Psychological Thriller OTT : ఎప్పటికైనా థ్రిల్లర్ సినిమాలకి ఉండే క్రేజే వేరు. ఆడియన్స్ ని కన్ఫ్యూజ్ లో పెట్టి చివరి వరకు కథను ఊహించని మలుపులు తిప్పుతుంటారు దర్శకులు. అందులోనూ ఇలాంటి సినిమాలు మలయాళంలో వస్తే ఇక ఆ సినిమాను అస్సలు వదిలిపెట్టరు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మలయాళం సినిమాలో సురాజ్ వెంజరామూడు ఒక విభిన్నమైన మానసిక స్థితి కలిగిన పాత్రలో నటించాడు. తన భర్య మిస్సింగ్ తో అసలు కథ మొదలవుతుంది. క్లైమాక్స్ వరకు ఈ సినిమాలో ట్విస్ట్లు వస్తుంటాయి. థ్రిల్లర్ ఫ్యాన్స్ ఈ సినిమాను చూసి వుండకపోతే ఓ లుక్ వేయండి. ఈ మూవీ పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
సునీల్ ఇబ్రహీం దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాపేరు ‘రాయ్’ (Roy). ఇందులో రాయ్ పాత్రలో సురాజ్ వెంజరామూడు, రాయ్ భార్య పాత్రలో సిజా రోజ్ నటించారు. ఇక మరో ముఖ్య పాత్ర అయిన సి.ఐ అజిత్ ఈశ్వర్ గా షైన్ టామ్ చాకో నటించారు. వైబ్‌జోన్ మూవీస్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా నేరుగా 9 డిసెంబర్ 2022న ఓటీటీలో విడుదలైంది. Sony LIV లో ఈ సినిమా మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. సోనీ లివ్‌తో పాటు, Airtel Xstream Play, JioTV లో కూడా ఈ సినిమాను చూడవచ్చు.
Read Also : క్రేజీ కొరియన్ జాంబీ సిరీస్ ‘ఆల్ ఆఫ్ అస్ ఆర్ డెడ్ సీజన్ 2’ అప్డేట్… మరో బ్యాడ్ న్యూస్ కూడా
రాయ్ (సురాజ్ వెంజరామూడు) అనే వ్యక్తికి ఒక అరుదైన మానసిక సమస్య ఉంటుంది. అతను తన కలలకు, నిజ జీవితానికి మధ్య వ్యత్యాసాన్ని గుర్తించలేడు. ఈ వింత పరిస్థితి వల్ల అతను సమాజానికి దూరంగా ఉంటూ, కేవలం తన భార్య టీనా (సిజా రోజ్) తో మాత్రమే చొరవగా ఉంటాడు. టీనా ఒక జర్నలిస్ట్ గా, రచయిత్రిగా కెరీర్ సాగిస్తుంటుంది. అయితే ఒక రోజు టీనా అకస్మాత్తుగా అదృశ్యమవుతుంది. తన భార్య కనిపించడం లేదని రాయ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ (షైన్ టామ్ చాకో) ఈ కేసును విచారించడం మొదలు పెడతాడు. తన భార్యను కాపాడుకోవడానికి రాయ్ తన విభిన్నమైన మానసిక స్థితిని, అంటే తన కలలలోని విజన్స్ ఆధారంగా చేసుకుని ఆమె ఎక్కడుందో కనిపెట్టడానికి ప్రయత్నిస్తాడు. అయితే రాయ్ చెప్పే విషయాలు, అతని కలల నుండి వచ్చినవా లేక నిజంగా జరిగినవా అనే అయోమయంలో పోలీసులు ఉంటారు. చివరికి టీనా ఎక్కడుందో వీళ్ళు కనిపెడతారా ? ఆమె మిస్సింగ్ కి కారణం ఎవరు ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.