Oscars 2026: ప్రపంచ సినిమా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారంగా ఆస్కార్‌ను భావిస్తారనే విషయం తెలిసిందే. ఆ వేదికపై అడుగుపెట్టడమే ఒక కల అయితే, అక్కడ అవార్డును ప్రజెంట్ చేయడం అంటే, నిజంగా మామూలు విషయం కాదు. మన దేశం గర్వించదగ్గ నటి, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా (Global Star Priyanka Chopra) ఇప్పుడు ఆ అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. 2026లో జరగబోయే 98వ అకాడమీ అవార్డ్స్ (Oscars 2026) వేడుకలో ప్రియాంక ప్రజెంటర్‌గా మెరవబోతోంది. భారతీయ నటీమణులు ఆస్కార్ వేదికపై మెరవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో 2023లో జరిగిన 95వ అకాడమీ అవార్డ్స్ వేడుకలో దీపికా పదుకొనే ప్రజెంటర్‌గా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంది. అప్పట్లో ‘RRR’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటను ఆమె ఇంట్రడ్యూస్ చేసిన తీరు, ఆ తర్వాత ఆ సాంగ్ ఆస్కార్ గెలవడం ఒక చరిత్ర. ఇప్పుడు ప్రియాంక ఆ బాధ్యతను మరింత హుందాగా నిర్వర్తించబోతోంది.
Also Read- Priyamani: కరీనా కపూర్‌లా చూపిస్తానన్నారు..అందుకే బికినీ వేసుకున్నా.. ప్రియమణి షాకింగ్ కామెంట్స్..
మార్చి 15న లాస్ ఏంజెల్స్‌లోని ప్రఖ్యాత డాల్బీ థియేటర్ ఈ వేడుకకు వేదిక కానుంది. ఈ మెగా ఈవెంట్‌లో ప్రియాంక కేవలం ఒక అతిథిగా మాత్రమే కాదు, ప్రపంచ సినిమా దిగ్గజాలైన రాబర్ట్ డౌనీ జూనియర్ (Iron Man), క్రిస్ ఎవాన్స్ (Captain America) వంటి స్టార్లతో కలిసి వేదికను పంచుకోనుంది. అలాంటి హేమాహేమీలతో కలిసి స్టేజ్ పంచుకోవడం అంటే నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే అవెంజర్స్ టీమ్‌తో కలిసి మన దేశీ గర్ల్ సందడి చేయబోతోంది. ప్రియాంక చోప్రా ఇప్పటికే హాలీవుడ్ సిరీస్ ‘సిటాడెల్’, ‘క్వాంటికో’ లతో అక్కడ పాగా వేసి, గ్లోబల్ ఐకాన్‌గా మారింది. ఇప్పుడు హాలీవుడ్ ప్రైమ్ టైమ్ ఈవెంట్‌కు ప్రజెంటర్‌గా ప్రియాంక సాధించిన ఈ అరుదైన గౌరవం భారతీయ సినిమా ఖ్యాతిని మరోసారి విశ్వవ్యాప్తం చేస్తోంది.
Also Read- Allu Sirish – Nayanika Reddy: అల్లు శిరీష్ పెళ్లి సందడి.. నయనిక ఇంట్లో అల్లు ఫ్యామిలీ!
ప్రియాంక కేవలం ఒక ప్రజెంటర్‌గానే కాకుండా, ఆమె నటించిన కొత్త ప్రాజెక్ట్స్ కూడా అంతర్జాతీయ స్థాయిలో భారీ అంచనాలను పెంచుతున్నాయి. ముఖ్యంగా ఆమె నటిస్తోన్న తాజా చిత్రం ‘వారణాసి’ (Varanasi) గురించి ఇప్పుడు గ్లోబల్ మార్కెట్‌లో హాట్ టాపిక్ నడుస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో ప్రియాంక రేంజ్ మరో మెట్టు ఎక్కనుందనే చెప్పాలి. ఆస్కార్ వేదికపై ఆమె పేరు మారుమోగడం వల్ల.. అది ‘వారణాసి’ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ తీసుకురావడం ఖాయమని భావించవచ్చు. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ‘వారణాసి’లో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే.
Meet your third slate of presenters for the 98th Oscars.
Watch the #Oscars LIVE Sunday, March 15, at 7e/4p on ABC and Hulu, with Conan O’Brien hosting. #OnlyAtTheOscars pic.twitter.com/NEdABQDnMA
— The Academy (@TheAcademy) March 5, 2026
Also Read- Bellamkonda Srinivas: బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి.. అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?