి మాల్ నే తమ ప్రమోషన్ కి వాడుకుంది.

Advertisement

ప్రియదర్శి, ఆనంది జంటగా నవనీత్ శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ప్రేమంటే. ఈ చిత్రంలో యాంకర్ సుమ ఒక కీలక పాత్రలో నటిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు సినిమాపై అంచనాలను కూడా పెంచేసింది. ఇక ఈ సినిమా నవంబర్ 21న ప్రేక్షకులకు రానుంది.రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్ర బృందం ఒకపక్క వరుస ఇంటర్వ్యూలు ఇస్తూనే ఇంకోపక్క  ప్రేక్షకుల్ని తమ వైపు తిప్పుకోవడానికి నానా తిప్పలు పడుతున్నారు.

సోషల్ మీడియాలో ఏది వైరల్ అయితే దానికి తగ్గట్టే మేకర్స్ కూడా ప్రమోషన్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ మధ్యనే ఏఎంబి లో షవర్ ఉంది అంటూ ఒక వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. మాల్ లో  షవర్ ఉండడమేంటి అని అనుకోవచ్చు. కాకపోతే చాలామందికి తెలియని విషయం ఏంటంటే మహేష్ బాబు నిర్మించిన ఆ మాల్ బాత్రూమ్స్ లో షవర్స్ కూడా ఉన్నాయి. అక్కడ స్నానం కూడా చేయొచ్చు. ఈ విషయం ఒక యూట్యూబ్ రీవిల్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. ఇక ఆ వైరల్ వీడియోను ఉపయోగించుకొని ప్రేమంటే టీమ్  కూడా ఏఎంబికి వెళ్లి షవర్ బాత్ కోసం వచ్చినట్లు ఒక ప్రమోషనల్ వీడియోను చేశారు.

Advertisement

ఇందులో ప్రియదర్శి, ఆనంది, సుమ చేతులో టవల్స్, షాంపూలతో ఏఎంబి మాల్ కి వెళ్లి అక్కడ స్నానం చేయడానికి వచ్చామని చెప్పారు. టికెట్ ఉంటేనే లోపలికి పంపిస్తామని మేనేజర్ అనగా ప్రేమంటే సినిమాకి వచ్చినట్లు చెప్పి బాత్ రూమ్ లోకి  వెళ్తుండగా అక్కడ జబర్దస్త్ రాంప్రసాద్ బయటికి రావడం.. తను రోజు ఇక్కడి నుంచే స్నానం చేసి జబర్దస్త్ షో కి వెళ్తానని చెప్పడం.. సుమ సైతం  తన సుమా అడ్డా షో కూడా ఇక్కడే స్నానం చేసి వెళ్తానని చెప్పడం వినోదాత్మకంగా ఉంది.  ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇలాంటి కొత్త ప్రమోషన్స్ చూసి నెటిజన్స్  ఇదెక్కడి ప్రమోషన్ రా బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ప్రేమంటే సినిమాతో ప్రియదర్శి ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×