E-Paper
Advertisement

Etela Rajender: మరో బాంబు పేల్చిన ఈటల రాజేందర్.. సీనియారిటీపై షాకింగ్ కామెంట్స్

Etela Rajender: మరో బాంబు పేల్చిన ఈటల రాజేందర్.. సీనియారిటీపై షాకింగ్ కామెంట్స్
Advertisement

Etela Rajender: బీజేపీ నేత, ఎంపీ ఈటల రాజేందర్ మారోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ఉన్నోళ్లు సీనియర్ లీడర్లు కాదని.. రాజకీయాల్లో ఉన్నవారే అసలైన సీనియర్ అంటూ వ్యాఖ్యానించారు. పార్టీలో గత కొంతకాలంగా జరుగుతున్న సీనియర్, జూనియర్ రచ్చపై ఈ మేరకు తన అభిప్రాయాన్ని తెలియజేశారు. గెలుపు గర్వంతో కాకుండా ప్రజాసేవకే అంకితమవ్వాలని పార్టీ నేతలు, శ్రేణులకు సూచించారు.

ఇటీవల ఎన్నికైన బీజేపీ కౌన్సిలర్లు, కార్పొరేటర్ల సన్మాన కార్యక్రమాన్ని నిజామాబాద్ లోని కమ్మ సంఘంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య​ అతిథిగా ఎంపీ ఈటల హాజరై మాట్లాడారు. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు హుందాగా వ్యవహరించాలన్నారు. గెలుపు గర్వంతో ముందుకు వెళ్తే భవిష్యత్తు రాజకీయం అంధకారమవుతుందన్నారు. అలాగే ప్రజలకు సేవ చేసినప్పుడే నిజమైన గుర్తింపు వస్తుందన్నారు.

Advertisement

రాజకీయ చరిత్రలో రైతులతో పెట్టుకున్న ఏ పార్టీ కూడా బతికి బట్టకట్టలేదని ఈ సందర్భంగా ఎంపీ ఈటల పేర్కొన్నారు. ఒకప్పుడు బీఆర్ఎస్​ (BRS) విర్రవీగిన తనంతో ముందుకు వెళ్లిందన్నారు. ప్రజలు, రైతులను, ఉద్యోగులను పట్టించుకోకుండా అహంకారపూరిత పాలన చేసిందన్నారు. చివరికి ఆ పార్టీ.. మట్టిలో కలిసిపోయిందన్నారు.​

Also Read: Special Trains: టీ20 వరల్డ్ కప్ ఫైనల్.. ఫ్యాన్స్‌కు రైల్వే శాఖ గుడ్ న్యూస్.. మ్యాచ్ కోసం స్పెషల్ రైళ్లు!

Advertisement

బీఆర్ఎస్ హయాంలో ఆర్థిక మంత్రి హోదాలో తాను ప్రవేశపెట్టిన బడ్జెట్ ను ప్రతిపక్షంలో ఉన్న డీఎస్ మెచ్చుకున్నారని ఈటల గుర్తుచేశారు. ఆయన రాజకీయ గురువైన అర్గుల రాజారాం.. ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్​తో దానిని పోల్చారన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ డీఎస్ హుందాతనం ప్రదర్శించేవారన్నారు. ప్రతిపక్షం అంటేనే విమర్శించడం కాదని.. అధికార పక్షం అంటే అధికారం చూపడం కాదని ఈటల పేర్కొన్నారు.

Also Read: Bullet Train Ticket: బుల్లెట్ రైలు టికెట్ ధరలపై.. పిచ్చక్లారిటీ వచ్చేసింది.. సామాన్యులకు పండుగే!

Related News

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆపై ప్రభుత్వం ప్రకటన

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×