E-Paper
Advertisement

Hyundai-Kia Hybrid Launches: కియా సెల్టోస్ To హ్యుందాయ్ క్రెటా.. 2027లో లాంచ్ కాబోతున్న క్రేజీ హైబ్రిడ్ కార్లు ఇవే!

Hyundai-Kia Hybrid Launches: కియా సెల్టోస్ To హ్యుందాయ్ క్రెటా.. 2027లో లాంచ్ కాబోతున్న క్రేజీ హైబ్రిడ్ కార్లు ఇవే!
Advertisement

Hyundai-Kia Hybrid Launches For India: హ్యుందాయ్, కియా గత కొంతకాలంగా క్రేజీ ఈవీలను లాంచ్ చేశాయి. ప్రస్తుతం ఈ రెండు కంపెనీలు ఎలక్ట్రిక్ వెహికిల్ పోర్ట్‌ ఫోలియోను హైబ్రిడ్ మోడళ్లకు విస్తరించాలని భావిస్తున్నాయి.  అందులో భాగంగానే రెండు కంపెనీలు వచ్చే ఏడాదిలో ఏకంగా నాలుగు హైబ్రిడ్ మోడళ్లను లాంచ్ చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే ఈ కార్లకు సంబంధించిన పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇంతకీ ఆ కార్లు ఏవి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ కియా కార్నివాల్ పెట్రోల్ హైబ్రిడ్

కియా భారత్ లో హైబ్రిడ్‌ లోకి అడుగుపెట్టిన హ్యుందాయ్ మోటార్ గ్రూప్ మొదటి బ్రాండ్ అవుతుంది. ఇది కార్నివాల్ తో ప్రారంభం కానుంది. ఈ సంవత్సరం భారత్ లో కార్నివాల్ హైబ్రిడ్‌ను ప్రారంభించాలనే కియా ప్రణాళికలను ప్రత్యేకంగా వెల్లడించింది. కియా కార్నివాల్ హైబ్రిడ్ మార్కెట్లో బ్రాండ్ ఫస్ట్ మోడల్ కానుంది. 1.6 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ హైబ్రిడ్ వేరియంట్‌లో 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌ మిషన్‌ యాడ్ చేయబడనుంది. ఈ పెట్రోల్ ఇంజిన్ 180 PS పవర్, 265 Nm  టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 54 Kw ఎలక్ట్రిక్ మోటారును తీసుకురానుంది. దక్షిణ కొరియాలో ఈ సెటప్ లీటరుకు 14 కిమీ వరకు మైలేజ్ అందిస్తుంది. కియా అక్టోబర్‌లో ఇండియన్ మార్కెట్ లోకి కార్నివాల్ హైబ్రిడ్‌ను విడుదల చేసే అవకాశం ఉంది.

⦿ కియా MQ4i

Advertisement

MQ4i అనేది కియా నాల్గవ తరం సోరెంటో నుంచి భారత్ కోసం ప్రత్యేకంగా స్వీకరించబడిన కొత్త మూడు-వరుసల SUV.  పోటీ ధరకు ఈ మోడల్‌ను స్థానికంగా తయారు చేయాలని కంపెనీ యోచిస్తోంది. దీనిని హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో అందిస్తుంది.  కియా సోరెంటో హైబ్రిడ్‌లో కార్నివాల్ హైబ్రిడ్ లా అదే 1.6-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగిస్తుంది. 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. కియా MQ4i 2027 ఫస్ట్ క్వార్టర్ లో విడుదల కానుంది.

⦿ కియా సెల్టోస్ హైబ్రిడ్

కియా సెల్టోస్ హైబ్రిడ్ MQ4i మోడల్ తర్వాత ప్రారంభించబడే అవకాశం ఉంది. 2027 సెకెండ్ క్వార్టర్ లో లాంచ్ కానుంది. దక్షిణ కొరియాలో కియా 1.6-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటారు కలయికను ఉపయోగిస్తుంది.  భారత్ లో కియా MQ4i లా 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్-ఆధారిత హైబ్రిడ్ వ్యవస్థను ఉపయోగించే అవకాశం ఉంది.

⦿ హ్యుందాయ్ క్రెటా హైబ్రిడ్

Advertisement

2027 మిడ్ ఇయర్ లో హ్యుందాయ్ క్రెటా దాని థర్డ్ జెనరేషన్ కు మారే అవకాశం ఉంది. దీనికి హైబ్రిడ్ వేరియంట్ జోడించబడుతుంది. మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా హైబ్రిడ్ పైన భారత్ లో తయారు చేసిన కియాస్ మాదిరి పవర్‌ ట్రెయిన్‌తో రావాలి. హ్యుందాయ్ క్రేటర్ కాన్సెప్ట్ నుంచి ప్రేరణ పొందిన హ్యుందాయ్ క్రెటా హైబ్రిడ్, కియా సెల్టోస్ హైబ్రిడ్ కంటే కొంచెం సరసమైనది కావచ్చు. దీని ధర బేస్ ట్రిమ్‌లో దాదాపు రూ. 17.20 లక్షలు ఉంటుందని భావిస్తున్నారు.

Read Also: ప్యూయల్ ట్యాంక్ కొన్నికార్లకు రైట్ సైడ్, మరికొన్ని కార్లకు లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ఎందుకో తెలుసా?

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×