E-Paper
Advertisement

2028లో నాయకులను చెప్పులతో కొడతారు..జేసీ ప్రభాకర్ రెడ్డి షాకింగ్ కామెంట్స్!

2028లో నాయకులను చెప్పులతో కొడతారు..జేసీ ప్రభాకర్ రెడ్డి షాకింగ్ కామెంట్స్!
Advertisement

JC Prabhakar Reddy: అనంతపురం జిల్లా రాజకీయాల్లో ఎప్పుడూ తనదైన శైలిలో మాట్లాడే తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మళ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఇచ్చే నిధులతో మాత్రమే పనులు చేయడాన్ని అభివృద్ధి అనరని, సొంత ఆలోచనలు, ప్రణాళికలతో నిధులు సమీకరించి పనులు పూర్తి చేయడమే అసలైన అభివృద్ధి అని ఆయన స్పష్టం చేశారు.

తాడిపత్రికి అంతర్జాతీయ డ్రైవింగ్ సెంటర్..

Advertisement

తన సొంత ఆలోచనలతోనే నిధులు తీసుకువచ్చి తాడిపత్రి మున్సిపల్ కార్యాలయం రూపురేఖలను పూర్తిగా మార్చివేశానని ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఇదే తరహాలో అనంతపురం జిల్లా పరిషత్‌ను కూడా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలోనే తాడిపత్రికి ఒక భారీ ప్రాజెక్టు రాబోతోందని, దేశంలో కేవలం రెండు చోట్ల మాత్రమే ఉన్న ‘ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ సెంటర్’ను తాడిపత్రికి తీసుకవస్తున్నట్లు వెల్లడించారు.

రాజకీయాల్లో మార్పులు.. ఎన్నికలపై ధీమా

Advertisement

రాబోయే రోజుల్లో స్థానిక రాజకీయాల్లో మార్పులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగానే యల్లనూరు టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థిగా ఒక ఎంటెక్ చదివిన యువతిని పోటీలో నిలబెడుతున్నానని, గెలుపోటములతో సంబంధం లేకుండా ఆ ప్రాంతంలో ఫ్యాక్షన్ సంస్కృతిని అంతం చేయడమే తన లక్ష్యమని వ్యాఖ్యానించారు.

నాకు ఎన్నికలంటే భయం లేదు..

ఎన్నికలు అంటే తనకు ఎలాంటి భయం లేదని స్పష్టం చేశారు. ‘గతంలో మా అన్న పనిచేశారు, నేను పనిచేశాను, ఇప్పుడు నా కొడుకు కూడా ప్రజల కోసం పనిచేశాడు. అందుకే మాకు భయపడాల్సిన పనిలేదు’ అని ధీమా వ్యక్తం చేశారు.

ప్రజల్లో వస్తున్న మార్పుపై హెచ్చరిక

ప్రస్తుతం రాజకీయాలపై ప్రజల్లో పెద్ద ఎత్తున ఆలోచనా విధానం మారుతోందని జేసీ హెచ్చరించారు. ‘రాబోయే రోజుల్లో నేను, కేతిరెడ్డి పెద్దారెడ్డి ఒకరిపై ఒకరం రాళ్లు వేసుకుంటే.. జనం వచ్చి మా ఇద్దరిపైనా రాళ్లు వేసే పరిస్థితి వస్తుంది. 2028 నాటికి ప్రజలు రాజకీయ నాయకులను చెప్పులతో కొట్టే పరిస్థితి వచ్చినా ఆశ్చర్యం లేదు’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మార్పుల కారణంగా రాబోయే ఎన్నికల్లో నోటా (NOTA) కే ఎక్కువ ఓట్లు పడే అవకాశాలు కనిపిస్తున్నాయని అభిప్రాయపడ్డారు.

Also Read: న‌న్ను అవ‌మానించిన న‌ఖ్వీ తాట తీస్తా, పాకిస్తాన్ కు న‌ర‌కం చూపిస్తా!

Tags

Related News

స్థానిక సమరం.. సీట్ల కలవరం.. వరుసగా రెండో రోజు చంద్రబాబు, పవన్ భేటి

‘ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు’.. చంద్రబాబు, ఎస్ఈసీ తీరుపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం

జోగి రమేష్ కోడలికి రోడ్డు ప్రమాదం.. ఘటనపై అనుమానాలు.. పోలీసులకు మేఘన తండ్రి ఫిర్యాదు!

పులివెందులలో హైటెన్షన్.. ఎంపీ అవినాష్ రెడ్డికి పోలీసుల నోటీసులు!

బిగ్ బ్రేకింగ్.. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ వాయిదా!

సీఈసీ నియామక మార్పులపై జగన్ షాకింగ్ కామెంట్స్.. వీడియో వైరల్!

విజయవాడ పడమట డొంక సెంటర్‌లో యువకుడు హత్య.. నిందితులు అరెస్ట్!

Big Stories

Advertisement
×