E-Paper
Advertisement

Priyanka Chopra: ప్రియాంక చోప్రా ఇదివరకే తెలుగు సినిమాలో నటించారా? ఏ సినిమానో తెలుసా?

Priyanka Chopra: ప్రియాంక చోప్రా ఇదివరకే తెలుగు సినిమాలో నటించారా? ఏ సినిమానో తెలుసా?
Advertisement

Priyanka Chopra: ప్రియాంక చోప్రా ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మారుమోగుతున్న పేరు ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారు. అనంతరం హాలీవుడ్ పాప్ సింగర్ ను పెళ్లి చేసుకుని హాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా స్థిరపడ్డారు. ఇలా గ్లోబల్ బ్యూటీగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్న ప్రియాంక చోప్రా(Priyanka Chopra) మొదటిసారి తెలుగు సినిమాలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి (Rajamouli)దర్శకత్వంలో మహేష్ బాబు (Mahesh Babu)పాన్ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

విడుదలకు నోచుకోని ప్రియాంక చోప్రా సినిమా..

ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. అయితే ఈ సినిమా ద్వారా మొదటిసారి ప్రియాంక చోప్రా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు అనుకుంటే మనం పొరపాటు పడినట్లే. ప్రియాంక చోప్రా ఇదివరకే తెలుగులో ఓ సినిమాలో నటించారు. కానీ కొన్ని కారణాలవల్ల ఆ సినిమా విడుదలకు నోచుకోలేకపోయింది. మరి ప్రియాంక చోప్రా నటించిన ఆ తెలుగు సినిమా ఏంటి? ఎందుకు విడుదల కాలేదు అనే విషయానికి వస్తే..

అపురూపం మొదటి తెలుగు సినిమా..

Advertisement

ప్రియాంక చోప్రా హీరోయిన్ గా “అపురూపం”(Apurupam) అనే సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టారు. 2002 వ సంవత్సరంలో ఈ సినిమా షూటింగ్ పనులను ప్రారంభించింది. సాయి రవి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోగా ప్రసన్న నటించారు. అయితే ఈ సినిమా సగం షూటింగ్ పనులను పూర్తి చేసుకున్న తర్వాత ఆర్థిక ఇబ్బందుల కారణంగా నిర్మాత సినిమా షూటింగ్ ఆపి వేశారు. ఒకవేళ ఈ సినిమా కనుక విడుదలయ్యి మంచి సక్సెస్ అందుకొని ఉంటే ప్రియాంక చోప్రా టాలీవుడ్ ఇండస్ట్రీలోనే సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగే వారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా విడుదల కాకపోయినప్పటికీ ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలను అందుకొని అక్కడ కూడా స్టార్ హీరోయిన్ గా సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం హాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతున్నారు.

మరికొన్ని గంటలలో గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్..

Advertisement

ఇలా రెండు దశాబ్దాల తర్వాత తిరిగి ప్రియాంక చోప్రా మరో తెలుగు సినిమాకు కమిట్ అవ్వడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా పట్ల ఇప్పటికే భారీ స్థాయిలో అంచనాలు కూడా ఉన్నాయి. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా మందాకిని అనే పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. ఇదివరకే ఈమెకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయడంతో ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసింది. ఇక రాజమౌళి సినిమా అంటే గ్లోబల్ రేంజ్ లో సెలబ్రిటీలకు స్టార్డం రావడం పక్కా అని చెప్పాలి. ఇక నవంబర్ 15వ తేదీ ఈ సినిమాకి సంబంధించి గ్లోబ్ ట్రాటర్ (Globe Trotter)ఈవెంట్ రామోజీ ఫిలిం సిటీలో ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతుంది. ఈవెంట్ కోసం ప్రియాంక చోప్రా కూడా హైదరాబాదులో ఉన్న సంగతి తెలిసిందే.

Also Read: Globe Trotter: ఓవర్సీస్ లోనూ గ్లోబ్ ట్రాటర్ లైవ్ స్ట్రీమ్..ఎక్కడ చూడొచ్చంటే!

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×