E-Paper
Advertisement

Peddi : రెహమాన్ హవా మొదలైంది, త‌మ‌న్‌, దేవిశ్రీ పోటీ ఎదుర్కోవాల్సిందే

Peddi : రెహమాన్ హవా మొదలైంది, త‌మ‌న్‌, దేవిశ్రీ పోటీ ఎదుర్కోవాల్సిందే
Advertisement

Peddi : సంగీత దర్శకులు రెహమాన్ గురించి కొత్తగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. రహమాన్ చేసిన ఎన్నో సినిమాలు పాటలు తెలుగు ప్రాక్షకులు విపరీతంగా వింటారు. అవి వింటేనే ఒక రకమైన ప్రశాంతత కలుగుతుంది. రెహమాన్ సంగీతం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇకపోతే తెలుగులో ఎస్ జె సూర్య దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన కొమరం పులి సినిమాకి చివరిగా సంగీతం అందించాడు ఏఆర్ రెహమాన్.

ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని సక్సెస్ సాధించలేకపోయింది. ఆ కాంబినేషన్లో సినిమా అనౌన్స్ చేసినప్పుడే విపరీతమైన అంచనాలు ఉండేవి. ఎందుకంటే గతంలో వారిద్దరి కాంబినేషన్లో ఖుషి అనే సినిమా వచ్చింది కాబట్టి. ఆ సినిమా ఎంత సక్సెస్ అయింది అని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే కొమరం పులి సినిమా తర్వాత ఇప్పటివరకు ఏఆర్ రెహమాన్ తెలుగులో సంగీతం ఏ సినిమాకి చేయలేదు.

రహమాన్ హవా మొదలైంది 

Advertisement

ఇకపోతే ఏ ఆర్ రెహమాన్ హవా మొదలైపోయింది అని చెప్పాలి. బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా కోసం పట్టుబట్టి మరి ఏఆర్ రెహమాన్ కావాలి అని ఫిక్స్ అయ్యాడు. సుకుమార్ గారు దానిని అవుతుందో అవ్వదో అని ఆలోచనలో ఉంటే రెహమాన్ కి కథ చెప్పి ఏకంగా ఒప్పించేసాడు బుచ్చిబాబు.

బుచ్చి టాలెంట్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి సినిమాతోనే 100 కోట్లు మార్కెట్లో చేరిపోయాడు. అయితే రెహమాన్ పెద్ది సినిమాకి చేసిన చికిరి సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫేమస్. ఆ సాంగ్ దాదాపు 100 మిలియన్స్ పైగా వ్యూస్ సాధించుకుంది. పాట విడుదలైనప్పుడు కొంచెం కంప్లైంట్స్ వచ్చాయి. కానీ పాట మాత్రం ఇప్పుడు టాప్ ట్రెండింగ్ లో ఉంది.

త‌మ‌న్‌, దేవిశ్రీ పోటీ ఎదుర్కోవాల్సిందే

Advertisement

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎంతోమంది సంగీత దర్శకులు ఉన్నా కూడా ఎక్కువగా వినిపించే పేర్లు దేవిశ్రీప్రసాద్ మరియు తమన్. వీరిద్దరూ కలిసి పోటీ పోటీగా సినిమాలు చేసేవాళ్ళు. తెలుగులో సంగీత దర్శకులు ప్రస్తావన వస్తే వీళ్ళ పేర్లు మాత్రమే వినిపించేవి.

అయితే తమన్ లేకపోతే దేవిశ్రీ. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా పోటీ పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే రెహమాన్ ఆ స్టాండర్డ్స్ ఆల్రెడీ సెట్ చేశారు. పెద్ది సినిమా హిట్ అయిన తరువాత చాలామంది దర్శకులు కూడా రెహ్మాన్ ను సంగీత దర్శకుడుగా పెట్టుకోవడానికి మొగ్గు చూపుతారు.

అందుకే దేవిశ్రీ మరియు తమన్ సంగీతం కూడా ఇప్పుడు టాప్ లెవెల్ లోనే ఉండాలి. సినిమాకు సరిపడా పాటలు ఇచ్చేసాము అంటే అయిపోదు. జనాలు పాడుకునే విధంగా అవి కంపోజ్ చేస్తే టాప్ లీగ్ లో కొనసాగవచ్చు.

Also Read : Raju Weds Rambai : దర్శకుడు కి నక్సలైట్ బ్యాక్ డ్రాప్, ఈ విలక్షణమైన కథకు కారణం అదేనా?

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×