E-Paper
Advertisement

Prabhas : ప్రభాస్ దర్శకులు అందరూ ప్రామిస్ లు చేస్తున్నారు, ఒకరిని మించి ఒకరు

Prabhas : ప్రభాస్ దర్శకులు అందరూ ప్రామిస్ లు చేస్తున్నారు, ఒకరిని మించి ఒకరు
Advertisement

Prabhas : ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే కాకుండా ఏకంగా ఇండియాలోనే నెంబర్ వన్ హీరో అంటే ప్రభాస్ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు అతని కెరియర్ లో దాదాపు 1000 కోట్లు సినిమాలు రెండు. 500 కోట్లు కలెక్షన్స్ వసూలు చేసిన సినిమా ఒకటి ఉన్నాయి. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ కంప్లీట్ గా మారిపోయింది. ఇప్పుడు ఏ సినిమా చేసినా కూడా ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ఎదురుచూసే పరిస్థితి వచ్చింది.

బాహుబలి సినిమా తర్వాత విడుదలైన మూడు సినిమాలు కూడా ఊహించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. కానీ మొదటి రోజు ఓపెనింగ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో వచ్చాయి. ఆ స్టాండర్డ్స్ ప్రభాస్ సెట్ చేయగలిగాడు. ఇకపోతే ప్రభాస్ తో సినిమా చేస్తే ఖచ్చితంగా ఫస్ట్ రోజు 100 నుంచి 150 కోట్ల వరకు వస్తుంది అని గతంలో సందీప్ రెడ్డి వంగ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.

ప్రభాస్ దర్శకుల వాగ్దానాలు 

Advertisement

ప్రభాస్ ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో బోలెడు ప్రొజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. అయితే దర్శకులు అందరూ కూడా వాళ్ళు చేసే సినిమాలు మీద మరింత కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు. అందరూ అభిమానులకి వాళ్ల ప్రామిస్ చేయడం మొదలుపెట్టారు. ప్రభాస్ తో పని చేస్తున్న ప్రతి దర్శకుడు కూడా తమ సినిమాలు గురించి ప్రామిస్లు చేస్తున్నారు.

ప్రభాస్ హీరోగా మారుతి రాజా సాబ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కూడా మంచి అంచనాలు పెంచింది. అయితే మారుతి నా కంటెంట్ ప్రతిదీ మాట్లాడుతుంది అని చెబుతూ వస్తున్నాడు.

Advertisement

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఇదివరకే సలార్ సినిమా చేశాడు ప్రభాస్. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 500 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఇప్పుడు సలార్ 2 సినిమాను సిద్ధం చేస్తున్నాడు. సలార్ టు అనే సినిమా నా కెరియర్ లో బెస్ట్ వర్క్ గా ఉండబోతుంది అని ప్రశాంత్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఇప్పుడు దానికి సీక్వెల్ గా కల్కి 2 రానున్న సంగతి తెలిసిందే. దాని గురించి కూడా నేను కల్కి 2 కోసం హార్డ్ వర్క్ చేస్తున్నాను అని నాగ అశ్విన్ ప్రామిస్ చేశారు.

సందీప్ రెడ్డి వంగ స్టేట్మెంట్ 

అయితే ఈ సినిమాలన్నీ ఒక ఎత్తు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న స్పిరిట్ సినిమా ఒక ఎత్తు. ఈ సినిమా మీద కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ ను ఏ రేంజ్ లో చూపిస్తాడు అనే క్యూరియాసిటీ చాలామందికి మొదలైంది. ఈ సినిమాకి సంబంధించి పూజ కూడా నిన్ననే జరిగింది. సందీప్ రెడ్డి వంగ నేను మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను. మీరు వెయిట్ చేసినందుకు వర్త్ కంటెంట్ ఇస్తా అని గతంలో ప్రామిస్ చేశాడు. మొత్తానికి ప్రభాస్ దర్శకులు అంతా కూడా ప్రామిస్లు చేస్తూ అభిమానుల్లో నమ్మకాన్ని పెంచుతున్నారు.

Also Read: Varanasi : వారణాసి ట్రైలర్ పై రామ్ పోతినేని రియాక్షన్

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×