E-Paper
Advertisement

ఆస్కార్ వేదికపై రామాయణ వరల్డ్ ప్రీమియర్.. ఎప్పుడంటే?

ఆస్కార్ వేదికపై రామాయణ వరల్డ్ ప్రీమియర్.. ఎప్పుడంటే?
Advertisement

Ramayana World Premiere: బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోనే కాకుండా ఇండియన్ మూవీ హిస్టరీలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఇతిహాస కావ్యం రామాయణ. 4 వేల కోట్ల బడ్జెట్లో రెండు భాగాలుగా రాబోతున్న ఈ చిత్రాన్ని మొదటి భాగం దీపావళి సందర్భంగా నవంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇక రెండవ భాగాన్ని వచ్చే ఏడాది దీపావళి కానుకగా రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే నవంబర్ 5వ తేదీన సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా సినిమాను రీచ్ చేయడానికి చిత్ర బృందం గట్టిగానే ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగానే ఎంపిక చేసిన ప్రధాన నగరాలలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లను పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ప్రజలలోకి సినిమాను తీసుకెళుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఏకంగా ఈ సినిమా వరల్డ్ ప్రీమియర్ ను ఆస్కార్ వేదికపై ప్రదర్శించబోతున్నాం అంటూ ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా (Namit Malhotra) చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి.

ఆస్కార్ వేదికపై రామాయణ ప్రీమియర్..

ఇకపోతే తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న నమిత్ మల్హోత్రా మాట్లాడుతూ..” భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలన్నదే మా లక్ష్యం. అందుకే మా రామాయణ చిత్రానికి సంబంధించి ఒక బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్ చేస్తున్నాము.. వచ్చే అక్టోబర్ 27వ తేదీన లాస్ఏంజెల్స్ లోని ప్రతిష్టాత్మక ‘ది అకాడమీ థియేటర్’ (ఆస్కార్ వేదిక) లో రామాయణ గ్రాండ్ వరల్డ్ ప్రీమియర్ ను నిర్వహించబోతున్నాము. అక్కడి నుండే మా గ్లోబల్ ప్రయాణాన్ని మొదలుపెట్టి, ఆ తర్వాత నవంబర్ 5న మనదేశంలోకి , ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకెళ్తాం..” అంటూ చిత్ర నిర్మాత నమిత్ మల్హోత్రా స్వయంగా వెల్లడించారు.

ఇది నూటికి నూరు శాతం భారతీయ సినిమా..

Advertisement

ఈ ప్రాజెక్టు గురించి నమిత్ మాట్లాడుతూ.. రామాయణ చిత్రాన్ని మేము ఒక హిందీ సినిమా గానో లేక తెలుగు సినిమా గానో తెరకెక్కించడం లేదు. ఇది నూటికి నూరు శాతం భారతీయ సినిమా.. మా అందరి హృదయాల నుంచి పుట్టిన సినిమా. మన గుండెలకు అత్యంత దగ్గరైన ఒక గొప్ప కథను, మన చరిత్రను ప్రపంచం ముందు ఎంతో గర్వంగా చూపించాలనేదే మా ఏకైక లక్ష్యం. అందుకే గ్లోబల్ స్థాయిలో సినిమాను ప్రదర్శిస్తున్నాం అంటూ తెలిపారు.

ALSO READ: ఇండస్ట్రీలో విషాదం.. దేవా సోదరుడి కొడుకు మృతి!

వారి ప్రేరణే ముందుకు నడిపిస్తోంది..

Advertisement

ఇకపోతే ఈ సినిమాను గ్లోబల్ స్థాయిలో విడుదల చేయడం వెనుక పొందిన ప్రేరణ గురించి వివరిస్తూ.. మన దేశంలో ఎంతోమంది గొప్ప డైరెక్టర్లు ఉన్నారు. రాజమౌళి గారు ఇండియన్ సినిమాను ప్రపంచ పటంలో నిలబెట్టిన తీరు చాలా అద్భుతం. వారిని చూసే మేము కూడా ఈ స్ఫూర్తి పొందాము. ముఖ్యంగా ఇవాళ లాస్ ఏంజిల్స్ కి లేదా హాలీవుడ్ కి వెళ్తే ప్రతి ఒక్కరికి ఆర్ఆర్ఆర్ మూవీ గురించి తెలుసు. ఇది ఎవరైనా గర్వించదగ్గ విజయం . ఇక హాలీవుడ్ ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ప్రభావాన్ని చూపిస్తుందో అంతకుమించిన టాలెంట్ మన దగ్గర కూడా ఉంది. ఆ నమ్మకంతోనే మన దేశపు గొప్ప కథతో ప్రపంచ వేదిక పైకి గర్వంగా అడుగుపెడుతున్నాము..మీ ఆశీస్సులు ప్రేమ మాకు చాలా ముఖ్యం అంటూ తెలిపారు. ఇక నితేష్ తివారీ రూపొందించిన ఈ విజువల్ వండర్ నవంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Related News

ఇండస్ట్రీలో విషాదం.. దేవా సోదరుడి కొడుకు మృతి!

ఆగిపోయిన ‘ప్రేమలు 2’.. అసలు విషయం చెప్పేసిన డైరెక్టర్!

వెన్నులో వణుకుపుట్టిస్తున్న ప్రశాంత్ నీల్ 418 మూవీ ట్రైలర్!

బాలకృష్ణతో జాగ్రత్తగా ఉండాలి..తేడా వస్తే దబిడి దిబిడే అంటున్న హీరో!

రామాయణ ప్రీ రిలీజ్ ఈవెంట్…సింగర్ గా మారిన సాయి పల్లవి.. ఫిదా అవ్వాల్సిందే!

యశ్ టాక్సిక్ డిజాస్టర్ పై దిల్ రాజు కామెంట్స్.. ఇంటర్నేషనల్ లెవెల్ అంటూ!

కాఫీ విత్ కరణ్‌ షోలో ‘విరోష్’ సందడి.. విజయ్ -రష్మిక పెళ్లి రహస్యం లీక్‌!

Big Stories

Advertisement
×