E-Paper
Advertisement

Green Peas: చిన్నా పెద్దా అందరూ తినొచ్చు.. పచ్చి బఠానీలు పలు వ్యాధులకు తిరుగులేని దివ్యౌషధం!

Green Peas: చిన్నా పెద్దా అందరూ తినొచ్చు.. పచ్చి బఠానీలు పలు వ్యాధులకు తిరుగులేని దివ్యౌషధం!
Advertisement

Green Peas: శీతాకాలం మొదలైంది.. బయట చలి చంపేస్తుంది.. ఇలాంటి సీజన్లో ఆరోగ్యంగా ఉండాలంటే.. మంచి పోషకాలు కూడిన ఆహారాన్ని తీసుకోవాలి. ఇకపోతే పచ్చి బఠానీలు శీతాకాలంలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో మన శరీరానికి కావాల్సిన పోషకాలు మెండుగా ఉంటాయి. చిన్న పిల్లల దగ్గరి నుంచి పెద్దల వరకు అందరికీ పచ్చి బఠానీలు మంచి ఇమ్యూనిటీ బూస్టర్‌గా పనిచేస్తుంది. అప్పుడే సీజనల్ ఇన్ఫెక్షన్స్ నుంచి తప్పించుకోవచ్చు. పచ్చి బఠానీలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఈ నేపథ్యంలో పచ్చి బఠానీలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఓసారి చూసేద్దాం..

జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా..

శీతాకాలంలో పచ్చి బఠానీలను మన ఆహారంలో భాగం చేసుకుంటే.. ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. గ్రీన్ పీస్‌లో విరివిగా లభించే డైటరీ ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. తద్వారా ఆహారాన్ని సరైన రీతిలో జీర్ణించుకోవడంలో సహాయపడుతుంది. దీంతోపాటు పచ్చి బఠానీలు మలబద్ధకాన్ని నివారించడంలో ఎంతగానో తోడ్పడుతుంది.

Advertisement

Read Also: ఎంతసేపూ చికనూ మటనేనా.. అలసందల్లోనూ పోషకాలు మెండుగుంటాయ్!

గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది:

తరచూ పచ్చి బఠానీలు తీసుకోవడం వలన గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఇది గుండెకు సంబంధించిన రుగ్మతల నుంచి కాపాడుతుంది. అలాగే పచ్చి బఠానీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి.

రక్తంలో చక్కెర నియంత్రణ:

Advertisement

పచ్చి బఠానీలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వలన.. ఇది రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రణలో ఉంచుతుంది. మధుమేహ సమస్యలు ఉన్నవారు తరచూ పచ్చి బఠానీలు తీసుకుంటే.. ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఉపయోగకంగా ఉంటుంది.

శక్తిమంతమైన ఆహారం:

శారీరక శ్రమ, వ్యాయామాలు చేసేవారికి పచ్చి బఠానీ మంచి ప్రొటీన్ ఫుడ్‌. దీనిలో ప్రొటీన్లు, ఐరన్, మెగ్నీషియం వంటి ఖనిజాలు అధికంగా ఉండటం వల్ల ఇది శరీరాన్ని దృఢంగా ఉంచుతుంది. అలాగే శరీరానికి కావాల్సిన శక్తిని అందించడంలో పచ్చి బఠానీలు కీలకంగా వ్యవహరిస్తుంది.

రోగ నిరోధక శక్తి పెరుగుతుంది:

పచ్చి బఠానీలో సి, ఎ విటమిన్స్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీంతో శరీరంలోని రోగనిరోధక శక్తిని బలపరుచుకోవచ్చు. పచ్చి బఠానీలు వైరస్, బ్యాక్టీరియా దాడుల నుంచి రక్షణ కల్పిస్తాయి. దీనిని మీ ఆహారంలో చేర్చడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు సమృద్ధిగా అందుతాయి.

Read Also: సీజనల్ వ్యాధులకు చెక్.. శీతాకాలంలో ఈ కూరగాయలు తింటే నిండు ఆరోగ్యం!

Related News

థీమ్ పార్కుకు వెళుతున్నారా? జాగ్రత్త రోలర్ కోస్టర్ రైడ్స్‌తో మెదడుకు ప్రమాదం

పిల్లలు వద్దనుకోవడం స్వార్థమా? సమాజం చేసే విమర్శలకు సమాధానమిదే

భార్యా, తల్లా.. ఇద్దరి మధ్య నలిగిపోకుండా భర్త ఏం చేయాలి?

పిల్లల ఆరోగ్యంతో చెలగాటం వద్దు.. బేబీ ఫుడ్‌లో చక్కెరపై FSSAI కీలక ఆదేశాలు!

ఈ 3 అలవాట్లే మంచి మనుషుల బలహీనతలు.. మీరూ ఇవే తప్పులు చేస్తున్నారా?

LED ఫేస్ మాస్క్ ముఖంపై ముడతలు తగ్గిస్తుందని ప్రచారం.. నిజంగా పనిచేస్తుందా?

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

Big Stories

Advertisement
×