E-Paper
Advertisement

Mega 158: చిరు సరసన మరో సీనియర్ బ్యూటీ.. భలే సెట్ చేశారే!

Mega 158: చిరు సరసన మరో సీనియర్ బ్యూటీ.. భలే సెట్ చేశారే!
Advertisement

Mega 158: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi ) ఏడుపదుల వయసులో కూడా వరుస సినిమాలు ప్రకటిస్తూ జోరు పెంచిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఈ ఏడాది అనిల్ రావిపూడి (Anil Ravipudi)దర్శకత్వంలో ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా వరుస కలెక్షన్లు అందుకుంటూ దూసుకుపోతోంది. ఇప్పటికి థియేటర్లలో రన్ అవుతూ అటు నిర్మాతలకు లాభాల వర్షం కురిపిస్తోంది. నయనతార హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ఫ్యామిలీ కామెడీగా వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా వింటేజ్ చిరంజీవిని చూపించారు అని నిర్మాతపై ప్రశంసలు కురిపిస్తున్నారు ఆడియన్స్.

చిరంజీవి సరసన స్టార్ హీరోయిన్..

ఇలాంటి ఈయన ప్రస్తుతం బాబీ కొల్లి (Bobby kolli) దర్శకత్వంలో మెగా 158 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్నారు. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో ‘వాల్తేరు వీరయ్య’ సినిమా వచ్చి మంచి విజయం అందుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ కాంబినేషన్ మళ్ళీ సెట్ అయ్యింది అని ప్రకటించిన రోజు నుంచి అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దీనికి తోడు ఈ సినిమాలో చిరంజీవిని బెంగాల్ మాఫియా డాన్ గా చూపించబోతున్నానని బాబి చెప్పి సినిమాపై అంచనాలను మరింత పెంచేశారు. ఇకపోతే అప్పటినుంచి ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరు నటించబోతున్నారు అంటూ వార్తలు రాగా.. ఇప్పుడు తెరపైకి ఒక సీనియర్ బ్యూటీ పేరు వచ్చింది .ఆమె ఎవరో కాదు ప్రియమణి (Priyamani). ఒకప్పుడు తన అందంతో అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిన్నది.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో సరిపెట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్గా నటించనున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రాబోతోందట.

Advertisement

ALSO READ:Jana Nayagan: నిర్మాతలకు మరో షాక్.. ఓటీటీ హెచ్చరిక?

రూమర్స్ ను ముందే పసిగట్టిన బాబీ..

ఇకపోతే ఈ విషయం తెరపైకి రావడంతో డైరెక్టర్ బాబి కొల్లి భలే సెట్ చేశాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే సీనియర్ హీరోల పక్కన సీనియర్ హీరోయిన్లను తీసుకుంటే స్క్రీన్ పర్ఫెక్ట్ గా ఉంటుందని.. అలా కాకుండా కూతురు వయసున్న హీరోయిన్స్ ని సీనియర్ల పక్కన నటింపచేస్తే విమర్శలు ఎదుర్కోక తప్పదు అని.. అందుకే అన్ని ఆలోచించి బాబీ ముందుగానే సీనియర్ బ్యూటీని రంగంలోకి దింపుతున్నారు అంటూ కామెంట్లు వెలువడుతున్నాయి. మరి దీనిపై అధికారిక ప్రకటన వస్తే గాని అసలు విషయం తెలియదని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా మరొకవైపు ఈ సినిమా లో చిరంజీవి కూతురుగా కృతి శెట్టి నటిస్తోంది అంటూ వార్తలు రాగా దీనిపై చిత్ర బృందం స్పందించి ఇవి కేవలం రూమర్లు మాత్రమేనని కొట్టిపారేసింది. మరి హీరోయిన్ ప్రియమణి విషయంలో చిత్ర బృందం ఏదైనా ప్రకటిస్తుందేమో చూడాలి.

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×