E-Paper
Advertisement

గుర్తుపట్టలేని స్థితిలో స్టార్ హీరో.. ఈ పరిస్థితికి కారణం?

గుర్తుపట్టలేని స్థితిలో స్టార్ హీరో.. ఈ పరిస్థితికి కారణం?
Advertisement

Tollywood:చిత్ర పరిశ్రమలో సెలబ్రిటీలు తెరపై కనిపించినంత వరకూ చాలా అందంగా, హుందాగా, లగ్జరీగా గడిపేస్తూ అందరిని సంతోషపరుస్తూ ఉంటారు. అయితే ఎప్పుడైతే తెరకు దూరంగా ఉంటారో.. ఆ సమయంలో గుర్తుపట్టలేనంతగా మారిపోయి అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్స్ వెండితెరపై అందాలు ఆరబోసి.. ఆ తర్వాత వెండితెరకు దూరమై మళ్ళీ సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యారు. ఆ సమయంలో వారిని గుర్తుపట్టలేక అభిమానులు కూడా కాస్త నిరాశ వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా ఒకప్పుడు 80,90 దశకాలలో తనదైన నటనతో, మంచి పర్ఫామెన్స్ తో, యాక్షన్ హీరోగా తనకంటూ మంచి పేరు సొంతం చేసుకున్న భానుచందర్ ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయి అందరిని ఆశ్చర్యపరిచారు.

ఆశ్చర్యపరుస్తున్న భానుచందర్ కొత్త గెటప్..

చాక్లెట్ బాయ్ గా, పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన.. సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకులను మెప్పించారు. ఇకపోతే తాజాగా ఈయనకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా ఆయన గెటప్ చూసి నెటిజన్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇకపోతే ఇప్పుడు వీడియో బయటకు రావడానికి అసలు కారణం ఏమిటంటే.. కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురానికి చెందిన ప్రముఖ వంట మాస్టర్ “గోదావరి రుచులు” అధినేత చిట్టి బాబుకి భానుచందర్ వీరాభిమాని.. చిట్టిబాబు వంటకాలు రుచికి పెద్ద అభిమాని అయిన సెలబ్రిటీలలో ఈయన కూడా ఒకరు. ఈ క్రమంలోనే చిట్టిబాబు పెళ్లిరోజు సందర్భంగా భానుచందర్ ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ షేర్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో చూసిన అభిమానులు భానుచందర్ ఏంటి ఇలా మారిపోయారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన భానుచందర్..

Advertisement

పూర్తిగా తెల్లబడిన జుట్టు, గడ్డంతో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో కనిపిస్తున్నారు. ఒకప్పుడు మనం తెరపై చూసిన గ్లామరస్ భానుచందర్ కి , ఇప్పటి రూపానికి అస్సలు పోలికే లేకపోవడం గమనార్హం. ఇక ప్రస్తుతం ఈయన వయసు 73 సంవత్సరాలు కావడంతో సహజంగానే వచ్చిన ఈ మార్పును ఆయన గౌరవంగా స్వీకరించడం చూసి అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు. మేకప్ లేకుండా చాలా సాదాసీదాగా కనిపిస్తుండడంతో ఈ చర్చ నెట్టింట మొదలైంది. ఇకపోతే ఆయన రూపం మారినా ఆయన మాటల్లో ఆ గాంభీర్యం, కళ్ళల్లో అదే తీక్షణత ఏ మాత్రం తగ్గలేదని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

ALSO READ:గెలుపు వెనుక సంగీత ప్రముఖుల హస్తం.. అప్పట్లో జగన్.. ఇప్పట్లో విజయ్!

భానుచందర్ కెరియర్..

Advertisement

భానుచందర్ విషయానికి వస్తే.. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మాస్టర్ వేణు కుమారుడైన ఈయన.. మార్షల్ ఆర్ట్స్ లో బ్లాక్ బెల్ట్ అందుకున్నారు. నిరీక్షణ సినిమాతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్న భానుచందర్ సూత్రధారులు సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్నారు. హీరోగా అవకాశాలు తగ్గాక సింహాద్రి , దుబాయ్ శీను వంటి చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు పోషించిన ఈయన 73 సంవత్సరాల వయసులో కూడా నిత్యం వ్యాయామం , మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తూ తన ఫిట్నెస్ ను కాపాడుకుంటూ వస్తున్నారు.

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×