E-Paper
Advertisement

Biker: ప్రెట్టీ బేబీ సాంగ్ ప్రోమో.. పొట్టి గౌన్ లో మాళవిక.. అస్సలు ఊహించలేదే

Biker: ప్రెట్టీ బేబీ సాంగ్ ప్రోమో.. పొట్టి గౌన్ లో మాళవిక.. అస్సలు ఊహించలేదే
Advertisement

Biker: ఇండస్ట్రీలో హిట్ దక్కని కుర్ర హెరోలు చాలామంది ఉన్నారు. కొందరేమో ఇంకా స్ట్రగుల్స్ అవుతూనే ఉన్నారు. ఇంకొందరు సైలెంట్ గా ఉండిపోయారు. అయితే వెనుక ఎంత డబ్బు ఉన్నా తన టాలెంట్ తో ఛాన్స్ పట్టేసి, చిన్న చిన్న పాత్రలు చేస్తూ హీరోగా ఎదిగి స్టార్ గా మారిన శర్వానంద్ మాత్రం ఎలాగైనా ఈసారి హిట్ కొట్టలానే పట్టుదలతో ఉన్నాడు. ప్రస్తుతం శర్వా చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి నారీ నారీ నడుమ మురారి. ఈ సినిమా షూటింగ్ ఫినిష్ చేసుకుంటుంది. వచ్చే సంక్రాంతి బరిలో దిగుతుంది.

ఇక ఇది కాకుండా మరో సినిమా బైకర్. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శర్వా సరసన మాళవిక నాయర్ నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి. బైకర్ సినిమా కోసం శర్వా ఏకంగా 20 కేజీల బరువు తగ్గాడట. ఈ సినిమాలో టీనేజర్ లుక్ లో కనిపించాలని అంతా సాహసం చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రం డిసెంబర్ 6 న ప్రేక్షకుల ముందకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ తాజాగా బైకర్ చిత్రం లోని మొదటి లిరికల్ సాంగ్ రిలీజ్ కు ముహూర్తం పెట్టారు.

Advertisement

ప్రెట్టీ బేబీ అంటూ సాగే సాంగ్ ప్రోమోను కూడా రిలీజ్ చేశారు. సాంగ్ చాలా కలర్ ఫుల్ గా ఉంది. ముఖ్యంగా శర్వా, మాళవిక పెయిర్ చూడచక్కగా అనిపించింది. మాళవిక ఇప్పటివరకు చాలా పద్దతైన పాత్రల్లో.. గ్లామర్ ఒలకబోయని పాత్రల్లో కనిపించింది. ఇక ఈ సాంగ్ లో అమ్మడు మోకాళ్ళ పైకి ఉన్న పొట్టి డ్రెస్ లో కనిపించి షాక్ ఇచ్చింది. ప్రెట్టీ బేబీ సాంగ్ కు తగ్గట్టే అమ్మడు కూడా చాలా ప్రెట్టీగా అనిపించింది. మాళవికను చూసిన నెటిజన్స్ అమ్మ బాబోయ్ .. అమ్మడిని ఈ రేంజ్ లో అస్సలు ఊహించలేదుగా అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ ఫుల్ సాంగ్ నవంబర్ 13 న రిలీజ్ చేయనున్నారు. మరి ఈ సినిమాతోనైనా శర్వా హిట్ అందుకుంటాడేమో చూడాలి.

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×