E-Paper
Advertisement

Raashii Khanna: రాశీఖన్నా భక్తి పాట.. అబ్బా ఎంత చక్కగా పాడింది, వైరల్ అవుతోన్న సాంగ్

Raashii Khanna: రాశీఖన్నా భక్తి పాట.. అబ్బా ఎంత చక్కగా పాడింది, వైరల్ అవుతోన్న సాంగ్
Advertisement

Raashii Khanna:మహాశివరాత్రి సందర్భంగా ప్రముఖ హీరోయిన్ రాశీ ఖన్నా (Raashii Khanna) షేర్ చేసిన వీడియో అందరినీ ఆశ్చర్యపరచడమే కాకుండా భక్తి పారవశ్యంలో ముంచెత్తుతోంది అని చెప్పవచ్చు. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ అందరిని ఆకట్టుకునే రాశీఖన్నాలో ఉన్న ఈ టాలెంట్ ని చూసి అందరూ నివ్వెరపోతున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

అద్భుతమైన గాత్రంతో శ్రోతలను అలరించిన రాశీ ఖన్నా..

తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న రాశీ ఖన్నా ఇప్పుడు ఆధ్యాత్మిక ప్రపంచంలోకి అడుగుపెట్టారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని “శివ కైలాషోం కే వాసీ” అంటూ ఒక ప్రత్యేక గీతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆలపించి పరమేశ్వరుడికి తన వంతు స్వర నీరాజనం అర్పించారు రాశీ ఖన్నా. పైగా ఈ గీతానికి సంబంధించిన వీడియోని ఆమె తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా పోస్ట్ చేశారు కూడా.. “ఈ పవిత్రమైన రోజున అచంచలమైన విశ్వాసం.. శరణాగతి.. కృతజ్ఞతా భావంతో నేను ఆలపించిన శివ కైలాషోం కే వాసీ గీతాన్ని ఆ మహాదేవుడికి నా ప్రార్థనగా సమర్పిస్తున్నాను” అంటూ ఆమె క్యాప్షన్ గా జోడించారు. ఇక ఆమె గాత్ర మాధుర్యం అభిమానులను అటు ప్రేక్షకులను భక్తిపారవశ్యంలో ముంచెత్తింది. అలాగే ఆమెకు ఉన్న ఈ టాలెంట్ కి అభిమానులు సైతం ఫిదా అవుతున్నారు. ఏదేమైనా తన అద్భుతమైన నటనతో అందరినీ అందంతో ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ గాత్రానికి ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రాశీఖన్నా సినిమాల జాబితా..

Advertisement

రాశీఖన్నా సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో నటిస్తోంది. పవన్ కళ్యాణ్ హీరోగా, శ్రీ లీలా హీరోయిన్ గా వస్తున్న ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. మార్చిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో ఇటీవలే డబ్బింగ్ చెబుతున్నట్లు ధ్రువీకరించింది కూడా.. ఇకపోతే మరోవైపు ఈ చిత్రంతో పాటు.. ఫర్హాన్ అక్తర్, అమితాబ్ బచ్చన్ కాంబినేషన్లో వస్తున్న 120 బహదూర్ లో నటించిన ఈమె.. అనీష్ బాజ్మీ దర్శకత్వంలో అక్షయ్ కుమార్, విద్యాబాలన్ తో కలిసి ఒక ప్రాజెక్టులో నటిస్తున్నట్లు సమాచారం. అలాగే బోధయన్ రాయ్ చౌదరి దర్శకత్వంలో విక్రాంత్ మాస్సే తో కలిసి ఒక హిందీ చిత్రంలో నటిస్తోంది. ఇలా ఒకవైపు తెలుగు, తమిళ్ తో పాటు మరొకవైపు హిందీ సినిమాలలో కూడా నటిస్తూ మరింత బిజీగా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ.

ALSO READ:Vijay -Rashmika: స్వయంగా పెళ్లి ఏర్పాట్లు.. ఎయిర్పోర్టులో దర్శనమిచ్చిన విజయ్ – రష్మిక!

సక్సెస్ కోసం ఆరాటం..

Advertisement

ఇదిలా ఉండగా గత కొన్ని రోజులుగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న రాశీ ఖన్నా తన ఆశలన్నీ కూడా హరీష్ శంకర్ – పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పైనే పెట్టుకున్నారు. పైగా పవన్ కళ్యాణ్ తో తొలిసారి స్క్రీన్ పై కనిపించనున్న నేపథ్యంలో ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి రాశీ ఖన్నా కోరిక ఈ చిత్రంతో నెరవేరుతుందో లేదో చూడాలి.

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×