BigTV English

Film industry: బీచ్ లో లిప్ లాక్ చేస్తూ రెచ్చిపోతున్న మహేష్ బ్యూటీ.. వీడియో వైరల్!

Film industry: బీచ్ లో లిప్ లాక్ చేస్తూ రెచ్చిపోతున్న మహేష్ బ్యూటీ.. వీడియో వైరల్!

Film industry:ఈ మధ్యకాలంలో హీరోయిన్లు పబ్లిక్ లో లిప్ లాక్ తో రెచ్చిపోతూ అందరి చేత విమర్శలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా అవతల ఉన్నది తమ జీవిత భాగస్వామి అయినా బెడ్ రూమ్లో చేయాల్సిన పనులు పబ్లిక్ లో చేస్తూ ట్రోల్స్ ఎదుర్కొంటున్నారని చెప్పవచ్చు. మొన్నటికీ మొన్న ప్రముఖ సీనియర్ హీరోయిన్ శ్రియా శరన్ (Shriya Saran) కూడా తన భర్తకి లిప్ లాక్ ఇస్తూ అందరి చేత విమర్శలు ఎదుర్కోగా.. ఇప్పుడు ఆ జాబితాలోకి మహేష్ బాబు (Mahesh Babu) హీరోయిన్ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) కూడా వచ్చి చేరింది. గ్లోబల్ స్టార్ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న ప్రియాంక చోప్రా ప్రస్తుతం మహేష్ బాబు, రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో వస్తున్న ఎస్ఎస్ఎంబి 29 (SSMB 29) మూవీలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ వర్కింగ్ టైటిల్ తో నడుస్తున్న ఈ సినిమా టైటిల్ ను మేకర్స్ ఇంకా ప్రకటించలేదు.ఆఫ్రికన్ అడ్వెంచర్ మూవీగా రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.


ప్రియాంక చోప్రా వ్యక్తిగత జీవితం..

ఇదిలా ఉండగా ప్రియాంక చోప్రా వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. ఈమె 2018లో అమెరికన్ సింగర్ నిక్ జోనస్ (Nick Jonas) ను ప్రేమించి మరీ వివాహం చేసుకుంది. అయితే పెళ్లి సమయంలో నిక్ కన్నా ప్రియాంక చోప్రా 10 సంవత్సరాలు పెద్దది కావడంతో అప్పట్లో వీరి పెళ్లి విషయం సంచలనంగా మారింది. ముఖ్యంగా అతడిని డబ్బు కోసమే వివాహం చేసుకుందనే విమర్శలు కూడా ఎదుర్కొంది.. అయినా సరే ఇలాంటి రూమర్సేవి పట్టించుకోకుండా అటు తన కెరీర్లో ఇటు వైవాహిక బంధంలో సంతోషంగా కొనసాగుతోంది ఈ జంట. అంతేకాదు వీరికి ఒక పాప కూడా జన్మించింది.


పబ్లిక్ లో లిప్ లాక్ తో రెచ్చిపోయిన ప్రియాంక చోప్రా..

ఇక ప్రస్తుతం వరుస ప్రాజెక్టులు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ వెకేషన్స్ కి వెళ్తూ ఫోటోలను, వీడియోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది ఈ జంట. అందులో భాగంగానే తాజాగా ప్రియాంక చోప్రా ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో రూమర్స్ ఎదుర్కొనేలా చేస్తోంది. ఇక ఈ వీడియోలో ప్రియాంక చోప్రా తన భర్తతో కలసి బీచ్ కి వెళ్ళింది. అక్కడ అతని పైకి ఎక్కి మరీ లిప్ లాక్ ఇస్తూ రెచ్చిపోయింది.

వీడియోపై నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు..

ప్రస్తుతం ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది చూసిన కొంతమంది నెటిజన్లు లైక్ కొడుతుంటే.. మరికొంతమంది పబ్లిక్ లో ఇలాంటి పనులు ఏంటి తల్లి అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు . మరికొంతమంది ఇలాంటి పనులు ఏవైనా చేయడానికి బెడ్ రూమ్ లంటూ ఉన్నాయి కదా.. వాటిని కాదని ఇలా పబ్లిక్ లో చేసి సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు అంటూ ప్రియాంక చోప్రా జంటపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది ఆమెకు అండగా నిలుస్తూ ఆమె భర్త ఆమె ఇష్టం.. పబ్లిక్ అయితేనేమి ప్రైవేట్ అయితేనేమి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రియాంక చోప్రా షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యేలా చేస్తోంది.

?utm_source=ig_web_copy_link

Related News

Sobhita: షూటింగ్ లొకేషన్ లో వంట చేసిన శోభిత.. చైతూ రియాక్షన్ ఇదే!

Lokesh Kangaraj: చేసింది 6 సినిమాలే..22 మంది హీరోలను డైరెక్ట్ చేశా.. గర్వంగా ఉందంటూ!

OG Glimpse: ఎందయ్యా సుజీత్ బర్త్ డే హీరోదా…విలన్ దా ఆ గ్లింప్స్ ఏంటయ్యా?

Madharasi Censor Report: మదరాసి సెన్సార్‌ పూర్తి.. ఆ సీన్స్‌పై బోర్డు అభ్యంతరం, మొత్తం నిడివి ఎంతంటే

Ghaati Censor Report: అనుష్క ‘ఘాటీ’కి సెన్సార్‌ కట్స్.. ఆ సీన్లపై కోత.. మొత్తం మూవీ నిడివి ఎంతంటే!

Anushka Shetty: డాక్యుమెంటరీగా బాహుబలి.. కన్ఫర్మ్ చేసిన స్వీటీ!

Big Stories

×