E-Paper
Advertisement

Priyanka Chopra: చరిత్ర సృష్టించిన ప్రియాంక చోప్రా.. మొట్టమొదటి ఇండియన్ సెలబ్రిటీగా!

Priyanka Chopra: చరిత్ర సృష్టించిన ప్రియాంక చోప్రా.. మొట్టమొదటి ఇండియన్ సెలబ్రిటీగా!
Advertisement

Priyanka Chopra:గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం, అభినయంతో, నటనతో అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను సొంతం చేసుకున్న ఈమె.. తాజాగా చరిత్ర సృష్టించింది.. ముఖ్యంగా రెండవసారి అకాడమీ అవార్డుల వేడుకలో ప్రజెంటర్ గా వ్యవహరించి.. తొలి భారతీయ నటిగా చరిత్ర సృష్టించింది. ప్రపంచ వేదికపై భారత ప్రాతినిధ్యానికి ఇది మరో గర్వించదగిన విజయమని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక బాలీవుడ్ , హాలీవుడ్ మధ్య వారధిగా నిలుస్తున్న ప్రియాంక చోప్రా.. సినిమా, వినోద రంగాలలో తన అంతర్జాతీయ ప్రాబల్యాన్ని పెంచుకుంటున్న విషయాన్ని ఈ వేడుక హైలెట్ చేస్తోంది.

చరిత్ర సృష్టించిన ప్రియాంక చోప్రా..

ప్రపంచ సినిమా రంగంలో భారతీయ కళాకారుల ప్రభావం ఎలా విస్తరిస్తుందో ఆమె ప్రయాణం ప్రతిబింబిస్తోందని పేర్కొంటూ ప్రియాంక చోప్రా అభిమానులు ఇదొక ముఖ్యమైన ఘట్టంగా అభివర్ణించారు.. ఏది ఏమైనా ఈ ఒక్క ఘటన ప్రియాంక చోప్రా స్థాయిని , ఆమె హుందాతనాన్ని మళ్లీ నిరూపించాయని చెప్పవచ్చు. ఇకపోతే 2016లో ప్రియాంక చోప్రా ప్రెజెంటర్ గా కనిపించి సందడి చేయగా.. మళ్లీ పదేళ్లకు ఈ అవకాశం లభించడం నిజంగా గొప్ప అదృష్టం అని అభిమానులు సైతం కొనియాడుతున్నారు. ఏది ఏమైనా ప్రియాంక చోప్రా క్రియేట్ చేసిన ఈ హిస్టరీ చూసి అభిమానులు, సినీ సెలబ్రిటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు.

వారణాసి తో మళ్ళీ మన ముందుకు..

Advertisement

ప్రియాంక చోప్రా కెరియర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న వారణాసి సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. మందాకిని పాత్రలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటికే ఈ సినిమాలోని కీలక సన్నివేశాలలో షూటింగ్ పూర్తి చేసిన ఈమె..త్వరలోనే తన పాత్రకు సంబంధించిన మిగతా షూటింగ్ ను కంప్లీట్ చేయనున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ 7వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది..

also read:Rajinikanth: విజయ్ కి షాక్.. రజినీకాంత్ స్ట్రాంగ్ కౌంటర్.. కాలమే సమాధానం చెబుతుందంటూ పోస్ట్!

ప్రపంచ సుందరి నుంచి గ్లోబల్ స్టార్ వరకూ..

Advertisement

ప్రియాంక చోప్రా మోడల్గా తన కెరీర్ ను మొదలుపెట్టి.. 2000వ సంవత్సరంలో ప్రపంచ సుందరిగా కిరీటాన్ని ధరించింది. ఇక 2002లో తమిళన్ అనే చిత్రం ద్వారా తొలిసారి వెండితెరకు పరిచయమైంది.. తమిళ్లో వచ్చిన ఈ సినిమా ద్వారానే తన నటన జీవితాన్ని ప్రారంభించింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇప్పటినుంచి బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించిన ఈమె.. అనూహ్యంగా హాలీవుడ్ వెళ్ళిపోయి అక్కడే సినిమాలు చేస్తూ సెటిల్ అయిపోయింది.. దాదాపు 8 ఏళ్ల పాటు హాలీవుడ్ లోనే సినిమాలు చేసిన ప్రియాంక చోప్రా రాజమౌళి పుణ్యమా అని మళ్ళీ ఇండియన్ సినిమాలలో అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతోంది.. ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ లో కూడా అవకాశాలు లభిస్తూ ఉండడం గమనార్హం.

Related News

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

Big Stories

Advertisement
×