E-Paper
Advertisement

Rajinikanth: విజయ్ కి షాక్.. రజినీకాంత్ స్ట్రాంగ్ కౌంటర్.. కాలమే సమాధానం చెబుతుందంటూ పోస్ట్!

Rajinikanth: విజయ్ కి షాక్.. రజినీకాంత్ స్ట్రాంగ్ కౌంటర్.. కాలమే సమాధానం చెబుతుందంటూ పోస్ట్!
Advertisement

Rajinikanth:ప్రస్తుతం తమిళనాట రాజకీయాలు వేడెక్కాయి. డీఎంకే, అన్నాడీఎంకే మధ్య ఎప్పుడూ ప్రత్యక్ష పోటీ ఉండేది.. కానీ ఈసారి సినిమా రంగం కూడా తోడైంది. సినిమా నటుడు విజయ్ దళపతి (Vijay thalapathy) తన సొంత టీవీకే పార్టీ ద్వారా ఈసారి అధికారంలోకి రావడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.. ఇప్పుడు ఈ మూడు పార్టీల మధ్య పోటీ నెలకొంది.సరిగ్గా ఇలాంటి సమయంలోనే విజయ్ దళపతి టీవీకే పార్టీతో బిజెపి పొత్తు పెట్టుకోవాలని ఆయనతో చర్చలు జరిపిందట. పైగా డిప్యూటీ సీఎం పదవితో పాటు 80 సీట్లు ఇస్తామని ఆఫర్ చేసిందట. కానీ వీటిని అంగీకరించని విజయ దళపతి తనకు సీఎం పదవి కావాలని కోరినట్లు సమాచారం.

రజనీకాంత్ రాజకీయ ఎంట్రీపై టీవీకే నేత కీలక వ్యాఖ్యలు..

అయితే ఇలా ఈ వార్తలు వస్తున్న వేళ సడన్గా టీవీకే పార్టీ కీలక నేత అధవ్ అర్జున్ రజనీకాంత్ పై చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర వివాదాస్పదంగా మారాయి.” రజనీకాంత్ రాజకీయాల్లోకి రాకుండా డిఎంకే భయపెట్టింది” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మంట రాజేసాయి. ఇక ఏఐఎడిఎంకే అధినేత ఎడప్పాడి కె పళనిస్వామి తో పాటు బిజెపి నేత అన్నామలై కూడా సూపర్ స్టార్ పై చేసిన వ్యాఖ్యలకు తీవ్రంగా మండిపడ్డారు. అటు మీడియా కూడా రజనీకాంత్ కు అండగా నిలిచింది. ఇక అధవ్ అర్జున్ చేసిన కామెంట్లకు రజనీకాంత్ స్పందించాలి అని అభిమానులు కూడా కోరగా తాజాగా ఆయన ఒక పోస్ట్ పంచుకున్నారు.

ఒక్క పోస్టుతో స్ట్రాంగ్ కౌంటర్..

Advertisement

టీవీకే నేత అర్జున్ అనుచిత వ్యాఖ్యలను రజనీకాంత్ ఖండిస్తూ పోస్ట్ పెట్టారు. ఈ నేపథ్యంలోనే తనకు మద్దతుగా నిలిచిన రాజకీయ , సినీ , మీడియా ప్రముఖులకు ధన్యవాదాలు కూడా తెలిపారు. ముఖ్యంగా ఎడప్పాడి కె పళనిస్వామి, తిరుమావళన్ వంటి నేతలకు కృతజ్ఞతలు చెబుతూ.. “కాలం మాట్లాడదు ..వేచి ఉండి సమాధానం చెబుతుంది” అంటూ ఆయన తెలిపారు. ఇక ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొత్తానికైతే తన ఒక్క పోస్టుతో తాను మాట్లాడాల్సిన అవసరం లేదని.. కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రజనీకాంత్ ఇచ్చిన సమాధానం అధవ్ అర్జున్ కి స్ట్రాంగ్ కౌంటర్ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

also read:Rashmika mandanna: వేట మొదలు.. రష్మిక ఆసక్తికర పోస్ట్ వైరల్!

షాక్ లో విజయ్..

Advertisement

ఇకపోతే టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ కి కూడా రజనీకాంత్ చేసిన ట్వీట్ గట్టి షాక్ ఇచ్చింది అనే కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు. ఇక తన పార్టీ కీలక నేత అధవ్ అర్జున్ ఇలాంటి కామెంట్లు చేసినప్పుడు అధ్యక్షుడిగా ఖండించాల్సింది పోయి మౌనం వహించాడు. అందుకే సూపర్ స్టార్ రజినీకాంత్ రంగంలోకి దిగారు అంటూ తలైవా అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.. ఏది ఏమైనా ఇప్పుడు టీవీకే పార్టీ అధికారంలోకి రావాలనుకుంటున్న సమయంలో సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో అటు ప్రజలలో కూడా తీవ్ర వ్యతిరేకత నెలకొంది అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా విజయ్ దళపతి తన చుట్టూ ముసురుతున్న ఇన్ని వివాదాలను తట్టుకొని ఏ విధంగా సత్తా చాటుతారో చూడాలి

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×