E-Paper
Advertisement

OTT Movie : గ్రామంలో వరుస హత్యలు… 20 ఏళ్ళ తరువాత సేమ్ సీన్ రిపీట్… ట్విస్టులతో పిచ్చెక్కించే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : గ్రామంలో వరుస హత్యలు… 20 ఏళ్ళ తరువాత సేమ్ సీన్ రిపీట్… ట్విస్టులతో పిచ్చెక్కించే సస్పెన్స్ థ్రిల్లర్
Advertisement

OTT Movie : ఒక పంజాబీ మూవీ, క్రైమ్ థ్రిల్లర్ ఫ్యాన్స్ కి స్పైన్ చిల్లింగ్ తెప్పిస్తోంది. ఒక గ్రామంలో జరిగే వరుస హత్యలతో, పోలీస్ ఇన్వెస్టిగేషన్ తో ఈ సినిమా కుర్చీలకు అతుక్కునేలా చేస్తోంది. ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అవ్వకుండా నేరుగా ఓటిటిలోకి వచ్చింది. అయితే డిజిటల్ స్ట్రీమింగ్ లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. క్రైమ్ థ్రిల్లర్ మూవీ లవర్స్ కి మస్ట్ వాచ్ మూవీగా చెప్పుకోవచ్చు. ఇది ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది ? దీని పేరు ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

ఈ పంజాబీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘నసీబ్‌పురా’ (Nasibpura). వింకల్ చౌహాన్ దర్శకత్వంలో నవదీప్ కాలర్, మైఖేల్ ధిల్వా, మల్కీత్ రౌని, సామ్యూల్ జాన్, రాజ్ ధాలివాల్, కులదీప్ నియామి లీడ్ రోల్స్ లో నటించారు. 2024 డిసెంబర్ 1న ఈ సినిమా చౌపల్‌లో ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చింది. 1 గంట 30 నిమిషాల నిడివితో ఐయండిబిలో 6.0/10 రేటింగ్ పొందింది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఈ స్టోరీ పంజాబ్‌లోని నసీబ్‌పురా అనే ఒక చిన్న గ్రామం లో మొదలవుతుంది. ఇక్కడ అందరూ ప్రశాంతంగా ఉంటారు. ఒక్కసారిగా వింత మర్డర్స్ మొదలవుతాయి. మొదటి మర్డర్: ఒక మహిళను దారుణంగా కత్తితో పొడిచి, ఖాళీ పొలంలో వదిలేస్తారు. ఆ మర్డర్ తో గ్రామస్తులు భయపడతారు. రాత్రి పూట బయటకు కూడా రారు. పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఈ కేసు దర్యాప్తు మొదలెడతాడు. అతను గ్రామంలో తిరిగి, ప్రతి ఒక్కరినీ క్వశ్చన్ చేస్తాడు. కానీ ఇంతలోనే మళ్లీ అదే స్టైల్ లో మరో మర్డర్ జరుగుతుంది. ఈ దర్యాప్తులో 20 ఏళ్ల క్రితం పంజాబ్ లో మరొక గ్రామంలో జరిగిన అన్‌సాల్వ్డ్ మర్డర్స్‌తో పూర్తిగా మ్యాచ్ అవుతుంది. అప్పటి కేసు ఇప్పటికీ క్లోజ్ కాలేదు. కిల్లర్ ఎవరో కూడా తెలియలేదు.

Read Also : మిస్టీరియస్ గా మర్డర్ కేసులు… మదర్ సెంటిమెంట్ తో క్రేజీ బెంగాలీ క్రైమ్ థ్రిల్లర్

Advertisement

పోలీస్ టీమ్ పాత ఫైల్స్ ఓపెన్ చేస్తారు. అప్పటి మర్డర్స్ కూడా ఇదే పద్దతిలో రాత్రి పూట కత్తితో పొలాలలో అటాక్ చేసి చంపి ఉంటారు. దర్యాప్తు ముందుకు సాగుతుంటే, పోలీస్ టీమ్‌కి క్లూలు వస్తాయి. మొదటి మర్డర్‌లో ఒక పాత డైరీ దొరుకుతుంది, అందులో 20 ఏళ్ల క్రితం జరిగిన మర్డర్స్ గురించి రాసి ఉంటుంది. ఆ గ్రామంలోనే ఎవరో ఒకరు కిల్లర్ అని పోలీసులకి అనుమానం వస్తుంది. మొదట గ్రామ పెద్దను సస్పెక్ట్ చేస్తారు. ఆ తరువాత ఒక్కో నిజం బయటకి వస్తుంది. కిల్లర్ ఒక వ్యక్తి కాదని, ఇది ఒక గ్యాంగ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక క్లైమాక్స్ ఎప్పుడూ జరిగినట్లే ఉత్కంఠంగా నడుస్తుంది. చివరికి పోలీసులు ఆ గ్యాంగ్ ని పట్టుకుంటారా ? వాళ్ళు ఎందుకు హత్యలు చేస్తున్నారు ? అనే ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ పంజాబీ క్రైమ్ థ్రిల్లర్ మూవీని చూసి తెలుసుకోండి.

 

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×