E-Paper
Advertisement

Podarillu Today Episode : చక్రికి మహా సపోర్ట్..కేశవ్ ప్లాన్ సక్సెస్ అవుతుందా..? మాట నిలబెట్టుకున్న చక్రీ..

Podarillu Today Episode : చక్రికి మహా సపోర్ట్..కేశవ్ ప్లాన్ సక్సెస్ అవుతుందా..? మాట నిలబెట్టుకున్న చక్రీ..
Advertisement

Podarillu Today Episode December 26th : మహాను ఇంట్లో ఏదో పెద్ద గొడవ జరిగినట్టుంది.. మరి నాకు భోజనం పెడతారా? లేదా తినేసి రమ్మంటారా? ఎందుకంటే నేను ఆకలికి ఆకలేను అని అడుగుతాడు.. ఇంకా భోజనం చేయలేదా అని మహా అడుగుతుంది.. చేయలేదు కాబట్టే బయటకు వెళ్లి తినేసి రమ్మంటారా అని అడిగాను అని చక్రి అంటాడు. చక్రి కోసం మహా భోజనం తెచ్చి ఇస్తుంది. చక్రి ఈ పెళ్లి ఎట్టి పరిస్థితులను జరగదు మీరేం బాధపడకండి అని ధైర్యం చెప్తాడు.. నా పెళ్లి ఆపడానికి నువ్వెవరు మా నాన్నకు తెలిస్తే చంపేస్తాడు అని మహా అంటుంది.. మీరు అవన్నీ వదిలేసేయండి నేను చూసుకుంటాను కదా అని చక్రి అంటాడు. ఆ తర్వాత మహాను గుడికి తీసుకెళ్లాలని హారిక అక్కడికి వస్తుంది. ఇక్కడ నా మనసుని ఎవరు అర్థం చేసుకోవట్లేదు కనీసం గుడికి అయిన వెళ్తే ప్రశాంతత దొరుకుతుంది అని అంటుంది.. చక్రీ మాత్రం మహా పెళ్లి జరగదు అని మాట ఇస్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. చక్రి మహా గురించి మాధవ్ కి చెప్తాడు.. ఆ పెళ్లిని మనం ఆపేయాలి అన్నయ్య అని చెప్పగానే మాధవ్ షాక్ అవుతాడు.. ఆడపిల్ల పెళ్లి ఆపాలనుకోవడం పాపం రా నీకు తెలీదు నువ్వు నోరు మూసుకొని ఉండు అని వార్నింగ్ ఇస్తాడు. చక్రి ఎంత చెప్తున్నా సరే మాధవ్ వినడు. ఆ అమ్మాయి నాకు బాగా నచ్చింది నేను ఈ విషయాన్ని ఎలా వదిలేస్తాను అన్నయ్య అంటాడు. కేశవకు ఫోన్ చేసి ఈ విషయం గురించి చెప్తాడు చక్రీ.. అసలు అందరికీ భయం లేకుండా పోతుంది నేనంటే కొంచెం కూడా భయం లేకుండా పోతున్నారు అని మాధవ్ అంటాడు. ఏంట్రా నువ్వు ఇంత తొందరగా వచ్చావు అని కేశవ్ అని మాధవ్ అడుగుతాడు. చక్రీ ఫోన్ చేశాడు అనగానే మాధవ్ షాక్ అవుతాడు.. కేశవ్ మాత్రం వాడు వాడి జీవితంలో మంచి పని చేస్తున్నాడు హెల్ప్ చేయడం తప్పులేదు కదా అని మాధవ్ తో అంటాడు. మొత్తానికి అందరూ కలిసి చక్రికి అమ్మాయి నచ్చిందని ఫిక్స్ అయిపోతారు.

Advertisement

ఇక తర్వాత గుడి నుంచి వచ్చిన మహాని కలవడానికి భూషణ్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వీసా కి కావాల్సిన డాక్యుమెంట్స్ మీద సంతకాలు కావాలంట అల్లుడుగారు వచ్చారని ప్రతాప్ పిలుస్తాడు.. నా చావుకు నేనే అగ్రిమెంట్ రాసి సంతకాలు పెడుతున్నాను అని మహా ఫీల్ అవుతూ ఉంటుంది.. అక్కడున్న చక్రిని మహా చూస్తుంది. ఇక నా పెళ్లి ని ఎవరు ఆపరేమో అని బాధపడుతూ వాటి మీద సంతకాలు చేసేస్తుంది. లలిత చక్రిని నువ్వు చేసిన పని అయిపోయింది కదా ఇక నుంచి వెళ్ళు బయటకి అని అంటుంది. భూషణ్ వెళ్ళిపోతుంటే మహాను కారు దగ్గర వరకు వెళ్ళిరా అని అంటారు. అలాగే వెళ్తాను అని మహా అక్కడికి వెళుతుంది. మూవీకి మీద నుంచి ఈ డ్రెస్సింగ్ సెన్స్ ని మార్చుకోవాలి అని భూషణ్ అంటాడు.

మన పెళ్లి కాబోతుంది మరి నువ్వు ఎలా ఉండాలి ఇలా పల్లెటూరు దానిలాగా డ్రెస్సులు వేసుకుంటావా అని భూషణ్ అంటాడు. నీ డ్రెస్సులను ఇప్పటికైనా మార్చుకో అనేసి అనగానే మహా అలాగే అని అంటుంది. ఆ తర్వాత నేను వెళ్తాను అని కిందకి వెళ్ళగానే చక్రి కాలు అడ్డుపెట్టి భూషణ్ ని కింద పడేస్తాడు.. జస్ట్ మిస్ అయ్యి భూషణ్ కార్ని గుద్దుకుంటాడు.. చక్రిని ఇదంతా చేశాడు అని కోపంగా అతని మీదకి వస్తాడు.. వీడిని ఇంకా పనిలో పెట్టుకున్నారు ఏంటి తీసేయకుండా అని సీరియస్ అవుతాడు భూషణ్..

Advertisement

ఇందులో నా తప్పేమీ లేదు సార్ నేను చెప్పులు వదులుతూ ఉన్నాను. సార్ కి అడ్డంగానే పక్కకు తీస్తున్నాను ఆయన చూసుకోకుండా వచ్చి పడిపోయాడు అని అంటాడు చక్రి.. అయితే ఇతని పని నుంచి తీసేయండి అనుకోని భూషణ్ వెళ్ళిపోతాడు. ఏంటి బాబు చూసుకోవాలి కదా అని ప్రతాప్ అంటాడు. ఇతను తప్పేమీ లేదు నాన్న అతనే చూసుకోకుండా వెళ్ళాడు ఎందుకు నాన్న ఇలా మాట్లాడుతున్నారు అని మహా అంటుంది.. ఇక రాత్రి చక్రి తన అన్నదమ్ములతో కలిసి మహా పెళ్లిని క్యాన్సిల్ చేసేందుకు ప్లాన్ చేస్తాడు.

అమ్మాయికి ఈ పెళ్లంటే ఇష్టం లేదు అని చెప్తాడు.. దానికి మాధవ్ అమ్మాయికి ఇష్టం లేకపోతే అమ్మాయి చూసుకుంటుంది కదరా నీకెందుకురా ఇవన్నీ అని అంటాడు.. పెద్దలతో వ్యవహారం కాబట్టి మన జాగ్రత్తగా ఉండాలి రా ఇవన్నీ మనకెందుకు అని మాధవ్ ఉంటాడు. ఆ పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడు ఒకసారి చూడండి అని అంటాడు. బాగానే ఉన్నాడు కాకపోతే కాస్త పిల్లకు ఉంది అంతే అని మాధవ్ అంటాడు. ఇలాంటి వాడికి ఆ అమ్మాయి ఎలా ఉందో చూసి చెప్పండి అని అంటారు.. అమ్మాయిని చూడగానే చాలా బాగుంది చాలా అందంగా ఉంది అని అందరూ మెచ్చుకుంటారు.

ఇలాంటి వాడిని అలాంటి అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేసి ఆ అమ్మాయి జీవితాన్ని అన్యాయం చేయాలని చూస్తున్నారు.. వాళ్ళ అన్న ఆ అమ్మాయిని వాడికి కచ్చితంగా ఇచ్చి పెళ్లి చేస్తారు మనము ఈ పెళ్లిని ఆపాలి అని చక్రి అంటాడు.. ఆ అమ్మాయి నేను ఇష్టపడుతున్నాను అన్నా అని నిజం చెప్పేస్తాడు. అయితే ఆ మాట వినగానే అందరూ ఆలోచనలో పడతారు. ఏదో ఒకటి చేసి ఈ పెళ్లి ని ఆపాలని అనుకుంటారు.. మహని పెళ్లికూతురు లాగా హారిక రెడీ చేస్తూ ఉంటుంది..

ఆది అన్ని డాక్యుమెంట్స్ గురించి రిజిస్టర్ ఆఫీస్ సార్ తో మాట్లాడుతాడు.. ప్రతాప్ ఎవరితో రా మాట్లాడుతున్నావు అని అడుగుతాడు. రిజిస్టర్ గారితో మాట్లాడుతున్నాను నాన్న డాక్యుమెంట్స్ అన్నిటినీ తీసుకున్నాను వాటిని సబ్మిట్ చేసి పెళ్లి కార్యక్రమాన్ని పూర్తి చేయాలని అనుకుంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన అమ్మ లలితను చూసి ప్రతాప్ ఎక్కడికి వెళ్లావు లలిత అని అడుగుతారు. పెళ్లి ఎటువంటి ఆటంకాలు కలగకుండా జరిగిపోవాలని గుడికి వెళ్లి దర్శనం చేసుకుని వస్తున్నానండి అని అంటుంది. మహా మాత్రం హారిక పై సీరియస్ అవుతూ నన్ను బలికి సిద్ధం చేస్తున్నావా? కానీ తొందరగా అని కన్నీళ్లు పెట్టుకుంటుంది.. మొత్తానికి మహా రెడీ అయ్యి కిందకు వస్తుంది..

Also Read : అమూల్య ప్రేమ వల్ల రామరాజు కన్నీళ్లు.. విశ్వంను కొట్టిన ధీరజ్..రామరాజుకు దారుణమైన అవమానం..

కిందకు రాగానే మహాని చూసి అందరూ చాలా అందంగా ఉన్నావు . మా కూతురికి ఇన్ని రోజులకి పెళ్లి వయసు వచ్చిందని మేము అనుకుంటున్నాము అని ప్రతాప్ కూడా ఎమోషనల్ అవుతాడు.. కానీ లలిత మాత్రం దేవుడి దగ్గర దండం పెట్టుకోవాలి రా అనేసి మహాని తీసుకుని వెళుతుంది… ఇక పెళ్ళికొడుకు వాళ్ళు వస్తే తొందరగా మనం రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్దామని ప్రతాప్ అంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన భూషణ్ తల్లిదండ్రులు కంగారు పడుతూ జరిగిన విషయాన్ని చెప్తారు. పూలదండల కోసం బయటికి వెళ్లిన భూషణ్ ని ఎవరో కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని అంటారు. మాట వినగానే మహా చాలా సంతోషంగా ఉంటుంది. చక్రి ఆ అమ్మాయికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది అని వెళ్ళిపోతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో భూషణ్ ని చక్రి కిడ్నాప్ చేశాడని తెలుసుకుంటాడా లేదా అన్నది చూడాలి..

Related News

Telugu Tv Serials : ఈ వారం సీరియల్స్ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్ ఏదంటే..?

ఇంద్రజకు ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎన్ని లక్షలో తెలుసా..? సినిమా కన్నా ఎక్కువే..

Gundeninda GudiGantalu Today episode: సంబరాలు చేసుకున్న ప్రభా.. చింతామణి కుట్ర తెలిసిపోతుందా..? బాలుకు షాక్..

Podarillu Today Episode : విగ్నేశ్వరి దెబ్బకు మహా ఫ్యూజుల్ అవుట్.. మహా కోసం సర్ప్రైజ్ ప్లాన్.. నిజం తెలిసిపోతుందా..?

Intinti Ramayanam Today Episode: అయ్యో పాపం శ్రీయ.. పల్లవి నగలను కొట్టేసిందా..? అక్షయ్ సీరియస్..

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ కు షాక్.. వల్లి ఫిట్టింగ్ అదిరిపోయింది.. నెక్స్ట్ ఏం జరుగుతుంది..?

Sunday Movies in Tv : ఆదివారం టీవీ సినిమాలు.. మాస్ ఫ్యాన్స్ కు పునకాలే..

Nindu Noorella Saavasam Serial Today Episode July 18th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్లాన్ ప్రకారం బుజ్జమ్మ చంపాలనుకున్న ప్రచండ

Big Stories

Advertisement
×