E-Paper
Advertisement

LPG Supply: ఏపీలో గ్యాస్ కష్టాలకు చెక్.. రంగంలోకి దిగిన చంద్రబాబు

LPG Supply: ఏపీలో గ్యాస్ కష్టాలకు చెక్.. రంగంలోకి దిగిన చంద్రబాబు
Advertisement

LPG Supply: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) వేదికగా రాష్ట్రంలో గ్యాస్ సరఫరా పరిస్థితిపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్‌తో పాటు పెట్రోలియం కంపెనీలు, గెయిల్ (GAIL), ఓఎన్జీసీ (ONGC) ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎల్పీజీ (LPG) కొరత ఉందనే ఆందోళనల నేపథ్యంలో ప్రజలకు భరోసా కల్పిస్తూ సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఎల్పీజీ సరఫరాపై సీఎం స్పష్టత

Advertisement

రాష్ట్రంలో ప్రస్తుతం 14 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మరో 15 రోజులకు సరిపడా నిల్వలు సిద్ధంగా ఉన్నాయని, అదనపు గ్యాస్ కూడా త్వరలోనే అందుబాటులోకి రానుందని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా ఆస్పత్రులు, హాస్టళ్లు, దేవాలయాల వంటి అత్యవసర విభాగాలకు ఎక్కడా సరఫరాలో ఆటంకాలు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

అక్రమాల నివారణే లక్ష్యం

Advertisement

గ్యాస్ సిలిండర్ల పంపిణీలో అక్రమాలకు తావులేకుండా ఈ-కేవైసీ (e-KYC) , ఓటీపీ (OTP) విధానాలను పటిష్టంగా అమలు చేయాలని సీఎం సూచించారు. సిలిండర్లు పక్కదారి పట్టకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, వినియోగదారులకు పారదర్శకంగా గ్యాస్ అందేలా చూడాలని స్పష్టం చేశారు.

ప్రత్యామ్నాయాలపై దృష్టి

గ్యాస్ కంపెనీలు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవాలని కోరడంతో పాటు, మార్కెట్‌లో ఇండక్షన్ స్టవ్‌ల లభ్యతను పెంచాలని ముఖ్యమంత్రి సూచించారు. దీనివల్ల గ్యాస్‌పై ఆధారపడటం కొంత తగ్గి అత్యవసర సమయాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. గ్యాస్ సరఫరా వ్యవస్థను నిరంతరం పర్యవేక్షిస్తూ.. ప్రజల్లో ఉన్న భయాలను తొలగించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

Also Read: ఫ్రెష్ చికెన్ పేరుతో కుళ్లిన మాంసం విక్రయం.. 800 కిలోల మాంసం స్వాధీనం!

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×