E-Paper
Advertisement

Horror thriller OTT: భయపెట్టే చావులు…ఇన్వెస్టిగేషన్ లో ట్విస్టులు… గుండెల్లో దడ పెట్టించే మలయాళం హారర్ థ్రిల్లర్

Horror thriller OTT: భయపెట్టే చావులు…ఇన్వెస్టిగేషన్ లో ట్విస్టులు… గుండెల్లో దడ పెట్టించే మలయాళం హారర్ థ్రిల్లర్
Advertisement

Horror thriller OTT : మలయాళం నుంచి వస్తున్న సినిమాలకు మన ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ఇక వీటిలో దెయ్యాల సినిమాలను అస్సలు మిస్ చేయట్లేదు. గత ఏడాది ఈ జానర్ లో వచ్చిన సినిమాలు బ్లాక్ బస్టర్లు కూడా అయ్యాయి. ‘సర్వం మాయ’ హారర్ కామెడీ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి, ఇప్పుడు ఓటీటీలో కూడా ట్రెండ్ అవుతుంది. అయితే ఇలాంటి జోనర్ లో వచ్చిన మరో సినిమా రీసెంట్ గానే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా కామెడీ జోనర్ లో కాకుండా కాస్త సీరియస్ గానే ఉంటుంది. అయితే ఈ సినిమాకి థియేటర్లలో అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు. ఓటీటీలో కాస్త మెప్పిస్తోంది. నటనలో వైవిధ్యాన్ని చూపించే షైన్ టామ్ చాకో ఇందులో లీడ్ రోల్ లో నటించారు.

ఏ ఓటీటీలో చూడచ్చు అంటే

ఈ మలయాళ హారర్ థ్రిల్లర్ సినిమా పేరు ‘ది ప్రొటెక్టర్’ (The Protector). జి.ఎం. మను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 2025 జూన్ 13న థియేటర్లలో విడుదలైంది. ఇందులో షైన్ టామ్ చాకో, మణికుట్టన్, డయానా హమీద్, తలైవాసల్ విజయ్, మొట్టై రాజేంద్రన్. ప్రధాన పాత్రల్లో నటించారు. జినోష్ ఆంటోనీ సంగీతం అందించగా, అంబాట్ ఫిల్మ్స్ బ్యానర్‌పై రాబిన్స్ మాథ్యూ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం ప్రస్తుతం Manorama Max, Airtel Xstream Play లో అందుబాటులో ఉంది. ఐయండిబిలో దీనికి 6.4/10 రేటింగ్ లభించింది. ప్రస్తుతం ఇది మలయాళంలో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఐరావతక్కుజి అనే ఒక పల్లెటూరిలో మనక్కల్ తారావాడు అనే ఒక పాతకాలపు పెద్ద బంగళా ఉంటుంది. ఆ ఊరిలో అంతా బాగానే ఉన్నా, ఆ బంగళా లోపల అడుగుపెట్టిన వాళ్ళంతా వింత వింతగా చచ్చిపోతుంటారు. ఊరి జనం మాత్రం ఆ ఇంట్లో ఏదో దెయ్యం ఉందని, అది పగతో అందరినీ వేటాడుతోందని వణికిపోతుంటారు. ఆ చావుల వెనుక ఉన్న మిస్టరీ ఏంటో ఎవరికీ అర్థం కాదు. ఇక ఈ చావుల వెనుక ఉన్న గుట్టు విప్పడానికి సి.ఐ. సత్య (షైన్ టామ్ చాకో) ఆ ఊరికి వస్తాడు. ఆయన వచ్చీ రాగానే ఆ ఇంట్లోకి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో ఆరా తీస్తాడు.

అక్కడ దెయ్యం అని భయపడకుండా, ఆ చావుల వెనుక అసలు మనుషులు ఉన్నారా ? ఆ కుటుంబానికి ఉన్న పాత పగలేమైనా ఉన్నాయా ? అని అతని స్టైల్‌లో వేట మొదలుపెడతాడు. చివరికి ఆ బంగళాలో దాగి ఉన్న తరతరాల నాటి సీక్రెట్ బయటపడుతుంది. ఆ సీక్రెట్ ఏమిటి ? అక్కడ నిజంగానే దెయ్యాలు ఉన్నాయా ? సి.ఐ. సత్య ఈ కేసును ఎలా డీల్ చేస్తాడు ? అనే విషయాలను, ఈ మలయాళ హారర్ థ్రిల్లర్  సినిమాను చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also : ప్రేమించిన ప్రతి ఒక్కడికి యమపురికి టిక్కెట్టు … డిటెక్టివ్ కే మెంటలెక్కించే కేసు… ఉక్కిరి బిక్కిరి చేసే మలుపులు

Related News

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్

కొండల మధ్య అనుమానాస్పద హత్యలు… సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్

19వ శతాబ్దపు ఘాటు ప్రేమ… దారుణమైన పగ… సస్పెన్స్ అండ్ ఎమోషన్‌తో నిండిన పీరియడ్ డ్రామా

9/11 దాడి వెనుక ఉన్న షాకింగ్ నిజాలు బయట పెట్టిన మైండ్ బ్లోయింగ్ సిరీస్

3500 కోట్ల కలెక్షన్లు సాధించిన విజువల్ వండర్… జియోహాట్‌స్టార్‌లో ల్యాండ్ అయిన బిగ్గెస్ట్ సై-ఫై విజువల్ వండర్

ప్రాణాలు దక్కాలంటే పరుగెత్తాల్సిందే… ట్విస్టులతో ఊపిరాడకుండా చేస్తున్న ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×