E-Paper
Advertisement

Priyamani: కరీనా కపూర్‌లా చూపిస్తానన్నారు..అందుకే బికినీ వేసుకున్నా.. ప్రియమణి షాకింగ్ కామెంట్స్..

Priyamani: కరీనా కపూర్‌లా చూపిస్తానన్నారు..అందుకే బికినీ వేసుకున్నా.. ప్రియమణి షాకింగ్ కామెంట్స్..
Advertisement

Priyamani: వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన సరస్వతి సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ప్రస్తుతం ప్రేక్షకుల నుంచి పర్వాలేదనే స్పందనను అందుకుంటోంది. ఈ సినిమాలో ప్రముఖ నటీమణి ప్రియమణి కూడా కీలక పాత్రలో నటించారు. విడుదలకు ముందు చిత్ర బృందం పలు ఇంటర్వ్యూలు ఇచ్చి సినిమాను ప్రమోట్ చేసింది.

ఈ ప్రమోషన్ ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రియమణి తన కెరీర్ ప్రారంభంలో చేసిన బికినీ సీన్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడుతూ..బికినీ ధరించడం తప్పు కాదని.. కథలో పరిస్థితి ఎలా ఉంటే ఆ పరిస్థితికి తగిన దుస్తులు ధరించాల్సిందే అని తెలిపింది.

Advertisement

“ఒక స్విమ్మింగ్ పూల్ సీన్ ఉంటే అక్కడ జీన్స్ లేదా చీర వేసుకుని నటించడం సాధ్యం కాదు అందుకే బికినీ అవసరం అవుతుంది. మొదట్లో అలాంటి సీన్స్ చేయడానికి కొంచెం సంకోచించాను” అని వెల్లడించింది.

కరీనాకపూర్ లాగా చూపిస్తామని చెప్పారు..!

అయితే దర్శకుడు తనను ఒప్పించి ఆ సీన్స్ చేయించాడని చెప్పింది. ముఖ్యంగా కరీనా కపూర్ ‘తషన్’ సినిమాలో బికినీ ధరించిన విధంగా షూట్ చేయాలని దర్శకుడు చెప్పడంతో తాను కూడా అంగీకరించానని తెలిపింది. ఆ సీన్ తర్వాత ప్రేక్షకులు తనలో మరో కోణాన్ని చూశారని ప్రియమణి చెప్పింది. అప్పటివరకు తాను ఎక్కువగా సాధారణ పాత్రలే చేసేదాన్నని గుర్తు చేసింది.

Advertisement

ఇక ‘సరస్వతి’ సినిమాను వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తూ స్వయంగా దర్శకత్వం వహించింది. దోస డైరీస్ బ్యానర్‌పై పూజా శరత్ కుమార్ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, ప్రియమణి, రావు రమేష్, రాధికా శరత్ కుమార్, మురళి శర్మ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటించారు. మార్చ్ 6న సినిమా విడుదల కాగా, ఒక రోజు ముందే ప్రీమియర్స్ కూడా నిర్వహించారు.

ఈ సినిమా కథ లక్ష్మి అనే మహిళ చుట్టూ తిరుగుతుంది. లక్ష్మి తన భర్తతో విడిపోయి, ఒక హాస్పిటల్‌లో నర్స్‌గా పనిచేస్తూ తన కూతురు సరస్వతితో కలిసి జీవిస్తుంది. ఆగస్టు 15న తన కూతురు పుట్టినరోజు రోజు స్కూల్ వద్ద వదిలి పనికి వెళ్తుంది. సాయంత్రం స్కూల్‌కి వెళ్లినప్పుడు తన కూతురు కనిపించదు.

ఆ రాత్రి సరస్వతి నుంచి వచ్చిన ఫోన్ కాల్‌తో లక్ష్మి అక్కడికి వెళ్లేసరికి ఘోర సంఘటన జరిగినట్టు తెలుస్తుంది. తరువాత తన కూతురికి న్యాయం కోసం లక్ష్మి చేసే పోరాటం చుట్టూ సినిమా కథ కొనసాగుతుంది. అసలు నిందితులు ఎవరు? సరస్వతికి ఏమైంది? అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ సినిమాను థియేటర్‌లో చూడాల్సిందే.

ALSO READ: Allu Sirish – Nayanika Reddy: అల్లు శిరీష్ పెళ్లి సందడి.. నయనిక ఇంట్లో అల్లు ఫ్యామిలీ!

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×