E-Paper
Advertisement

Tollywood: ఫెయిల్యూర్ హీరో కోసం క్యూ కడుతున్న నిర్మాతలు.. రోడ్డెక్కుతున్న బయ్యర్లు!

Tollywood: ఫెయిల్యూర్ హీరో కోసం క్యూ కడుతున్న నిర్మాతలు.. రోడ్డెక్కుతున్న బయ్యర్లు!
Advertisement

Tollywood: సాధారణంగా ఒక సినిమాతో ఒక హీరో మంచి విజయాన్ని అందుకున్నారు అంటే.. ఇక ఆయనకు వరుసగా అవకాశాలు క్యూ కడతాయి. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ తో సంబంధం లేకుండా ఒక హీరో తన టాలెంట్ ను నిరూపించుకుంటూ బాక్సాఫీస్ వద్ద తన మార్కెట్ ను పెంచుకున్నాడు అంటే ఆటోమేటిక్ గా ఆయన రెమ్యూనరేషన్ కూడా పెరిగిపోతుంది. కానీ ఇక్కడ ఒక హీరో వరుసగా ఫ్లాప్స్ ఎదుర్కొన్నప్పటికీ కూడా.. ఆయన కోసం నిర్మాతలు క్యూ కట్టడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా ఆయనను నమ్ముకుని సినిమాలు తీస్తూ నిర్మాతలు లాభపడుతున్నా.. డిస్ట్రిబ్యూటర్లు మాత్రం రోడ్డెక్కే పరిస్థితులు ఏర్పడ్డాయి.

విభిన్న జానర్ లలో సినిమాలు..

పూర్తి వివరాల్లోకి వెళితే.. సినిమా పైన ఉండే ఆసక్తితో తన ఉద్యోగాన్ని కూడా కాదనుకొని సినిమాల్లోకి అడుగు పెట్టాడు ఒక యువ హీరో. మొదట అసిస్టెంట్ డైరెక్టర్గా తన కెరియర్ ను ప్రారంభించి.. ఆ తర్వాత పలు యంగ్ హీరోల చిత్రాలలో సెకండ్ హీరోగా తన కెరియర్ ను మార్చుకున్నారు. ఇక ఒక్కో మెట్టు ఎదుగుతూ విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించిన ఈయన ఆ తర్వాత హీరోగా మారి సోలోగా సినిమాలు చేయడం మొదలు పెట్టాడు. ఒకటి కాదు రెండు కాదు కామెడీ ప్రధానంగా చేసుకొని పలు సినిమాలు చేస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అలా ప్రధానంగా కామెడీ బేస్ చేసుకుని వచ్చిన అన్ని సినిమాలు ఆయనకు మంచి విజయాన్ని అందించాయి. కానీ మధ్యలో కాస్త జానర్ మార్చడంతో ఆ హీరో కాస్తా బొక్క బోర్ల పడ్డారు.

బాక్స్ ఆఫీస్ వద్ద మార్కెట్ జీరో.. అయినా క్యూ కడుతున్న నిర్మాతలు

Advertisement

ఆ తర్వాత మళ్లీ తాను నమ్ముకున్న కామెడీతో ప్రేక్షకులు ముందుకు వచ్చి సక్సెస్ అయిన ఆ హీరో ఈ మధ్యకాలంలో కేవలం వారం వ్యవధిలోనే రెండు చిత్రాలను రిలీజ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకోవాలని చూశారు. కానీ రెండు చిత్రాలు కూడా డిజాస్టర్ గా నిలిచాయి. ఒకప్పుడు 2 – 3 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్న ఈయన ఇప్పుడు 7 నుండి 8 కోట్లకు తన రెమ్యూనరేషన్ పెంచినప్పటికీ కూడా నిర్మాతలు క్యూ కట్టడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఇకపోతే ఈయనతో సినిమాలు చేసిన నిర్మాతలు మాత్రం తమ సినిమాను అమ్మేసి సేఫ్ జోన్ లోకి వెళ్తుంటే.. ఆ సినిమాను కొన్న బయ్యర్ లో మాత్రం బలి అవుతున్నారనే వార్తలు స్పష్టంగా వినిపిస్తున్నాయి.

ALSO READ:Allu Sirish – Nayanika Reddy: అల్లు శిరీష్ పెళ్లి సందడి.. నయనిక ఇంట్లో అల్లు ఫ్యామిలీ!

హీరో క్రేజ్ కి కారణం?

Advertisement

ఇకపోతే వరుస ఫ్లాప్ లతో బాక్సాఫీస్ వద్ద ఈయన మార్కెట్ జీరో అయినప్పటికీ నిర్మాతలు ఈయన వెంట పడడానికి కారణం ఈయన ఓటిటి మార్కెట్ బిల్డ్ చేసుకోవడమే.. అటు ఈయన చేసిన ఏ సినిమా అయినా సరే థియేటర్లలో సత్తాచాట లేకపోయినా..ఓటీటీలో మాత్రం మంచి టిఆర్పి రేటింగ్ సొంతం సొంతం చేసుకుంటుండడంతో.. థియేటర్ లలో సక్సెస్ కాలేకపోయినా ఇటు ఓటిటిలో సక్సెస్ అవుతుందనే ఆశాభావంతో నిర్మాతలు ఈయనతో సినిమాలు చేయడానికి క్యూ కడుతున్నారు. ముఖ్యంగా 8కోట్ల రెమ్యూనరేషన్ ఇవ్వడానికి కూడా వెనకాడడం లేదు అంటే ఆ హీరోకి ఓటీటిలో డిమాండ్ ఏ మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు.

నిర్మాతలు సేఫ్.. బయ్యర్లు బలి..

అయితే చివరిగా చెప్పొచ్చేదేమిటంటే.. ఎన్ని విన్యాసాలు చేసినా సినిమా అనేది థియేటర్లో హిట్ అయితేనే ఆ హీరోకి గుర్తింపు ఉంటుంది. బిజినెస్ అవుతుంది. అలా కాదని బాక్స్ ఆఫీస్ వద్ద మార్కెట్ జీరో ఉంటే మాత్రం ప్రేక్షకులు ఆదరించరు అనే విషయాన్ని సదరు హీరో గుర్తిస్తే బాగుంటుంది. ఏదిఏమైనా ఈ హీరోని నమ్ముకుని బాక్సాఫీస్ వద్ద ఏదో సాధిస్తాడని భావిస్తున్న బయ్యర్లు మాత్రం రోడ్డుకు ఎక్కుతున్నారనే కామెంట్లు స్పష్టంగా వ్యక్తం అవుతున్నాయి.

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×