E-Paper
Advertisement

‘నేనొక మద్రాసీ మిడిల్ క్లాస్’.. భార్యకు నమ్మకంగా ఉండటంపై మాధవన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

‘నేనొక మద్రాసీ మిడిల్ క్లాస్’.. భార్యకు నమ్మకంగా ఉండటంపై మాధవన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Advertisement

R Madhavan Marriage: సినీ పరిశ్రమలో ఎంతోమంది అందమైన నటీమణులతో కలిసి నటిస్తున్నప్పటికీ, వ్యక్తిగత జీవితంలో ఎలాంటి వివాదాలకు తావులేకుండా ఆదర్శవంతమైన బంధాన్ని కొనసాగిస్తున్న అతికొద్ది మంది హీరోలలో ఆర్‌. మాధవన్ (R. Madhavan) ఒకరు. ఇటీవలే ఆయన తన భార్య సరితతో కలిసి 27వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో, గ్లామర్ ప్రపంచంలో ఉంటూ కూడా తన భార్యకు మాత్రమే నమ్మకంగా ఉండటం వెనుక ఉన్న రహస్యాన్ని ఒక పాత ఇంటర్వ్యూలో మాధవన్ పంచుకున్నారు. ఆ విశేషాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

భార్య సరిత నా అదృష్టం

Advertisement

తన ఎదుగుదలలో భార్య సరిత పాత్రను కొనియాడుతూ మాధవన్ ఇలా అన్నారు, “నా జీవితంలో సరిత ఉండటం నా అదృష్టం. తను నన్ను పూర్తిగా అర్థం చేసుకుంటుంది, ఎప్పుడూ ఒదిగి ఉండేలా చూస్తుంది. నా కొడుకు, నా తల్లిదండ్రులు, ఇంకా నా ఆర్థిక విషయాలన్నింటినీ తనే చూసుకుంటుంది. నేను ఒక నటుడిగా రాణించడానికి తను నాకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది. నా కోపతాపాలను, తప్పులను తను భరిస్తుంది. నేను బాగా నటిస్తున్నానా లేదా అనేది మొహమాటం లేకుండా ముఖం మీదే చెప్పేస్తుంది.”

“ఆకర్షణలు ఉన్నా.. నేనొక మిడిల్ క్లాస్ వాడిని”

Advertisement

సినిమా ఇండస్ట్రీలో వివాహేతర సంబంధాల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు. మరి వీటన్నింటికీ దూరంగా ఎలా ఉండగలిగారు అని అడిగినప్పుడు మాధవన్ తన శైలిలో సమాధానమిచ్చారు. “నాకు భార్యకు నమ్మకంగా ఉండటం అనేది చాలా సహజంగా వచ్చింది. అది మా కుటుంబం నుండి వచ్చిన అలవాటు. మా కుటుంబం చివరి వరకు జంషెడ్‌జీ టాటాకు ఎంత నమ్మకంగా ఉండేదంటే.. మా ఇంట్లో దేవుడి పటాలతో పాటు ఆయన ఫోటోకు కూడా పూలమాల వేసి పూజించేవాళ్ళం. కాబట్టి నేను నమ్మకంగా ఉండకపోవడానికి ప్రత్యేకంగా కష్టపడాలి.”

మిడిల్ క్లాస్ మెంటాలిటీ: “ఇండస్ట్రీలో ఎంతోమంది అందమైన అమ్మాయిలు ఉంటారు, నేను కూడా అందాన్ని ఆరాధిస్తాను. కానీ, చివరికి నేనొక ‘దర్పొక్ (భయస్తుడైన) మద్రాసీ మిడిల్ క్లాస్’ మనిషిని. ఎంతమంది అందమైన అమ్మాయిలు నన్ను ఆకర్షించినా.. నేను ఇంటికి వెళ్లకుండా ఉండటానికి ఏవేవో సాకులు వెతుక్కోవడం కంటే, హాయిగా ఇంటికి వెళ్లి నా భార్యను కౌగిలించుకోవడానికే ఇష్టపడతాను.”

బంధాన్ని పరీక్షించవద్దు

మాధవన్ తన కెరీర్ మొదట్లో ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఇచ్చిన ఒక సలహాను ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పారు. మణిరత్నం ఆయనతో, “ఒక బంధం సజావుగా సాగుతున్నప్పుడు, అవతలి వ్యక్తి నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసుకోవడానికి పదే పదే పరీక్షలు పెట్టకు. దాన్ని అలాగే వదిలేయ్. కొన్నిసార్లు బంధాన్ని పరీక్షించడమే ఆ బంధం పాడవడానికి కారణమవుతుంది” అని చెప్పారు. మాధవన్, సరితలకు జూన్ 6, 1999న వివాహం జరిగింది. వీరికి వేదాంత్ మాధవన్ అనే కుమారుడు ఉన్నాడు. సినీ పరిశ్రమలో అత్యంత ఆదర్శవంతమైన, అందమైన జంటలలో వీరు ఒకరిగా నిలిచారు.

Related News

పూరీ జగన్నాథ్ దారుణంగా మోసపోయాడు.. నిజాలు బయటపెట్టిన రఘు కుంచె!

పూరీ జగన్నాథ్ ఇంట తీవ్ర విషాదం.. ఎమోషనల్ పోస్ట్ పెట్టిన పవిత్ర!

మెగా ఫ్యాన్స్ కి షాక్.. రామ్ చరణ్ కు సర్జరీ..?

పెళ్లయిన 12 ఏళ్ల తర్వాత తల్లైన అయిన ‘శీను వాసంతి లక్ష్మీ’ బ్యూటీ!

పదహారేళ్లకే టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్.. అప్పుడే షూటింగ్ పూర్తి!

బన్నీ, రామ్ చరణ్, నా తర్వాత ఆ అదృష్టం అందుకున్న ఏకైక హీరో అతనే.. మహేష్ బాబు స్పెషల్ వీడియో!

Chiranjeevi: గబ్బర్ సింగ్ రమేష్ కుటుంబానికి అండగా మెగాస్టార్!

చిట్టి నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..? సినిమా కన్నా ఎక్కువే..

Big Stories

Advertisement
×