E-Paper
Advertisement

GlobeTrotter Event : రాజమౌళి షూటింగ్ లో నన్ను టార్చర్ పెట్టాడు

GlobeTrotter Event : రాజమౌళి షూటింగ్ లో నన్ను టార్చర్ పెట్టాడు
Advertisement

GlobeTrotter Event : తెలుగు ప్రేక్షకులకు ఒక సినిమా బాగుంది అని సోషల్ మీడియాలో పోస్ట్ కనిపించిన దాన్ని వెతుక్కుని మరి చూడటం అలవాటు చేసుకున్నారు. అలా చాలా సినిమాలు చూస్తూ మలయాళీ దర్శక నటుడు పృధ్విరాజ్ సుకుమారన్ యాక్టింగ్ కి చాలామంది ఫిదా అయిపోయారు. దర్శకుడుగా కూడా అతని ప్రతిభ చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది.

ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన వారణాసి సినిమాలో పృథ్వీరాజ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈవెంట్ నేడు రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుంది. ఈ ఈవెంట్లో పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ చాలా ఆసక్తికర కామెంట్స్ చేశారు.

రాజమౌళి టార్చర్ పెట్టారు 

Advertisement

ఈ సినిమా కథను చెప్పిన ఐదు నిమిషాల్లోనే పృథ్వీరాజ్ సుకుమారన్ షాక్ అయిపోయారట. పృధ్విరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ “నెరేషన్ ప్రారంభమైన ఐదు నిమిషాల్లోనే నేను షాక్ అయ్యాను. భయం, విజన్, అంబిషన్ — నెరేషన్‌లోని ప్రతి అంశం ఒక విషయంలో స్పష్టంగా కనిపించింది. ఈ సినిమాలో పాత్ర నన్ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తుంది అని చెప్పాడు పృథ్వీరాజ్.

పృథ్వీరాజ్ మాట్లాడుతూ ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఎవరు ఊహించని విధంగా రాజమౌళి తీస్తున్నారు. అలానే షూటింగ్లో టార్చర్ పెడుతున్నారు అంటూ చెప్పాడు పృథ్వి. పృద్వి ఈ మాట చెప్పగానే ఒకసారిగా అంతా పగలబడి నవ్వారు.

Advertisement

ఒక సీన్ పర్ఫెక్ట్ గా రావడం కోసం రాజమౌళి ఎంతలా కష్టపడతారు అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. రామ్ చరణ్, ఎన్టీఆర్ చేసిన నాటు నాటు పాటకి ఏకంగా 17 టేకులు తీసుకున్నారు. దాన్లో రెండవ టేక్ కన్ఫర్మ్ చేశారు. అందుకే రాజమౌళి అందరూ జక్కన్న అని పిలుస్తుంటారు.

నా ఫేవరెట్ ఫిలిం 

ఇక మహేష్ బాబు గురించి మాట్లాడుతూ నాకు బాగా గుర్తుండి నేను చూసిన మొదటి తెలుగు సినిమా పోకిరి అంటూ చెప్పారు. అలానే ప్రియాంక చోప్రా గురించి మాట్లాడుతూ బర్ఫీ సినిమాలోని జిల్మిల్ అనే పాత్ర నాకు ఎప్పటికీ ప్రత్యేకమే. నాకు తెలిసి ఇండియన్ యాక్ట్రెస్ లో ఆ స్థాయి పెర్ఫార్మెన్స్ చేయడం గ్రేట్ అంటూ ప్రియాంక చోప్రా గురించి మాట్లాడారు. జిల్మిల్ పాత్ర నుంచి మందాకిని పాత్రకు నిన్ను నువ్వు మలుచుకున్న విధానం నెక్స్ట్ లెవెల్ అంటూ ప్రియాంక చోప్రా గురించి కితాబిచ్చారు.

Also Read: GlobeTrotter Event : గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ లో అంతా పోకిరి నామస్మరణ, పూరి ఇది చూడవయ్యా

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×