E-Paper
Advertisement

Raakaasaa: నిహారిక రెండో సినిమా టైటిల్ .. రిలీజ్ డేట్ ప్రకటన!

Raakaasaa: నిహారిక రెండో సినిమా టైటిల్ .. రిలీజ్ డేట్ ప్రకటన!
Advertisement

Raakaasaa: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఈ కాంపౌండ్ నుంచి ఎంతోమంది హీరోలుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు. అలాగే మెగా డాటర్స్ సైతం ఇండస్ట్రీలో నిర్మాతలుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నాగబాబు కుమార్తె నిహారిక(Niharika) యాంకర్ గా నటిగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తుతం నిర్మాతగా కూడా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ స్థాపించిన నిహారిక తన మొదటి సినిమాగా కమిటీ కుర్రోళ్ళు సినిమాని నిర్మించి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు.

ఫాంటసీ కామెడీ నేపథ్యంలో..

ఈ సినిమాకు మంచి ఆదరణ లభించడమే కాకుండా ఎన్నో పురస్కారాలు కూడా వచ్చాయి. కమిటీ కుర్రోలు సినిమా మంచి సక్సెస్ కావడంతో నిహారిక తన నిర్మాణ సంస్థ నుంచి రెండో సినిమాని కూడా ప్రకటించారు .ప్రముఖ నటుడు సంతోష్ శోభన్ (Santosh Sobhan)హీరోగా మానస శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఒక ఫాంటసీ కామెడీ సినిమాకు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నయాన్ సరిక సందడి చేయబోతున్నారు. ఇక ఈ సినిమా దాదాపు షూటింగ్ పనులను పూర్తి చేసుకున్నారని తెలుస్తోంది .ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ తో పాటు విడుదల తేదీకి సంబంధించిన అప్డేట్ విడుదల చేశారు.

‘ రాకాస’ గా నిహారిక కొత్త సినిమా..

Advertisement

ఈ సినిమాకు “రాకాస” (Raakaasa)అనే టైటిల్ పెట్టినట్లు తెలియజేశారు. అదే విధంగా ఈ సినిమా ఏప్రిల్ 3, 2026న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలియజేశారు. ఇక ఈ సినిమాకు కాస్త విభిన్నమైన టైటిల్ పెట్టారనే చెప్పాలి ..ఈ టైటిల్ సినిమా పట్ల మంచి ఆసక్తిని కలిగిస్తుంది. మొదటి సినిమాతో ఒక మంచి సక్సెస్ అందుకున్న నిహారిక తదుపరి సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది. ఇలా నిహారిక తన సినిమాకు సంబంధించిన అప్డేట్ వెల్లడించడంతో అభిమానులు కూడా ఈమెకు ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ కామెంట్లు చేస్తున్నారు.

?igsh=dnlwZW1qYmtubzdy

Advertisement

ఇక సంతోష్ శోభన్ ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతులు సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఫాంటసీ సినిమాగా రాకాస ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ అందుకున్న నిహారిక రెండో సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకోబోతున్నారో వేచి చూడాలి. ఇలా మెగా కాంపౌండ్ నుంచి నిహారిక ఇండస్ట్రీలో నిర్మాతగా సక్సెస్ అందుకున్నారు మరియు మెగా డాటర్ సుస్మిత కొణిదెల కూడా చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరి ఈమె తన మొదటి సినిమాతో ఎలాంటి హిట్ కొట్టబోతున్నారో తెలియాల్సి ఉంది. ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 12వ తేదీ విడుదల కానుంది.

Also Read: Parasakthi Censor Cuts: పరాశక్తికి సెన్సార్ కష్టాలు..ఏకంగా 23 కోతలు.. విడుదల కష్టమేనా?

Related News

నేపాల్ విధ్వంసం.. రంగంలోకి సోనూసూద్.. ప్రజలకు విజ్ఞప్తి!

శ్రీకృష్ణదేవరాయలుగా కిచ్చా సుదీప్.. ఆకట్టుకుంటున్న ‘దేవరాయ’ టైటిల్ గ్లింప్స్ అండ్ ఫస్ట్ లుక్!

78వ ఎమ్మీ అవార్డ్స్ తుది జాబితా.. అత్యధిక నామినేషన్స్ అందుకున్న షోలు!

హాస్పిటల్ పాలైన మమితా బైజు.. వీడియో వైరల్!

హరికృష్ణ 70వ జయంతి..ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్!

ఐదుసార్లు చావును దగ్గరగా చూశాను.. అదే నాకు ఇంపార్టెంట్.. హీరో కామెంట్స్..

“ప్రజలు మెచ్చిన నాయకుడు”.. పవన్ కళ్యాణ్ కు చిరంజీవి స్పెషల్ బర్త్‌డే విషెస్!

Poojitha Ponnada : గార్జీయస్ లుక్ లో మెరిసిపోతున్న పూజిత.. కుర్రాళ్ళు ఏమైపోతారమ్మా..!

Big Stories

Advertisement
×