US New Rules For Indians: అప్పటి అమెరిక కాదా ఇది? పూర్తిగా మారిపోయిందా? వీసా కాదు కదా గ్రీన్ కార్డు కూడా తుమ్మితే ఊడిపోయే ముక్కుల మారిందా? చిన్నా చితకా నేరాలకు కూడా వీసా రద్దయ్యే ప్రమాదముందా? యూఎస్ ఎందుకిలా మారిపోయింది? అమెరికాలో ఎందుకలాంటి పరిస్థితి కనిపిస్తోంది? ఇదెవరి తప్పు? కొందరంటే కొందరు టూరిస్టులు, స్టూడెంట్స్ కారణంగా కఠిన నిర్ణయాలు వెలుగు చూస్తున్నాయా? అయితే ఆ డీటైల్స్ఏంటి?
డాలర్ డ్రీమ్స్‌కి ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే
అతి తెలివిచూపితే అస్సలు టాలరేట్ చేయం- USమొన్నామధ్య ఒక వీడియో హల్ చల్ చేసింది. మీరు అమెరికా ఎందుకు వస్తున్నారు? వెళ్లిపోండి ఇక్కడి నుంచి అంటూ ఒక అమెరికన్ ఇండియన్ని అంటున్న మాటలు బాగా ట్రోలయ్యాయి. ఈ కండీషన్లో అమెరికా వచ్చిన వారు ఏ తప్పు చేసినా.. వారిలో ఏ చిన్న తేడా కనిపించినా అనుమానాస్పదంగా బిహేవ్ చేసినా.. ఇంతే సంగతులు. ఎక్కడికక్కడ ప్యాకప్ చెప్పాల్సిందే. డాలర్ డ్రీమ్స్ కి ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే. పెట్టే బేడా సర్దుకుని ఇంటి దారి పట్టాల్సిందే. ఇటీవలి కాలంలో.. ఇలాంటి హెచ్చరికలు భారీగా అందుతున్నాయ్. ఇదిగో ఈమెను చూశారా.. భారత్ కి చెందిన పర్యాటకురాలు. ఇల్లినాయిస్ లోని ఒక స్టోర్ లో చోరీ చేస్తూ చిక్కిపోయింది. లోకల్ గా ఉన్న టార్గెట్ రీటైల్ స్టోర్ కి వెళ్లిన ఈమె.. సుమారు ఏడు గంటల పాటు అక్కడే తిరుగుతూ కనిపించింది. అనుమానమొచ్చిన సిబ్బంది.. 911 కి కాల్ చేశారు. పోలీసులు వచ్చేలోపు ఆమె వెనక వైపున్న గేటు నుంచి బయటకు వెళ్లేందుకు విఫలయత్నం చేసింది. కానీ పోలీసులు అప్పటికే అక్కడికి చేరుకుని అదుపులోకి తీస్కున్నారు.
వైరల్‌గా మారినా ఇండియన్ టూరిస్ట్ అరెస్ట్ వీడియో
సుమారు 1300 డాలర్ల విలువైన వస్తువులు.. ఇండియన్ కరెన్సీలో చెబితే లక్షా పదకొండు వేల రూపాయల విలువైన సరుకు చోరీ చేసేందుకు ఈమె ట్రై చేసినట్టు గుర్తించారు. ఈ టూరిస్టును అరెస్ట్ చేసిన దృశ్యాలు ప్రెజంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈమెపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా యూఎస్ వీసాలకు అప్లై చేసుకునే వారిని ఉద్దేశిస్తూ.. భారత్ లోని అమెరికా రాయబార కార్యాలయం తాజాగా కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. చోరీలు, దోపిడీలు వంటి నేరాలకు పాల్పడే వాళ్లు.. ఇకపై అమెరికా వచ్చే అర్హత కోల్పోతారనీ..ఇలాంటి వారిపై శాశ్వత ఆంక్షలు విధించే అవకాశముందని వార్న్ చేసింది ఇండియాలోని యూఎస్ ఎంబసీ. ఇది కేసులతో పోయే వ్యవహారం కాదు. మీ బ్యాగ్రౌండ్ మొత్తం చెక్ చేసి.. ఇలాంటి వారు యూఎస్ లో ఉండటానికి వీల్లేదన్న నిర్ణయానికి వస్తారు. ఇప్పటికే కాదు ఎప్పటికీ మీరు అమెరికా రావడమిక జరగని పని. కాబట్టి విదేశీయులు.. గుర్తించాల్సిన విషయమేంటంటే.. శాంతి భద్రతలకు అమెరికా విశేషమైన ప్రాధాన్యతనిస్తుంది. ఈ విషయం గుర్తించి.. తప్పనిసరిగా ఇక్కడి నియమాలను పాటించాలని తన పోస్టులో రాసుకొచ్చింది యూఎస్ ఎంబసీ.
గతేడాది ఏప్రిల్లో చోరీ చేస్తూ చిక్కిన తెలుగమ్యాయిలు
ఇప్పుడే కాదు గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగిన పరిస్థితులున్నాయి. పై చదువులు చదవడానికి అమెరికా వెళ్లిన తెలుగు అమ్మాయిలు గతేడాది ఏప్రిల్లో చోరీ చేస్తూ పోలీసులకు చిక్కారు. వీరిలో ఒకరిది హైదరాబాద్ కాగా, మరొకరిది ఏపీలోని గూంటూరు. షాప్ లిఫ్టింగ్ కింద వీరిని అరెస్టు చేశారు అక్కడి పోలీసులు. షాప్ లిఫ్టింగ్ అంటే చోరీలో ఇదో రకమైన మోసం. కొన్ని వస్తువులకు బిల్లు చెల్లించి.. మరికొన్ని సిబ్బంది కంటపడకుండా నొక్కేయడం అన్నమాట. వీరి విషయంలో అసలేం జరిగిందో చూస్తే.. 20, 22 ఏళ్ల వయసున్న ఇద్దరు భారత విద్యార్ధినులు న్యూజెర్సీలోని హోబోకెన్ లో ఒక షాపులో షాపింగ్ కి వెళ్లారు. అక్కడ కొన్ని వస్తువులు ఎంపిక చేసుకుని వాటికి బిల్లు చెల్లించారు. మరికొన్నిటిని సిబ్బంది కంట పడకుండా నొక్కేశారు. దీన్ని గమనించిన షాప్ ఓనర్.. హోబోకెన్ పోలీసులకు సమాచారమిచ్చారు. క్షణాల్లో వచ్చి వాలిపోయారు అక్కడి పోలీసులు. సీసీ ఫుటేజీ పరిశీలించి వీరిపై వచ్చిన కంప్లయింట్ నిజమేనని నిర్దారించారు. దీంతో వీరిని అదుపులోకి తీసుకున్నారు. తాము కాజేయాలని చూసిన వస్తువులకు రెట్టింపు ధర చెల్లిస్తామన్నా.. పోలీసులు వీరిని వదల్లేదు. ఇక్కడి రూల్స్ అందుకు ఒప్పుకోవని వివరించి వీరిని అరెస్టు చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందీ ఘటన.
ఇప్పటికే ఫేక్ ఎక్స్ పీరియన్స్, ఫేక్ సర్టిఫికేట్స్ పట్ల అప్రమత్తం
ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుండటంతో విసుగెత్తిన అమెరికన్ యంత్రాంగం.. ఇలాంటి వారికి అస్సలు తమ దేశంలో ఎంట్రీ ఇవ్వకూడదని గట్టిగా ఫిక్సయినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే తెలుగు స్టూడెంట్స్ ని ఎంకరేజ్ చేయొద్దని అక్కడి ఎంప్లాయర్స్ చెబుతున్నారు. ఇక్కడి వారు ఫేక్ ఎక్స్ పీరియన్స్ తో ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి అమెరికాలోకి అక్రమంగా చొరబడుతున్నారనీ.. ఇలాంటి వారికి ఉద్యోగాలిస్తే.. వీరికి నేర్పించడానికే సగం సమయం, జీతం వృధా అవుతోందన్న కామెంట్లు వినిపిస్తున్నాయ్. దీంతో యూఎస్ లో ఫ్రెషర్స్ డోర్స్ దాదాపు క్లోజ్ అయిన పరిస్థితి. ఉన్నత చదువుల కోసం యూఎస్ కి వెళ్లి.. అక్కడ బుద్ధిగా చదువుకుని.. చట్ట బద్ధంగా పార్ట్ టైం జాబులు చేసుకుని.. కాలం వెళ్లదీయాల్సి ఉంటుంది. అంతే తప్ప.. అతి తెలివి చూపిస్తే అస్సలు టాలరేట్ చేయమని తెగేసి చెబుతోంది అమెరికన్ యంత్రాంగం. ప్రెజంట్ యూఎస్ లో ఎలాంటి కండీషన్స్ ఉన్నాయి? మారిన పరిస్థితులు మనకేం చెబుతున్నాయి? ఎందుకిలా జరుగుతోంది? అసలు అమెరికన్ ఎంబసీ ఇంత కఠినంగా మారడానికి గల కారణాలేంటి? ఇమ్మిగ్రేషన్ రూల్స్ ఇంత కఠినతరం కావడానికి గల రీజన్లు ఏమై ఉంటాయి?
యూఎస్‌కి ఉపయోగ పడేంత టాలెంట్ ఉండాలి
ట్రంప్ వచ్చాక.. యూఎస్ దౌత్య పరమైన వ్యవహారాలే కాదు.. వీసా పాలసీలు కూడా మారాయి. అమెరికా అంటే ఎవరంటే వారు డాలర్ల కోసం వచ్చి పోయే.. దేశం కాదు. ఇక్కడికి కూడా వివిధ దేశాల నుంచి రావచ్చు. కానీ, వారికంటూ అమెరికాకు విపరీతంగా ఉపయోగ పడేంత టాలెంట్ ఉండాలి. అది ఈ దేశంలోని వారికి లేని ప్రతిభగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఇక్కడికి వారిని అనుమతిస్తాం. అంతే తప్ప.. తాలు బ్యాచీతో మాకు పనే లేదని తెగేసి చెబుతోంది అమెరికా. ఈ క్రమంలో ఒళ్లు దగ్గర పెట్టుకుని అక్కడ మసలాల్సి వస్తోంది. అమెరికాలో ప్రస్తుత పరిస్థితులు ఎలా మారిపోయాయంటే.. పై చదువులు చదవడానికి ఏదైనా వర్శిటీకి వెళ్తే.. అక్కడ హాజరు శాతం తగ్గినా F1 వీసా రద్దయ్యే ప్రమాదం కనిపిస్తోంది. వారు చదువుకోడానికి వచ్చినపుడు చదువు మీదే ఎక్కువ ఫోకస్ పెట్టాలి. వారలా చేస్తున్నారని చెప్పడానికి ఏకైక మార్గం.. హండ్రెడ్ పర్సెంట్ పక్కా అటెండెన్స్. ఒక వేళ అలా చేయకుండా.. చదువుకోడానికి వచ్చిన వారు ఇతరత్రా పనులు చేసుకుంటూ అక్కడే శాశ్వతంగా ఉండిపోవాలన్న ఆలోచన చేస్తే అస్సలు కుదరదని తెగేసి చెబుతోంది అమెరికన్ స్టూడెంట్ వీసా పాలసీ. కాబట్టి, విద్యార్ధులు వీలైనంత వరకూ క్లాసులకు హాజరై యూఎస్ రూల్స్ మస్ట్ గా పాటించాలని సూచిస్తున్నారు.
స్టూడెంట్స్ మీదే కనికరం చూపడం లేదు
స్టూడెంట్స్ విషయంలోనే కనికరం చూపడం లేదు. అలాంటిది టూరిస్టుగా వచ్చిన వారిని ఎలా వదిలేస్తారు? ఈ విషయాలేవీ గుర్తించకుండా.. అమెరికాలో ఎలా పడితే అలా చేస్తామంటే కుదరదని తెగేసి చెబుతున్నారు అధికారులు. ఒకప్పుడు యూఎస్ పర్యాటకుల స్వర్గధామం. ఇమ్మిగ్రెంట్స్ హెవన్ గా పేరుండేది. మెక్సికన్లు అయితే తమ టీనేజ్ లోనే గోడ దూకి అమెరికాలోకి వచ్చేవారు. ఇక్కడ తమ టాలెంట్ ని బట్టీ.. లేబర్, ఫుడ్, మ్యూజిక్ వంటి రంగాల్లో స్థిరపడేవారు. ఇది గుర్తించిన ట్రంప్.. తానొస్తే మెక్సికో గోడ కడతానన్నారు. కెనడియన్లయితే.. తరచూ యూఎస్ వచ్చేవారు. రెయిన్ బో బ్రిడ్జ్ క్రాస్ చేసి సరదాగా కార్లో వచ్చేసేవారు. అదే ఇప్పుడు ట్రంప్ సుంకాల దెబ్బకు యూఎస్ పర్యాటకానికి బొత్తిగా స్వస్తి చెప్పారు. కెనడాను తమ 51వ రాష్ట్రంగా కలిసిపోవాలంటూ ట్రంప్ చేసిన కొన్ని వ్యంగ్య వ్యాఖ్యానాల కారణంగా కెనడియన్ల మనోభావాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. దీంతో వీరు యూఎస్ కి రావడం దాదాపు మానేశారు. వీరి రాకడ లేక ఇక్కడి టూరిజం పడకేసింది. తద్వారా వచ్చే ఆదాయం, ఉద్యోగిత మొత్తం దెబ్బ తినింది. అయినా సరే తగ్గేదే లేదంటోంది.. ట్రంప్ సర్కార్.
స్థానికతకు అధిక ప్రాధాన్యతనిస్తోన్న ట్రంప్ పాలన
మొన్న ట్రంప్ ప్రవేశ పెట్టిన బిగ్ బ్యూటిఫుల్ బిల్ లో.. ఒక కొత్త కోణం వెలికి వచ్చింది. అదేంటంటే. తమ సొంత దేశాలకు డబ్బు పంపేవారిపైనా 3 నుంచి 5 శాతం పన్ను విధించాలని చూసింది ట్రంప్ పాలన. ఈ మొత్తాన్ని తాము సరిహద్దు సైనికుల సహాయార్ధం వాడుతామని కూడా చెప్పుకొచ్చారు ట్రంప్. విదేశీయులను ఎలా కట్టడి చేయాలో అంత తీవ్రంగా ప్రయత్నిస్తోంది ట్రంప్ పాలన. అమెరికా ఫస్ట్- మేక్ అమెరికా గ్రేట్ అగైన్ లో భాగంగా.. స్థానికతకు అధిక ప్రాధాన్యతనిస్తూ.. విదేశీ ప్రతిభను వీలైనంతగా పక్కకు తప్పించాలన్నది ధ్యేయంగా కనిపిస్తోంది. ఇది ఎక్కడి వరకూ వెళ్లిందంటే.. ఏకంగా మస్క్ లాంటి వారినే సొంత దేశానికి పార్శల్ చేయ్యాలన్నంత కసీ క్రోధంగా తయారైంది. అప్పటికీ ట్రంప్ రెండో సారి గెలిచేందుకు.. ట్విట్టర్ని కొని, దాని ద్వారా విశేష ప్రచారం కల్పించారు మస్క్. భారీ ఎత్తున విరాళాలిచ్చారు కూడా. అలాంటి మస్క్ నే వదలడం లేదు ట్రంప్. ఆయన వ్యాపారాలకిచ్చే సబ్సిడీలన్నిటినీ ఎత్తేసి.. తద్వారా ఆయన సంపద, ఇతర ఆస్తులను జప్తు చేసి.. దక్షిణాఫ్రికా పంపించేస్తే భారీ ఎత్తున అమెరికన్ డాలర్లు ప్రభుత్వ పరం అవుతాయన్న కోణంలో కామెంట్లు చేశారాయన.
Also Read: పార్టీ నుంచి కవిత అవుట్.? బిడ్డను అడ్డుపెట్టుకొని కేసీఆర్ కొత్త స్కెచ్..
అలాంటిది సాదా సీదా టూరిస్టులు, ఇతర స్టూడెంట్లను క్షమించడమా. నథింగ్ డూయింగ్ అంటోంది ప్రస్తుత అమెరికన్ విధానం. ఆమాటకొస్తే ఇక్కడ పుట్టిన వారికి జన్మతః వచ్చే పౌరసత్వాన్ని కూడా రద్దు చేయాలని యోచిస్తోంది. అంత తారుమారైన అమెరికా విధి విధానాల పట్ల అప్రమత్తంగా లేకపోతే కష్టం. ఎలా పడితే అలా వ్యవహరించాలంటే కుదరదని తెలుస్తోంది. భారత్ లో.. ఏదో ఒక ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చేసి, ఆపై అమీర్ పేట్లో ఒక కోర్సు చేసి.. అటు నుంచి యూఎస్ కి వెళ్లి అక్కడ స్థిరపడే సో కాల్డ్ కారిడార్ కి ఇక కాలం చెల్లింది.. ఇది ట్రంప్ జమానా. కొత్త అమెరికా పురుడు పోసుకుంటున్న సమయం. కాబట్టి.. బీ అలెర్ట్ అంటోంది యూఎస్ ఎంబసీ.