E-Paper
Advertisement

Pushpa 2: 70 వ ఫిల్మ్‌‌ఫేర్ అవార్డులను రూల్ చేసిన అల్లు అర్జున్ ‘పుష్ప 2’.. ఇది ఊచకోతే..

Pushpa 2: 70 వ ఫిల్మ్‌‌ఫేర్ అవార్డులను రూల్ చేసిన అల్లు అర్జున్ ‘పుష్ప 2’.. ఇది ఊచకోతే..
Advertisement

Pushpa 2: తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన ‘పుష్ప 2: ది రూల్’ చిత్రం 70వ ఫిలింఫేర్ అవార్డుల వేడుకలో రికార్డు స్థాయిలో ఐదు పురస్కారాలను సొంతం చేసుకుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటన, సుకుమార్ దర్శకత్వ ప్రతిభకు ‘బ్లాక్ లేడీ’ దాసోహమంది.

Read also-Maa Inti Bangaram: సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్.. వచ్చేది ఎప్పుడంటే?

‘పుష్ప 2’ గెలుచుకున్న ఆ 5 అవార్డులు ఇవే

Advertisement

ఉత్తమ చిత్రం: ఏడాదిలోనే అత్యుత్తమ చిత్రంగా ‘పుష్ప 2: ది రూల్’ నిలిచింది. (మైత్రీ మూవీ మేకర్స్)

ఉత్తమ దర్శకుడు: తన అద్భుతమైన మేకింగ్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన సుకుమార్ ఈ అవార్డును అందుకున్నారు.

Advertisement

ఉత్తమ నటుడు: ‘పుష్పరాజ్’ పాత్రలో పరకాయ ప్రవేశం చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా నిలిచారు.

ఉత్తమ సంగీత ఆల్బమ్: చార్ట్‌బస్టర్ సాంగ్స్‌తో అలరించిన రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (DSP) కు ఈ అవార్డు దక్కింది.

ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: అద్భుతమైన సెట్స్ రూపొందించిన రామకృష్ణ మరియు మోనిక ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

Read also-Dhuroxic Debate: యష్ ‘టాక్సిక్’పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రామ్ గోపాల్ వర్మ.. ఇది మామూలు ర్యాగింగ్ కాదు..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హ్యాట్రిక్?

గతంలో ‘పుష్ప: ది రైజ్’ చిత్రానికి గాను నేషనల్ అవార్డ్ మరియు ఫిలింఫేర్ అందుకున్న అల్లు అర్జున్, ఇప్పుడు పార్ట్-2 తో కూడా అదే మ్యాజిక్‌ను రిపీట్ చేశారు. వరుసగా రెండోసారి కూడా పుష్పరాజ్ పాత్రకు ఉత్తమ నటుడిగా అవార్డు అందుకోవడం విశేషం. ఈ వేడుకలో ‘పుష్ప 2’ తో పాటు ‘కల్కి 2898 AD’, ‘లక్కీ భాస్కర్’, మరియు ‘హను-మాన్’ చిత్రాలు కూడా వివిధ విభాగాల్లో అవార్డులను గెలుచుకున్నాయి. అయితే, మేజర్ కేటగిరీలన్నీ ‘పుష్ప 2’ ఖాతాలోకే వెళ్లడం గమనార్హం.

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×