E-Paper
Advertisement

నిర్మాత ఆర్.బి చౌదరి మృతి.. సంతాపం తెలిపిన ప్రముఖ స్టార్ హీరో టీమ్!

నిర్మాత ఆర్.బి చౌదరి మృతి.. సంతాపం తెలిపిన ప్రముఖ స్టార్ హీరో టీమ్!
Advertisement

RB.Choudhary: సౌత్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతగా గుర్తింపు సొంతం చేసుకున్న ఆర్.బి చౌదరి భాషతో సంబంధం లేకుండా తెలుగు, తమిళ్, హిందీ చిత్ర పరిశ్రమల్లో 100కు పైగా చిత్రాలను నిర్మించి ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. సినిమా రంగంలో విశేష సేవలు అందించి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న ఆయన అనూహ్య మరణం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. రాజస్థాన్లోని ఉదయపూర్ లో జరిగిన కారు ప్రమాదంలో ఆయన మరణించారు. ఈయన ఎవరో కాదు ప్రముఖ తమిళ హీరో జీవాకి తండ్రి. తెలుగులో సూర్యవంశం ,నువ్వు వస్తావని , రాజా, నిన్నే ప్రేమిస్తా, సుస్వాగతం, శీను , సింహరాశి, శివరామరాజు, సంక్రాంతి, రచ్చ , గాడ్ ఫాదర్ వంటి ఎన్నో మూవీస్ ను సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ పైనే నిర్మించి మంచి పేరు సొంతం చేసుకున్నారు.

చిత్ర బృందంలో సంతాప సభ..

ఇకపోతే ఆయన మరణ వార్తతో సినీ పరిశ్రమ ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది. పలువురు ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలియజేశారు. ఈ క్రమంలోనే సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ లో వస్తున్న 99వ చిత్రం మకుటం. ఇందులో విశాల్ హీరోగా నటిస్తున్నారు. మకుటం సినిమా షూటింగ్లో నిర్మాత ఆర్.బీ. చౌదరి మరణ వార్త తెలుసుకున్న చిత్ర బృందం దిగ్భ్రాంతికి గురయ్యారు. షూటింగ్ సెట్ లో సంతాప సభ నిర్వహించి, నివాళులు అర్పించారు. ఒక ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వ్యాపారవేత్తగా ఆర్.బి చౌదరి..

Advertisement

ఆర్.బీ. చౌదరి విషయానికి వస్తే.. సినిమా రంగంలోకి రావడానికి ముందే ఆయన విజయవంతమైన వ్యాపారవేత్త. స్టీల్ వ్యాపారం, ఎగుమతులు, జువెలరీ రంగాలలో తనదైన ముద్ర వేసి బలమైన ఆర్థిక పునాదిని కూడా నిర్మించుకున్నారు. ఆయన ఆర్థికంగా నిలబడిన తర్వాతే సినిమా రంగంలోకి రావాలని కోరుకున్న ఆయన సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ ను స్థాపించి దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఒక బ్రాండ్ గా దానిని రూపుదిద్దారు. ఈ సంస్థ ద్వారా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో అనేక విజయవంతమైన చిత్రాలను నిర్మించారు.

ALSO READ:గుర్తుపట్టలేని స్థితిలో స్టార్ హీరో.. ఈ పరిస్థితికి కారణం?

మెగా కుటుంబంతో ఆర్.బి.చౌదరి..

Advertisement

మెగా కుటుంబంతో ఆర్.బి చౌదరికి ఉన్న అనుబంధం చాలా ప్రత్యేకమైనది. చిరంజీవి వంటి అగ్ర హీరోలతో కలిసి పనిచేస్తూ అనేక విజయవంతమైన ప్రాజెక్టులను కూడా నిర్మించారు. ఈ అనుభవాన్ని మరింత బలపరిచేందుకు ఆయన మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ అనే మరో బ్యానర్ ని కూడా ప్రారంభించారు. ఈ బ్యానర్ పై మెగా హీరోల సినిమాల నిర్మాణం, పంపిణీ చేపట్టడం కూడా జరిగింది. ఇక ఈ బ్యానర్ లో రూపొందిన స్నేహం కోసం వంటి చిత్రాలు మంచి విజయాన్ని కూడా సొంతం చేసుకున్నాయి. అంతేకాదు ఇటీవల చిరంజీవి హీరోగా నటించి విడుదలైన గాడ్ ఫాదర్ చిత్రాన్ని కూడా ఆర్బీ చౌదరి సహా నిర్మాతగా నిర్మించారు. ఇలా ఎన్నో చిత్రాలను నిర్మించి మంచి పేరు సొంతం చేసుకున్నారు.

Related News

సమ్మర్ హీట్‌లో ప్రగ్యా జైస్వాల్ స్పెషల్ ట్రీట్.. నెట్టింట వైరల్!

రైలులో శ్రేయా ఘోషల్‌కు పీరియడ్స్.. నాన్న చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు!

అల్లు అర్జున్ ‘రాకా’ విడుదల ఎప్పుడంటే… ఫ్యాన్స్ కు నిరీక్షణ తప్పదా?

ఇరుముడి తర్వాత ఇలాంటి స్టోరీనా.. రవితేజకి సెట్ అవుతుందా?

RC17 కోసం హాలీవుడ్ దిగ్గజం…సుకుమార్ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్!

చిరు ‘కాకా’ వాయిదా రూమర్లపై క్లారిటీ .. సంక్రాంతి పోటీకి సై అంటూ!

సౌందర్య మరణంపై స్టార్ హీరో ఎమోషనల్ కామెంట్స్!

రాకాను వెంటాడుతున్న వరుస లీకులు.. కథ మొత్తం లీక్ చేసేస్తారా?

Big Stories

Advertisement
×