E-Paper
Advertisement

MSVPG Film: ‘ మన శంకర వరప్రసాద్ గారు’ కి సీక్వెల్ ఉందా? ఈ ట్విస్ట్ ఏంటీ బాసు!

MSVPG Film: ‘ మన శంకర వరప్రసాద్ గారు’ కి సీక్వెల్ ఉందా? ఈ ట్విస్ట్ ఏంటీ బాసు!
Advertisement

MSVPG Film: ఇటీవల కాలంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ప్రతి ఒక్క సినిమాకి సీక్వెల్ సినిమాలను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్క సినిమా సీక్వెల్ సినిమాలు గానే విడుదలకు సిద్ధమవుతున్నాయి. అయితే ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమాల విషయంలో ప్రేక్షకులు ఎంతో ఆత్రుత కనబరుస్తున్నారు. ఇక ఇటీవల ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమాలన్నీ కూడా సీక్వెల్ సినిమాలు గానే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి త్వరలో విడుదల కాబోయే ది రాజా సాబ్ సినిమాకి కూడా సీక్వెల్ ఉండబోతుందని తెలుస్తోంది.. అలాగే చిరంజీవి హీరోగా నటించిన మన శంకర వరప్రసాద్ గారు(MSVPG Movie) సినిమా కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

సీక్వెల్ ఉంటుందా?

ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్లలో భాగంగా నిర్మాతలు సాహు గారపాటి , సుస్మిత కొణిదెల కూడా పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా మీడియా వారి నుంచి వీరికి మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా సీక్వెల్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మేరకు ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందా? అంటూ ప్రశ్నలు ఎదురయ్యాయి.

మన శంకర వరప్రసాద్ గారు కంప్లీట్ ఎండింగ్ మూవీ

Advertisement

ఈ ప్రశ్నకు నిర్మాతలలో ఒకరైన సుస్మిత సమాధానం ఇస్తూ మన శంకర వరప్రసాద్ గారు కంప్లీట్ ఎండింగ్ మూవీ. ఈ సినిమా క్లైమాక్స్ లో పార్ట్ 2 గురించి ఎలాంటి ప్రకటన ఉండదు ఈ సినిమాకు సీక్వెల్ చేయాలని ఆలోచన కూడా మాకు లేదని స్పష్టం చేశారు. దీంతో ఈ సినిమా సీక్వెల్ గురించి వస్తున్న వార్తలకు పూర్తిగా చెక్ పెట్టినట్టు అయ్యింది. ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవి NIA అధికారిగా కనిపించబోతున్నారు. చిరంజీవికి జోడిగా నయనతార నటిస్తున్నారు.

కీలకపాత్రలో వెంకటేష్

Advertisement

ఈ సినిమాలో మరొక నటుడు వెంకటేష్ కూడా కీలకపాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. మొత్తానికి సంక్రాంతి పండుగకు అద్భుతమైన కథతో చిరు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. మరి ఈ సినిమా ద్వారా ఈయన ఎలాంటి సక్సెస్ అందుకుంటారనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకుడు కావడంతో సినిమా పట్ల మంచి అంచనాలే ఉన్నాయి ఇప్పటివరకు విడుదల చేసిన అప్డేట్స్ కూడా సినిమాపై భారీ హైప్  క్రియేట్ చేశాయి . భోళా శంకర్ వంటి డిజాస్టర్ తర్వాత చిరు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా కావడంతో మన శంకర వరప్రసాద్ గారి సినిమాపై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మరి సంక్రాంతి సందర్భంగా చిరు ఈ సినిమా ద్వారా ప్రేక్షకులను ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నారో తెలియాలి అంటే ఎదురుచూడాల్సిందే.

Also Read: Big tv Kissik Talks Promo: జీవితంలో అలాంటి రోజు మళ్ళీ రావద్దు.. పృథ్వీరాజ్  ఎమోషనల్!

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×