E-Paper
Advertisement

Raashii Khanna: పొట్టి దుస్తుల పై రాశీ కన్నా కామెంట్స్.. డైరెక్టర్ ముందే చెప్పాడంటూ!

Raashii Khanna: పొట్టి దుస్తుల పై రాశీ కన్నా కామెంట్స్.. డైరెక్టర్ ముందే చెప్పాడంటూ!
Advertisement

Raashii Khanna: రాశిఖన్నా ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh) సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఉగాది పండుగను పురస్కరించుకొని మార్చి 19వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈమె వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా రాసి కన్నాకు మహిళల వస్త్రధారణ గురించి అలాగే పొట్టి దుస్తులు ధరించడం గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. నిజానికి ఉస్తాద్ సినిమాలో రాశి కన్నా కూడా చాలా పొట్టి పొట్టి దుస్తులు ధరిస్తూ గ్లామరస్ పాత్రలో కనిపించబోతున్నారు.

గ్లామర్ గా కనిపించాలని చెప్పారు..

ఈ నేపథ్యంలోనే పొట్టి దుస్తులు ధరించడం గురించి ప్రశ్నలు ఎదురవడంతో ఈమె తనదైన సైలిలోనే సమాధానం చెప్పారు. ఈ సినిమాలో పొట్టి దుస్తులు ధరించడానికి కారణం డైరెక్టర్ హరీష్ శంకర్ అని తెలిపారు. ఆయన నాకు కథ చెప్పడానికంటే ముందుగానే ఈ సినిమాలో కొద్దిగా గ్లామర్ గా కనిపించాల్సి ఉంటుందని చెప్పారు. ఆయన మీద నమ్మకంతో తాను కూడా ఈ సినిమా కథకు కమిట్ అయ్యానని రాశిఖన్నా తెలిపారు. అదేవిధంగా ఇటీవల కాలంలో మహిళల వస్త్రధారణ గురించి వస్తున్నటువంటి విమర్శల పట్ల కూడా ఈమె స్పందించారు.

ఏ బట్టలు వేసుకోవాలో వాళ్ళ ఇష్టం..

Advertisement

గత కొంతకాలంగా మహిళల వస్త్రధారణ గురించి సినిమా ఇండస్ట్రీలో పెద్ద డిబేట్ నడుస్తుందని చెప్పాలి . ఇక ఈ విషయం గురించి రాశిఖన్నా కూడా మాట్లాడుతూ తన అభిప్రాయాన్ని తెలిపారు. ఒక అమ్మాయి ఏ బట్టలు వేసుకోవాలనేది పూర్తిగా తన సొంత నిర్ణయం అని తెలిపారు. తనకు ఏ దుస్తులు అయితే సౌకర్యవంతంగా ఉంటాయో అలాంటి వాటిని వేసుకోవడానికి ఇష్టపడతారు. మోడ్రన్ దుస్తులలో కనిపించాలా లేకపోతే సాంప్రదాయం దుస్తులలో కనిపించాలా అనేది పూర్తిగా తన నిర్ణయం పైన ఆధారపడి ఉంటుందని, దీనికి సంబంధం లేని వ్యక్తులు ఎందుకు అభ్యంతరాలు చెబుతున్నారో అర్థం కాలేదంటూ రాశి కన్నా మహిళల వస్త్రధారణ పై విమర్శలు కురిపిస్తున్న వారికి తనదైన స్టైల్ లోనే కౌంటర్ ఇచ్చారు.

పండుగ బరిలో పవన్ కళ్యాణ్..

Advertisement

ప్రస్తుతం రాశి ఖన్నా చేసిన ఈ వ్యాఖ్యలపై పలువురు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. గత కొంతకాలంగా మహిళల వస్త్రధారణ గురించి ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు స్పందిస్తూ వారి అభిప్రాయాలను తెలియజేశారు. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో ఈమె హీరోయిన్ గా ప్రధాన పాత్రలో కాకపోయినప్పటికీ కీలకపాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ జోడిగా శ్రీ లీల నటిస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. మరి ఉగాది సందర్భంగా ఈ చిత్రం ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని ఇవ్వబోతుందో తెలియాల్సి ఉంది.

Also Read: Allu Arjun: అల్లు అర్జున్ 42 నిబంధనలు నిజమేనా…హాట్ టాపిక్ గా మారిన వీడియో!  

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×