భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన న్యూఢిల్లీలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్) దేశవ్యాప్తంగా ఉన్న తన వివిధ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఐటీఐ, డిప్లొమాతో పాటు డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. మొత్తం 188 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. నార్తెర్న్ రీజియన్, వెస్ట్రన్ రీజియన్ అలాగే సదరన్ రీజియన్ పరిధిలోని రాష్ట్రాల్లో ఈ శిక్షణ ఉంటుంది.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 188
పోస్టులు వెకెన్సీలు..
మొత్తం 188 ఖాళీలలో ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రికల్, సివిల్ వంటి టెక్నికల్ విభాగాలతో పాటు నాన్-టెక్నికల్ విభాగాలు ఉన్నాయి. ఐటీఐ అప్రెంటిస్, డిప్లొమా అప్రెంటిస్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు ప్రధానంగా ఉన్నాయి. వీటితో పాటు హెచ్‌ఆర్ ఎగ్జిక్యూటివ్, రాజ్‌భాష అసిస్టెంట్, సీఎస్‌ఆర్ ఎగ్జిక్యూటివ్ విభాగాల్లోనూ అప్రెంటిస్ శిక్షణ పొందే వెసులుబాటు కల్పించారు.
విద్యార్హతలు..
అభ్యర్థులు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్ లేదా బీఎస్సీ ఇంజినీరింగ్ ఉత్తీర్ణులై ఉండాలి. ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఎంబీఏ లేదా బీఏ అర్హత అవసరం.
స్టైఫండ్:
ఎంపికైన వారికి నెలకు నిర్ణీత స్టైపెండ్ అందుతుంది. ఐటీఐ అభ్యర్థులకు రూ.13,500 కాగా డిప్లొమా వారికి రూ.15,000 చెల్లిస్తారు. గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టులకు గరిష్టంగా రూ.17,500 వరకు స్టైపెండ్ లభిస్తుంది. ఈ శిక్షణ కాలం ఏడాది పాటు ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక విధానం:
ఈ పోస్టులకు ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు. అభ్యర్థులు తమ విద్యార్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగానే ఎంపిక జరుగుతుంది. మెరిట్ జాబితాలో నిలిచిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అనంతరం మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు: దరఖాస్తు చేసుకునేందుకు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
ముఖ్యమైన తేదీలు:
ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ మార్చి 2వ తేదీన ప్రారంభమైంది. దరఖాస్తులు సమర్పించడానికి మార్చి 11వ తేదీని ఆఖరి గడువుగా నిర్ణయించారు.
హరియాణా, యూపీ, రాజస్థాన్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల్లో పని చేసేందుకు ఆసక్తి ఉన్నవారు అధికారిక వెబ్‌సైట్ సందర్శించి వివరాలు నమోదు చేసుకోవచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.powergrid.in
ALSO READ: DSSSB Recruitment: అక్షరాల రూ.1,51,000 జీతం.. డిగ్రీ అర్హతతో భారీగా జాబ్స్, పూర్తి వివరాలు ఇవే..