E-Paper
Advertisement

Allu Arjun: అల్లు అర్జున్ 42 నిబంధనలు నిజమేనా…హాట్ టాపిక్ గా మారిన వీడియో!  

Allu Arjun: అల్లు అర్జున్ 42 నిబంధనలు నిజమేనా…హాట్ టాపిక్ గా మారిన వీడియో!  
Advertisement

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇలా నటుడిగా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్న అల్లు అర్జున్ కి సంబంధించి ఇటీవల ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో బ్రాండ్ స్ట్రాటజిస్ట్ కావేరీ బారువా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అల్లు అర్జున్ ను కలవాలి అంటే 42 నిబంధనలను పాటించాలి అంటూ ఈమె చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపాయి.

అల్లు అర్జున్ 42 నిబంధనలు నిజమేనా..

ఇక ఈ విషయం పై టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి ఇక ఈ విషయం కాస్త వివాదంగా మారడంతో చివరికి కావేరి క్షమాపణలు కూడా తెలియజేశారు. ఇంతటితో ఈ వివాదం ముగిసిందని భావించారు కానీ మరోసారి అల్లు అర్జున్ 42 నిబంధనలకు సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా అల్లు అర్జున్ కోకాపేటలో ఏర్పాటు చేసిన అల్లు సినిమాస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కంటి చూపుతో కంట్రోల్ లో పెట్టిన అల్లు భాయ్..

Advertisement

ఈ వీడియోలలో భాగంగా అల్లు అర్జున్ తన భార్య స్నేహ రెడ్డితో కలిసి అల్లు సినిమాస్ లో సందడి చేశారు. అయితే తన భార్యతో ఈయన కలిసి వెళ్తుండగా తన వెనకే కొంతమంది చాలా దగ్గరగా వచ్చారు అయితే ఒక్కసారిగా అల్లు అర్జున్ వెనక్కి తిరిగి చూడటంతో ఆయన వెనుక వస్తున్న వారందరూ ఆగిపోవడమే కాకుండా అల్లు అర్జున్ దంపతులకు ఏకంగా రెండు అడుగుల దూరం పాటిస్తూ లోపలికి వచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నేటిజన్ లు విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

అల్లు భాయ్ ఒక్క చూపుతోనే తన నిబంధనలను అమలలోకి తీసుకువచ్చారు అంటూ కామెంట్ లు చేస్తున్నారు. 42 రూల్స్ అబద్ధం కాదని అది నిజమేనని మరికొందరు ఈ వీడియో పై స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే అల్లు అర్జున్ 42 నిబంధనల గురించి గతంలో వార్తలు రాగా ఎంతోమంది ఇండస్ట్రీకి సంబంధించిన వారు కూడా స్పందిస్తూ అల్లు అర్జున్ అలాంటి వ్యక్తి కాదని ఆయన అందరితో చాలా స్నేహపూర్వకంగా ఉంటారని, అతనిని కలవాలి అంటే ఎలాంటి పద్ధతులు పాటించాల్సిన అవసరం లేదని చెప్పారు. అయితే ఈ వివాదం ముగిసిందనుకునేలోపు ఈ వీడియో బయటకు రావడంతో అల్లు అర్జున్ నిబంధనలు నిజమే అంటూ మరోసారి ఈ విషయంపై చర్చలు మొదలయ్యాయి. ఇక అల్లు అర్జున్ కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన అట్లీ డైరెక్షన్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.

Also Read: Biker Film: అంచనాలు పెంచుతున్న బైకర్.. తండ్రీకొడుకుల ఎమోషన్ తో!

Related News

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

‘స్పిరిట్’ వాయిదా.. ఫ్యాన్స్‌కు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా!

గరివిడి లక్ష్మి సినిమాపై రవితేజ రివ్యూ.. ఏమన్నారంటే?

ఏడేళ్ల వయసులోనే సాఫ్ట్వేర్ సంస్థకు యజమాని.. ‘జైలర్’ బుడ్డోడు చిన్నోడు కాదండోయ్!

Big Stories

Advertisement
×