ఢిల్లీలో జరిగిన యూఎస్-ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికలపై వారికి వివరించారు. ఇండో-యూఎస్ సమ్మిట్ కోసం పలు కంపెనీల ప్రతినిధులను సీఎం రేవంత్ తెలంగాణకు రావాలని ఆహ్వానించారు.
హనుమకొండ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. విద్యార్థి సంఘాల దాడి నేపథ్యంలో ప్రైవేట్ విద్యాసంస్థలు బంద్ పాటించాయి. ప్రైవేట్ స్కూల్స్, కాలేజీ యాజమాన్యాలు, ఉపాధ్యాయులు భారీగా తరలి వచ్చి కలెక్టరేట్ ముందు ఆందోళన చేశారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు.
అర్హులైన పేదలకు ఇళ్లను అప్పగించి వారితో గృహప్రవేశాలు చేయించారు సీఎం చంద్రబాబు. దీనికి జగన్ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబుది ‘క్రెడిట్ చోరీ స్కీం’ అంటూ జగన్ ట్వీట్ చేశారు. 18 నెలల్లో ఒక్క గజం స్థలం సేకరించకుండా.. ఒక్కరికి ఒక్క సెంటు స్థలం కూడా ఇవ్వలేదన్నారు. వైసీపీ హయాంలో నిర్మించిన ఇళ్లను పేదలకు పంచడమే క్రెడిట్ చోరీ స్కీం అని జగన్ విమర్శించారు.
సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 17న క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక చర్చించనున్నారు. అలాగే జూబ్లీహిల్స్‌లో బైపోల్‌లో కాంగ్రెస్ గెలుపై ధీమాగా ఉన్నారు.
8 నెలల నుంచి తమకు బిల్లులు చెల్లించడం లేదంటూ పాడి రైతులు యాదాద్రి భువనగిరి నార్మల్ మదర్ డైరీ పాల శీతలీకరణ కేంద్రం ముందు ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. ప్రధాన రహదారి పై బైఠాయించటంతో ఇరు వైపులా వాహనాలు నిలిచిపోయాయి. సుమారు 120 మంది రైతులకు 24 లక్షల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని రైతులు చెబుతున్నారు.
హైదరాబాద్ దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నల్లపోచమ్మ ఆలయంలో చోరీ జరిగింది. గుడి తాళాలు పగలగొట్టి గుడిలో ఉన్న అమ్మవారి చీరలు, హుండీ డబ్బులు ఎత్తుకెళ్లడమే కాకుండా అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఆలయ కమిటీ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు ఇంఛార్జ్ సబ్ రిజిస్ట్రార్ సబ్బితి శ్రీనివాస్‌ను ఏసీబీ అధికారులమంటూ సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించారు. ఏసీబీ దాడులు చేయకుండా ఉండాలంటే మూడు లక్షలు అకౌంట్‌లో వేయాలని డిమాండ్ చేశారు. మళ్లీ మరో లక్ష వేయాలని అడగడంతో ఏసీబీ అధికారులను సంప్రదించారు. తాను మోసపోయానని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న పనులను తనిఖీ చేశారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా పనులు వేగవంతం అవుతున్నాయని అన్నారు. భక్తులు సహకరించాలని కోరారు.
చిత్తూరు జిల్లాలోని మంగళం పేట అటవీ భూముల కబ్జాపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బిగ్ ఎక్స్‌పోజ్ చేశారు. శేషాచలంలో కబ్జా సామ్రాజ్యం అంటూ పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. మంగళంపేట అటవీ భూముల్లో ఆక్రమణలు బహిర్గతం అంటూ తాను తీసిన ఏరియల్ వ్యూ వీడియోస్ మ్యాపింగ్స్‌తో సహా పోస్ట్ చేశారు.
ఢిల్లీ బ్లాస్ట్ కేసులో మొత్తం మూడు కార్లు ఇన్వాల్వ్ అయినట్టు దర్యాప్తు సంస్థలు గుర్తించారు. మూడో కారు అయిన మారుతీ బ్రెజా కోసం వేట కొనసాగిస్తున్నారు. ఆ కారును.. రెక్కీతో పాటు ఎస్కేప్ కోసం ఉపయోగించాలని ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. నిన్న రవాణాకు ఉపయోగించిన ఎకోస్పోర్ట్ కారును దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.
పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో ఓ యువకుడిపై కొందరు యువకులు దాడికి పాల్పడ్డారు. ఓబయ్య కాలనీకి చెందిన రాంబాబు ఇంటి బయట నిల్చొని ఉండగా మరియ బాబు అనే వ్యక్తి ఉమ్ము వేశాడనే నెపంతో దాడి చేశాడు. ప్రస్తుతం రాంబాబు పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు బంధువులు తెలిపారు.
చిత్తూరు జిల్లాలో ఏనుగుల దాడులు ఎక్కువయ్యాయి. కుప్పం మండల పరిధిలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. కుర్మానిపల్లిలో రాగి పంటకు కాపలా ఉన్న వ్యక్తిపై ఏనుగులు దాడి చేసి చంపేశాయి. గజ బీభత్సంతో పరిసరాల గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.
మాదక ద్రవ్యాల నుంచి కశ్మీర్ విముక్తి పొందేలా అందరూ కృషి చేయాలని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు రవిశంకర్ అన్నారు. హింస లేని సమాజం, వ్యాధి లేని శరీరం, గందరగోళం లేని మనసు, దుఃఖం లేని ఆత్మ తన కల అని చెప్పారు. ఇవి ప్రతి ఒక్కరి జన్మహక్కు అని అన్నారు.
ఢిల్లీ పేలుడుతో అప్రమత్తమైన పోలీసులు జమ్ముకశ్మీర్ అనంతనాగ్ లోయలో సోదాలు చేపట్టారు. మొత్తం 13 ప్రాంతాల్లో కశ్మీర్ కౌంటర్ ఇంటెలిజెన్స్ దాడులు చేసింది. ఇద్దరు వైద్యులతో సహా అనేక మందిని.. అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం.
భారత్-ఈయూ బిజినెస్ రౌండ్ టేబుల్‌లో సీఎం చంద్రబాబు గ్లోబల్ వార్మింగ్ విపత్తులను ప్రస్తావించారు. గ్రీన్ ఎనర్జీ సౌర, పవన, గ్రీన్ హైడ్రోజన్ వైపు కృషి చేయాలని కోరారు. ప్రకృతి సేద్యంలో పండించిన అరకు కాఫీ ఇప్పుడు గ్లోబల్ బ్రాండ్‌గా మారిందన్నారు సీఎం చంద్రబాబు. నౌకా నిర్మాణం ఆర్గానిక్ ఆహార ఉత్పత్తులలో పెట్టుబడులను ఆహ్వానించారు.
అగ్రరాజ్యం అమెరికాలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా చరిత్రలో అత్యధిక కాలం 43 రోజుల పాటు సుదీర్ఘంగా కొనసాగిన ఆర్థిక ‘షట్‌డౌన్’కు ముగింపు పడింది. అమెరికాలో షట్‌డౌన్‌ను ఎత్తివేసే ప్రభుత్వ ఫండింగ్ బిల్లుపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. దీంతో షట్‌డౌన్‌కు అధికారికంగా ముగింపు లభించింది.
భారత మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన వ్యక్తిగత జీవితం గురించి ఎవరికీ తెలియని కొత్త విషయాలను పంచుకుంది. షోయబ్‌తో విడాకుల తర్వాత భయానక పరిస్థితుల్లో గడుపుతున్న తనకు ఫరా అండగా నిలిచిందని సానియా చెప్పింది. ఆ క్షణాలు తన జీవితంలో అత్యంత భావోద్వేగభరితమైనవిగా గుర్తు చేసుకుంది.
టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఓ కీలక మైలురాయికి చేరువలో ఉన్నాడు. సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌లో అతడు 4 వేల పరుగుల మైలురాయిని అందుకునే అవకాశముంది. ఇప్పటి వరకు 65 టెస్టుల్లో 3,985 పరుగులు సాధించిన రాహుల్.. మరో 15 పరుగులు చేస్తే 4వేల పరుగుల మైలురాయిని అందుకొనున్నాడు.
రిస్క్ ఉన్న పాత్రలు చేసినప్పుడే కెరీర్‌కు మరింత విలువ పెరుగుతుందన్నారు నటి అదా శర్మ. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ది కేరళ స్టోరీ’ విడుదలైనప్పుడు చాలామంది తనను చంపాలనుకున్నారని వెల్లడించారు. ఆ సినిమా విడుదలైనప్పుడు ఎన్నో బెదిరింపులు ఎదుర్కున్నారని చెప్పారు.
నన్ను చంపాలనుకున్నారు..
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ది రాజా సాబ్. ఈ సినిమా మరోసారి వాయిదా పడనుందంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ ప్రచారంపై నిర్మాణ సంస్థ స్పందించింది. అనుకున్న సమయానికే విడుదల చేస్తామని స్పష్టం చేసింది.