E-Paper
Advertisement

ఎమర్జెన్సీ ల్యాండింగ్.. పేలిపోయిన విమానం

ఎమర్జెన్సీ ల్యాండింగ్.. పేలిపోయిన విమానం
Advertisement

Jet Crash: కరీబియన్ దేశమైన డొమినికన్ రిపబ్లిక్‌లో ఒక ఘోర విమాన ప్రమాదం జరిగింది. లా రోమనా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో రన్‌వేపై అత్యవసరంగా ల్యాండ్ అవ్వడానికి ప్రయత్నించిన ఒక ప్రైవేట్ జెట్ విమానం ఒక్కసారిగా క్రాష్ అయింది. ల్యాండింగ్ సమయంలో రన్‌వేని తాకిన వెంటనే ఆ విమానం భారీ శబ్దంతో పేలిపోయింది. క్షణాల్లోనే మంటలు విమానాన్ని పూర్తిగా చుట్టేయడంతో అక్కడున్న వారంతా భయాందోళనలకు గురయ్యారు.

ఈ ప్రమాదంలో విమానాన్ని నడుపుతున్న పైలట్, కో-పైలట్ ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సాంకేతిక లోపం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. విమానం రన్‌వేపై ల్యాండ్ అవుతూ పేలిపోయిన భయానక దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఈ ఫ్లైట్ క్రాష్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనతో ఎయిర్‌పోర్టులో కాసేపు కలకలం రేగింది. అధికారులు ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Also Read: బీఆర్ఎస్​ నేత ఇంట్లో భారీ చోరీ.. కోటిన్నరతో ఉడాయించిన దొంగలు!

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×