Idupukayitham Release: నటుడు ప్రియదర్శి ఎన్నో విభిన్నమైన కథ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ప్రియదర్శి సినిమాలన్నీ కూడా తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాల నేపథ్యంలోనే విడుదలవుతూ ఉంటాయి. ఇలా విభిన్నమైన కథ చిత్రాలను ఎంపిక చేసుకుంటూ బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలతో ప్రియదర్శి ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు. ఇక త్వరలోనే ప్రియదర్శి నటించిన ‘ఇడుపు కాయితం’ (Idupu kayitham)సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
వంశీ రెడ్డి దొండపాటి దర్శకత్వంలో ప్రియదర్శి (Priyadarshi)మరియు నాగదుర్గ(Naga Durga) ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఇడుపు కాయితం సినిమాని సుకుమార్ రైటింగ్స్ మరియు బన్నీ వాస్ వర్క్స్ పతాకాలపై ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే షూటింగ్ పనులన్నీ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇకపోతే చిత్ర నిర్మాతలు ఈ సినిమా పూజా కార్యక్రమాల సమయంలోనే విడుదల గురించి క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా డిసెంబర్లో రాబోతుందని తెలియజేశారు.
ఈ విధంగా మేకర్స్ చెప్పిన విధంగానే ఇడుపు కాయితం చిత్రాన్ని డిసెంబర్ 11వ తేదీ విడుదల చేయటానికి చిత్ర నిర్మాతలు సిద్ధమయ్యారని, త్వరలోనే ఈ విడుదల తేదీకి సంబంధించి అధికారిక ప్రకటన తెలియజేయనున్నారు. ఇక ఈ సినిమా తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో కుటుంబ బాగోద్వేగాల కథాంశంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమా టైటిల్ ప్రకటించిన సమయంలో పెద్ద ఎత్తున ఈ టైటిల్ పై చర్చలు జరిగాయి.
ఈ సినిమాకు ఇడుపు కాయితం అదే టైటిల్ ప్రకటించడంతో ఈ టైటిల్ అర్థమేంటంటూ చాలామంది అప్పట్లో చర్చలు జరిపారు.ఇడుపు కాయితం అంటే తెలంగాణ భాషలో విడాకుల పత్రం అని అర్థం. చాలా మందికి ఈ పదం కొత్తగా ఉండటంతో సోషల్ మీడియాలో దీనిపై కొంత చర్చ అలాగే ట్రోలింగ్ జరిగింది. ఈ సినిమాకు తెలంగాణకు సంబంధించిన టైటిల్ పెట్టడంతో కేవలం తెలంగాణ వాళ్లు మాత్రమే చూడాలా? ఆంధ్ర వాళ్ళు చూడాల్సిన పని లేదా అంటూ కూడా అప్పట్లో ఈ టైటిల్ పై విమర్శలు వచ్చాయి. ఇలా విభిన్నమైన టైటిల్ తో రాబోప్రేక్షకుల ముందుకు రాబోతున్న ప్రియదర్శి ఎలాంటి సక్సెస్ అందుకుంటారనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో ఫోక్ సాంగ్స్ ద్వారా ఎంతో ఫేమస్ అయిన నాగ దుర్గ హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం అవ్వబోతున్నారు.ఇక ప్రియదర్శి ఇటీవల నాని ది ప్యారడైజ్ సినిమాలో శంకరన్న అనే పాత్రలో కేసీఆర్ గా నటించి మంచి ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే.
Also Read: కొత్త బంగారులోకం 2 పై వరుణ్ సందేశ్ బిగ్ అప్డేట్.. సీక్వెల్ సినిమా రాబోతోందా?