E-Paper
Advertisement

Raju Weds Rambai : దర్శకుడు కి నక్సలైట్ బ్యాక్ డ్రాప్, ఈ విలక్షణమైన కథకు కారణం అదేనా?

Raju Weds Rambai : దర్శకుడు కి నక్సలైట్ బ్యాక్ డ్రాప్, ఈ విలక్షణమైన కథకు కారణం అదేనా?
Advertisement

Raju Weds Rambai : చాలామందికి కొన్ని కథలు ఊహల్లో నుంచి పుడతాయి. కొంతమంది మాత్రమే వాళ్లకు అనిపించను కథను జన్యూన్ గా చెబుదాం అనిపిస్తుంది. కానీ ఇంకొంతమంది వాళ్ళ జీవితంలో చూసిన కథను వెండితెరపై ఆవిష్కరించాలి అంటారు. మరుగున పడ్డ నిజాన్ని ఒక కథగా చాలామందికి తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఉంటారు. అటువంటి దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. ఇటువంటి దర్శకులు ఉన్నా కూడా సక్సెస్ అవుతారు అని ఖచ్చితంగా చెప్పలేము. ఒకరకంగా అది రిస్క్. కానీ సినిమా వర్కౌట్ అయితే మాత్రం అదే లక్.

ఇకపోతే రీసెంట్ గా వచ్చిన రాజు వెడ్స్ రాంబాయి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. సినిమాలో నటించిన వాళ్ల గురించి ప్రత్యేకంగా తెలియకపోయినా కూడా చాలామంది ఆ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఇప్పటికే సినిమా సక్సెస్ఫుల్గా బాక్సాఫీస్ వద్ద కొనసాగుతుంది. అయితే ఇంత విలక్షణమైన కథను దర్శకుడు ఎంచుకొని తీయడానికి అసలైన కారణం ఏంటంటే అతనికి ఉన్న ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్. ఇంతకు సాయిలు కంపాటి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే.?

దర్శకుడు ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్

Advertisement

2004వ సంవత్సరంలో ఒరిజినల్ గా జరిగిన కథ ఇది అప్పటికి మేము చాలా చిన్న పిల్లలం. అప్పట్లో ఈ కథ సంచలనం. ఈ కథను మా నాన్న వాళ్ళు ఎక్కువగా వినేవాళ్ళు. మా పెదనాన్న నక్సలైట్. అప్పట్లో నేను పెద్దగా దానిని పట్టించుకోలేదు. కానీ కొన్ని రోజులు తర్వాత ఇది నన్ను అలా వెంటాడుతూ వచ్చింది. ఈ దాచబడిన కథను చెప్పడానికి ఈ డోలముఖి ఫిలిమ్స్ బ్యానర్ క్రియేట్ అయింది. అందుకే ఈ కథను చెప్పాలనుకున్నాము చేశాం.

మొత్తానికి సాయిలు ఇటువంటి విశిష్టమైన కథను ఎంచుకోవడానికి కారణం తనకి ఒక నక్సలైట్ బ్యాక్ డ్రాప్ ఉండటమే. అయితే రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కూడా ఆ పెదనాన్న నక్సలైట్ చెప్పొచ్చో లేదో అని డౌట్ గా చెప్పాడు. అలానే ఆ వెంకన్న అనే వ్యక్తికి ఎటువంటి శిక్ష విధించారు అన్నలు అని ప్రముఖ యాంకర్ అడిగితే. అతను కొన్ని రోజుల తర్వాత సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు అంటూ చెప్పాడు సాయిలు.

రియల్ లైఫ్ లో తన సమాధి తానే 

Advertisement

ఈ సినిమా గ్రాటిట్యూడ్ ఈవెంట్లో నిర్మాత మాట్లాడుతూ… రియల్ లైఫ్ లో ఈ వెంకన్న అనే పాత్ర ఎవరైతే ఉన్నారో తన సమాధి తానే కట్టుకున్నాడు అది కొన్ని కారణాల వలన మేము చూపించలేకపోయాం అని చెప్పారు. మొత్తానికి బాక్స్ ఆఫీస్ వద్ద ఈ విశిష్టమైన కథకు విశేష స్పందన లభిస్తుంది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అయిపోయి లాభాల బాటలో ఈ సినిమా నడుస్తుంది. ఒక మంచి సినిమా వస్తే ఎంకరేజ్ చేయడానికి తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ ముందుంటారు అని ఈ సినిమా మరోసారి ప్రూవ్ చేసింది.

Also Read: Bigg Boss 9 Telugu : హౌస్‌లో కొట్టుకున్న కళ్యాణ్ – పవన్… బిగ్ బాస్ సంచలనం నిర్ణయం.. అతను హౌస్ నుంచి అవుట్?

Related News

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

Big Stories

Advertisement
×