E-Paper
Advertisement

Sheep blood mafia: గొర్రె, మేకల రక్తాన్ని తీసి.. ఆ మాఫియా గుట్టురట్టు

Sheep blood mafia: గొర్రె, మేకల రక్తాన్ని తీసి.. ఆ మాఫియా గుట్టురట్టు
Advertisement

Sheep blood mafia: తెలంగాణలో నగరంలోని గొర్రె, మేకల రక్తం మాఫియా వ్యవహారం తీవ్ర కలకలం సృష్టించింది. మేడ్చల్ జిల్లా కీసరలో బతికున్న గొర్రెలు, మేకల నుంచి రక్తాన్ని సేకరించి అక్రమంగా వ్యాపారం చేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. పక్కా సమాచారంతో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేసి.. 180 రక్తం ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రధానంగా ఒక నకిలీ వెటర్నరీ డాక్టర్, మటన్ షాపు యజమాని కలిసి ఈ దందా నడిపిస్తున్నట్లు తేలింది. అంతేకాదు..కాచిగూడాలోని సీఎన్‌కే ఇంపోర్ట్ ఎక్స్‌పోర్టు కంపెనీపై దాడులు చేసి1000 లీటర్ల రక్తాన్ని సంబంధించిన ప్యాకెట్లను డ్రగ్ కంట్రోల్ అధికారులు సీజ్‌ చేశారు.

ఫార్మా కంపెనీలు సీరం తయారీ కోసం జంతువుల రక్తాన్ని వాడుతుంటాయి. వివిధ రకాల మెడిసిన్స్, వ్యాక్సిన్లు, డయాగ్నోస్టిక్ కిట్స్ తయారీలో.. రక్తం నుండి వేరు చేసిన సీరంను ఉపయోగిస్తాయి. మెడికల్ రంగంలో, ముఖ్యంగా మైక్రోబయాలజీ విభాగంలో గొర్రె రక్తం ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తుందంటున్నారు నిపుణులు. దీనిని ముఖ్యంగా బ్లడ్ అగర్ టెస్ట్ అనే ప్రత్యేక పరీక్షలో గొర్రె రక్తాన్ని ఉపయోగిస్తారు. ఈ పరీక్ష ద్వారా మనిషి శరీరంలోకి ప్రవేశించిన బ్యాక్టీరియా ఎలాంటి ప్రభావం చూపుతోందో, రక్తకణాలను ఎలా దెబ్బతీస్తుందో పరిశీలిస్తారు. దాని ఆధారంగా ఏ యాంటీబయాటిక్ మందు సరైనదో వైద్యులు నిర్ణయిస్తారు.అదేవిధంగా పాము కాటు చికిత్సలో ఉపయోగించే యాంటీవెనమ్ తయారీలో కూడా గొర్రె రక్తానికి ప్రత్యేక స్థానం ఉంది.ఈ ఔషధం వేలాది పాము కాటు బాధితుల ప్రాణాలను కాపాడుతోంది అని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

ఔషధాల తయారీ కోసం గొర్రెలు, మేకల నుంచి రక్తాన్ని సేకరించే ప్రక్రియలో.. ఖచ్చితమైన నిబంధనలు పాటించాలని హెచ్చరిస్తున్నారు వెటర్నరీ డిపార్ట్‌మెంట్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ హకీమ్. మూగజీవాల నుంచి ఇష్టానుసారంగా రక్తం తీయడం నేరమని తెలిపారు. దీనికి సంబంధించి 2009 యానిమల్ వెల్ఫేర్ యాక్ట్ గైడ్‌లైన్స్ తప్పనిసరిగా పాటించాలని అన్నారు. ట్రెయిన్డ్, ప్రొఫెషనల్ వెటర్నరీ డాక్టర్ సమక్షంలోనే రక్తం సేకరించాలని అంటున్నారు. యానిమల్ బాడీలో ఉన్న మొత్తం బ్లడ్‌లో 10శాతం మాత్రమే కలెక్ట్ చేయాలన్నారు. ఒక సారి రక్తం సేకరించిన తర్వాత మళ్లీ కలెక్ట్ చేయాలంటే.. 15 రోజుల గ్యాప్ ఉండాలని చెబుతున్నారు.

ALSO READ:  గోదావరి గడ్డపై పౌరుషాల జాతర.. కోడిపందాల బరిలో ‘కోటి’ రూపాయల పోరు!

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×