E-Paper
Advertisement

VH On KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు ముందు కేటీఆర్ కీలక వ్యాఖ్యలు, కౌంటరిచ్చిన వీహెచ్

VH On KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు ముందు కేటీఆర్ కీలక వ్యాఖ్యలు, కౌంటరిచ్చిన వీహెచ్
Advertisement

VH On KTR: తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో వరసగా బీఆర్ఎస్ కీలక నేతలు పిలవడంతో ఆ పార్టీ నేతలు టెన్షన్ పడుతున్నారు. తాజాగా శుక్రవారం ఉదయం ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి కేటీఆర్. ఆయన వ్యాఖ్యలకు కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ కౌంటర్ ఇచ్చారు.

ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు ముందు కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Advertisement

ఫోన్ ట్యాపింగ్‌లో కేసు అనేక మలుపులు తిరుగుతోంది. శుక్రవారం ఉదయం సిట్ ముందు హాజరయ్యారు మాజీ మంత్రి కేటీఆర్. ఉదయం 9 గంటలకు తన ఇంటి నుంచి పార్టీ ఆఫీసుకు ఆయన చేరుకున్నారు. అప్పటికి వచ్చిన నేతలతో ఆయన సమావేశమయ్యారు. వివిధ అంశాలపై మాట్లాడారు. అంతకుముందు గత రాత్రి కేసీఆర్ చెప్పిన కొన్ని విషయాలను నేతలతో హరీష్‌రావు, కేటీఆర్ షేర్ చేసుకున్నారు.

విచారణకు వెళ్లిన తాను రావటానికి ఆలస్యమైతే ప్రతీ నాలుగు గంటలకు ఒకసారి మీడియాతో మాట్లాడాలని సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇదే క్రమంలో పార్టీ ఆఫీసులో ఓ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడారు మాజీ మంత్రి కేటీఆర్. 2015 ఏడాదిలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మా పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నించారని అన్నారు.

Advertisement

కేటీఆర్ వ్యాఖ్యలపై సీనియర్ నేత వీహెచ్ కౌంటర్

పోలీసుల నోటీసులకు తాము భయపడతామని భావిస్తున్నారని,  తాము ఏ తప్పు చేయనందున విచారణకు హాజరు కావడానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. దీనివల్ల మాకు బోలెడంత ప్రచారం ఉచితంగా లభిస్తుందన్నారు. అధికార పార్టీ అవినీతిని బయటపెట్టామని, రెండేళ్లుగా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

తాను ఏదైనా తప్పు చేసి ఉంటే ఆధారాలు చూపించాలన్నారు. మరోవైపు కేటీఆర్ మాటలపై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ కౌంటరిచ్చారు. BRS వర్కింగ్ ప్రెసిడెంట్ రామారావుపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు వచ్చాయన్నారు. దానితో సంబంధం లేదని నిరూపించుకోవాలన్నారు. క్లీన్ చిట్ పొందాలని సూచన చేశారు. ఇతర ఆరోపణలకు సంబంధించి ఆధారాలు ఉంటే చూపించాలన్నారు.

ALSO READ: క్లైమాక్స్‌కి ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణ కేసీఆర్ వరకు చేరిందా?  

 

Related News

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×