E-Paper
Advertisement

Best Mileage Bikes 2026: హీరో TO బజాజ్.. అదిరిపోయే మైలేజ్ ఇచ్చే బైక్స్ ఇవే!

Best Mileage Bikes 2026: హీరో TO బజాజ్.. అదిరిపోయే మైలేజ్ ఇచ్చే బైక్స్ ఇవే!
Advertisement

Best Mileage Bikes In India 2026: మధ్య తరగతి ప్రజలకు బైక్ కొనే ముందు ఎక్కువగా ఆలోచించే అంశం మైలేజ్. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించాలని భావిస్తారు. అందుకే, మోటార్ సైకిల్ కంపెనీలు కూడా ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్స్ ను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుంటాయి. ప్రస్తుతం దేశంలో అత్యధిక మైలేజ్ ఇచ్చే బైకులు 100-125 సీసీ కమ్యూటర్ సెగ్మెంట్ లో ఉన్నాయి. ఇవి ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సర్టిఫైడ్ మైలేజ్ ఆధారంగా లిస్ట్ చేయబడ్డాయి. వాస్తవ పరిస్థితుల్లో కాస్త తేడాలు ఉండవచ్చు. రోడ్డు, ట్రాఫిక్, డ్రైవింగ్ స్టైల్ లాంటి అంశాలు ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. 2026లో ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్స్ ఏంటనేవి ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్    

ఈ బైక్ లీటర్ కు 83 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఈ బైక్ ఇంజిన్ 109.7 సీసీ ఉంటుంది. 8.08 bhp పవర్ ను కలిగి ఉంటుంది. దీని ధర రూ. 72,000 నుంచి ప్రారంభం అవుతుంది. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, USB చార్జింగ్, మంచి సస్పెన్షన్, రూరల్ రోడ్లకు అనువుగా ఉంటుంది.

⦿ హీరో స్ల్పెండర్ ప్లస్

Advertisement

ఈ బైక్ కూడా ఇంచు మించు 83 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుంది. 97.2 సీసీ ఇంజిన్ ఉంటుంది. 7.9 bhp పవర్ ను కలిగి ఉంటుంది. దీని ధర రూ. 77,000 నుంచి ప్రారంభం అవుతుంది. బ్లూటూత్ కనెక్టివిటీ, డిజిటల్ మీటర్, i3S టెక్నాలజీని కలిగి ఉంటుంది.

⦿ టీవీఎస్ Radeon

ఈ బైక్ సుమారు 73 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇంజిన్ 109.7 సీసీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. 8.08 bhp పవర్ ను కలిగి ఉంటుంది. ధర రూ. 69,983 నుంచి ప్రారంభం అవుతుంది. పిల్లియన్ గ్రాబ్ రైల్, USB పోర్ట్, మంచి బిల్డ్ క్వాలిటీ, సిటీ, హైవే రైడింగ్ కు సూటబుల్ గా ఉంటుంది.

⦿ బజాజ్ ప్లాటినా 100

Advertisement

ఈ బైక్ 70 కిలో మీటర్ల మైలేజ్ అందిస్తుంది. 102 సీసీ ఇంజిన్ ను కలిగి ఉంటుంది. 7.79 bhp పవర్ ను కలిగి ఉంటుంది. ఈ బైక్ రూ. 65,407 నుంచి ప్రారంభం అవుతుంది. సింపుల్ డిజైన్, లాంగ్ సీట్, లో మెయింటెనెన్స్, రూరల్ యూజ్‌కు బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.

⦿ హీరో స్ల్పెండర్ ప్లస్

ఈ బైక్ మైలేజ్ సుమారు 70 కిలో మీటర్ల వరకు ఇస్తుంది. 97.2 సీసీ ఇంజిన్ ను కలిగి ఉంటుంది. 7.9 bhp పవర్ ను కలిగి ఉంటుంది. క్లాసిక్ డిజైన్, అత్యధిక విక్రయాలు, i3S టెక్నాలజీ, డ్యూరబుల్ ఇంజిన్ ను కలిగి ఉంటుంది.

వాస్తవానికి ఈ మైలేజ్ అనేది ARAI క్లెయిమ్ చేసిన వివరాలు. రియల్ మైలేజ్ 50 నుంచి 70 కిలో మీటర్ల వరకు ఉంటుంది.  డ్రైవింగ్ హ్యాబిట్స్ పై ఆధారపడి ఉంటుంది. వినియోగదారులు వీటిని ఎలాంటి టెన్షన్ లేకుండా కొనుగోలు చెయ్యొచ్చు.  బైక్స్ కు మంచి సర్వీస్ నెట్ వర్క్ ఉంటుంది.

Read Also: ఫ్రీ యాక్సెసరీస్, పదేళ్ల వ్యారెంటీ.. KTM బైక్ కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్ బ్రో!

Related News

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 హైపర్‌ షిఫ్ట్ విడుదల.. ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ఆడి Q3 అదిరిపోయే ఎంట్రీ.. సేఫ్టీ ఫీచర్లు చూస్తే షాకవ్వాల్సిందే!

టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్.. హీరో ఎక్స్‌ ట్రీమ్ 250ఆర్ కార్బన్ అదిరింది గురూ!

ఇండియన్ మార్కెట్ లో ఇక ఈ కారు కనిపించదు, MG ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందంటే?

హీరో ఎక్స్‌ ట్రీమ్ 160R 4V కొత్త మోడల్ వచ్చేసింది, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×