E-Paper
Advertisement

IND VS NZ Final: అభిషేక్ బ‌తికిపోయాడు, మిస్ట‌రీ స్పిన్న‌ర్ పై వేటు..ఫైన‌ల్స్ ఆడే టీమిండియా జ‌ట్టు ఇదే

IND VS NZ Final: అభిషేక్ బ‌తికిపోయాడు, మిస్ట‌రీ స్పిన్న‌ర్ పై వేటు..ఫైన‌ల్స్ ఆడే టీమిండియా జ‌ట్టు ఇదే

IND VS NZ Final:  టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) ఫైనల్ మరికొన్ని గంటల్లోనే జరగనున్న సంగతి తెలిసిందే. ఈ వరల్డ్ కప్ ఫైనల్ లో టీమిండియా, న్యూజిలాండ్ ( Team India vs New Zealand, Final ) తలపడతాయి. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ( Narendra Modi Stadium, Ahmedabad ) వేదికగా ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ ఉంటుంది. రేపు 7 గంటల సమయంలో ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. జియో హాట్ స్టార్ లేదా స్టార్ స్పోర్ట్స్ లో ఈ మ్యాచ్ తిలకించవచ్చు.

Also Read: Shaheen Afridi: అల్లాహ్ మీద ఒట్టు..2027 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్స్ లో ఇండియాను ఓడించ‌క‌పోతే పేరు మార్చుకుంటా

న్యూజిలాండ్ తో జరిగే ఫైనల్స్ లో టీమిండియా జట్టు ఇదే

టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో రేపు టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇలాంటి నేపథ్యంలో ఫైనల్ ఆడే టీమ్ ఇండియా జట్టు దాదాపు ఖరారు అయినట్లు చెబుతున్నారు. ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగేందుకు సిద్ధమైందట టీమిండియా. అయితే ఆ ఒక్క మార్పు అభిషేక్ శర్మది అనుకుంటే పొరపాటే.

వరుసగా ఫెయిల్ అవుతున్న అభిషేక్ శర్మకు మరోసారి ఛాన్స్ ఇచ్చేందుకు టీమిండియా నిర్ణయం తీసుకుంది అంటూ వార్తలు వస్తున్నాయి. కచ్చితంగా ఫైనల్స్ లో అభిషేక్ శర్మ రాణిస్తాడని బీసీసీఐ అధికారులు చెబుతున్నారు. దీంతో అభిషేక్ శర్మ బెర్త్ కన్ఫామ్ అయిపోయినట్లే అంటున్నారు. అయితే వేటుపడేది వరుణ్ చక్రవర్తి పైన అని తెలుస్తోంది. ఇంగ్లాండ్ తో జరిగిన రెండో సెమీఫైనల్ లో నాలుగు ఓవర్లలో 60కి పైగా పరుగులు ఇచ్చాడు వరుణ్ చక్రవర్తి. అందుకే అతనికి రెస్ట్ ఇస్తూ కుల్దీప్ యాదవ్ ను బరిలోకి దింపేందుకు టీమిండియా యాజమాన్యం భావిస్తోంది. అహ్మదాబాద్ గడ్డపైన కుల్దీప్ యాదవ్ కు మంచి ట్రాక్ రికార్డు కూడా ఉంది. ఇక మిగిలిన ప్లేయర్ లందరూ యధావిధిగా ఆడనున్నారు.

న్యూజిలాండ్ వర్సెస్ టీమిండియా మధ్య రికార్డులు

టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య రికార్డులు పరిశీలిస్తే, టి20 వరల్డ్ కప్ టోర్నమెంట్లో ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య మూడు మ్యాచ్లు జరిగాయి. ఈ మూడింటిలో న్యూజిలాండ్ విజయం సాధించడం గమనార్హం. ఇప్పుడు ఇదే అంశం టీమిండియాను టెన్షన్ పడుతోంది. ఐసీసీ ఈవెంట్లు జరిగితే న్యూజిలాండ్ గెలవడం ఆనవాయితీగా వస్తోంది. మరి ఈసారి ఆ సెంటిమెంట్ ను దాటేస్తారా? లేదా ? చూడాలి. ఇటు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఇప్పటికే 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ జరిగింది. ఇందులో టీమిండియా ఓడిపోవడం కూడా చూశాం. ఇప్పుడు మళ్లీ 2026 t20 వరల్డ్ కప్ ఫైనల్ ఇదే వేదికగా జరుగుతోంది. మరి ఈసారైనా టీం ఇండియా గెలుస్తుందా? లేదో చూడాలి.

 

టీమిండియా తుది జ‌ట్టు అంచ‌నా

టీమిండియా తుది జ‌ట్టు అంచ‌నా: సూర్య కుమార్ యాదవ్ ( కెప్టెన్ ), సంజు శాంసన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, ఇషాన్ కిషన్, శివమ్ దూబే, అభిషేక్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్, తిలక్ వర్మ.

Also Read: Tanveer Ahmed: 15వ‌ ఓవర్ నుంచే ఫిక్సింగ్…క్యూరేటర్ మెడ‌పై క‌త్తి పెట్టి, పిచ్ అనుకూలంగా జై షా మార్చుకున్నాడు

 

Related News

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Tanveer Ahmed: విరాట్ కోహ్లీ మ‌గాడైతే, పాకిస్తాన్ పిచ్ ల‌పై ఆడి చూపించాలి

లాహోర్ గ‌డ్డ‌పై విరాట్ కోహ్లీ ప్లకార్డులు…గూస్ బంప్స్ రావాల్సిందే

Big Stories

×