E-Paper
Advertisement

1 Star vs 5 Star AC: ఏసీ కొంటున్నారా? 1-స్టార్, 5-స్టార్ రేటింగుల్లో తేడా తెలియకపోతే బుక్కైపోతారు!

1 Star vs 5 Star AC: ఏసీ కొంటున్నారా? 1-స్టార్, 5-స్టార్ రేటింగుల్లో తేడా తెలియకపోతే బుక్కైపోతారు!
Advertisement

1 Star vs 5 Star AC: ప్రస్తుతం చాలామంది వేసవి మొదట్లోనే ఏసీలు కొనుగోలు చేస్తే తక్కువ ధరకే వచ్చేస్తుందని ఆలోచిస్తుంటారు. ఈ ఆలోచన విధానం మంచిదే కానీ, ఏసీ కొనుగోలు చేసే ముందు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా ఉన్నాయి. లేదంటే రోజంతా ఏసీ రన్ అవ్వడంతో వచ్చే కరెంటు బిల్లును చూసి షాకవ్వడం మీ వంతు అవుతుంది.

సాధారణంగా ఏసీ కొనాలని షోరూమ్‌కి వెళ్లగానే ఏం ఆలోచిస్తారంటే.. 1-స్టార్ ఏసీ అయితే తక్కువకే వచ్చేస్తుంది. అదే 5-స్టార్ ఏసీ కొనాలంటే ఎక్కువ డబ్బులు పెట్టాల్సి వస్తుందని. ఇక్కడే కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. అసలు ఈ స్టార్ల వల్ల మనకు వచ్చే లాభం ఏంటి? ఏది కొంటే మన జేబుకు తక్కువ భారం పడుతుంది అనే లాజిక్స్ ముందు తెలుసుకోవాలి.

స్టార్ రేటింగ్ అంటే?

Advertisement

మన దేశంలో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ(BEE) అనే సంస్థ ఏసీల పనితీరును బట్టి వాటికి రేటింగ్ ఇస్తుంది. దీనినే మనం స్టార్ రేటింగ్ అంటాం. ముఖ్యంగా ISEER అనే విలువ ఆధారంగా ఈ రేటింగ్ ఇస్తారు. సింపుల్‌గా చెప్పాలంటే.. ఏసీ ఎంత తక్కువ కరెంట్ వాడుకుని ఎంత ఎక్కువ చల్లదనాన్ని ఇస్తుందనేదే ఈ స్టార్ల లెక్క. స్టార్ రేటింగ్ ఎంత ఎక్కువగా ఉంటే, ఆ ఏసీ అంత తక్కువ విద్యుత్తును వాడుకుంటుంది.

Also Read: నిద్రలోనే ప్రాణాలు తీస్తున్న ఏసీలు.. మీ ఫ్యామిలీ సేఫ్‌గా ఉండాలంటే ఈ మార్పులు చేసుకోండి!

కరెంట్ బిల్లులో వచ్చే తేడాలివే: 

Advertisement

చాలామంది ఏసీ కొనేటప్పుడు దాని ధర చూస్తారు కానీ, నెలనెలా వచ్చే కరెంట్ బిల్లు గురించి ఆలోచించరు. 1-స్టార్ ఏసీ తక్కువ ధరకే దొరికినా, అది కరెంట్‌ను ఎక్కువగా లాగేస్తుంది. అదే 5-స్టార్ ఏసీ విషయానికి వస్తే.. అది 1-స్టార్ ఏసీ కంటే దాదాపు 25 నుండి 40 శాతం వరకు తక్కువ విద్యుత్తును వాడుకుంటుంది. ఒకవేళ మీరు రోజుకు 8 గంటలు ఏసీ వాడితే, 1-స్టార్ ఏసీ వల్ల నెలకు రూ.3000 బిల్లు వస్తే, అదే పనితీరు ఉన్న 5-స్టార్ ఏసీ వల్ల బిల్లు కేవలం రూ.1800 నుండి రూ.2000 మధ్యలో వచ్చే అవకాశం ఉంటుంది. అంటే.. నెలకు దాదాపు రూ.వెయ్యి వరకు ఆదా చేసినట్లే.

ఏది ఎప్పుడు కొంటే బెటర్?

మీరు ఏసీని ఎంత సమయం వాడుతారనే దానిపైనే మీ నిర్ణయం ఆధారపడి ఉండాలి. ఒకవేళ మీరు ఏసీని రోజుకు 5 నుంచి 6 గంటల కంటే ఎక్కువ సేపు వాడుతూ, రాబోయే ఐదేళ్ల వరకు దాన్ని వాడాలనుకుంటే కళ్లు మూసుకుని 5-స్టార్ ఏసీ తీసుకోవడమే మంచిది. కొనేటప్పుడు రూ.10వేల నుండి రూ.15వేలు అదనంగా ఖర్చయినా, కరెంట్ బిల్లుల రూపంలో ఆ డబ్బును మీరు రెండు మూడేళ్లలోనే వెనక్కి పొందుతారు. ఒకవేళ మీ బడ్జెట్ చాలా తక్కువగా ఉండి, ఏసీని అప్పుడప్పుడు మాత్రమే వాడుతారనుకుంటే.. 1-స్టార్ లేదా 3-స్టార్ ఏసీ కొనొచ్చు.

ISEER వాల్యూ ముఖ్యం:

అయితే, ప్రస్తుతం మార్కెట్‌లో 5-స్టార్ ఏసీలు చాలా అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో అందుబాటులో ఉన్నాయి. ఇవి కేవలం కరెంట్‌ను ఆదా చేయడమే కాకుండా, పర్యావరణానికి కూడా మేలు చేస్తాయి. కాబట్టి.. దీర్ఘకాలికంగా లాభం పొందాలంటే 5-స్టార్ ఏసీను ఎంచుకోవడం ఉత్తమం. మీకు నచ్చిన బ్రాండ్‌ను కొనే ముందు ఏసీ మీద ఉండే స్టిక్కర్‌పై ISEER వాల్యూ ఎంత ఉందో చెక్ చేయడం మర్చిపోవద్దు.

Also Read: సమ్మర్ వచ్చేసింది.. ఏసీని ఆన్ చేసే ముందు ఈ 4 పనులు తప్పక చేయండి!

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×