ఈ మధ్యకాలంలో అభిమానిని బేస్ చేసుకొని సినిమాలు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రముఖ హీరో రామ్(Ram) ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ అంటూ హీరో ఉపేంద్ర అభిమానిగా ఈ సినిమాలో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఇప్పుడు ఇదే దారిలో ఏకంగా సీనియర్ స్టార్ హీరోయిన్ అడుగులు వేసింది. బాలయ్య అభిమానిగా ఆ సినిమాలో నటించడమే కాకుండా జై బాలయ్య అనే బ్యాండ్ ను తన తలకు చుట్టుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒకప్పుడు ఆయనతో సినిమాలు చేసి బెస్ట్ ఆన్ స్క్రీన్ జోడీగా పేరు దక్కించుకున్న ఈమె..ఇప్పుడు బాలయ్య అభిమానిగా ఒక సినిమాలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఆమె ఎవరో కాదు రాధిక శరత్ కుమార్ (Radhika Sarathkumar). విలక్షణమైన నటనతో అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చి..అందరి దృష్టిని ఆకట్టుకున్న రాధికా శరత్ కుమార్ సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే
ఈ క్రమంలోనే తాజాగా ఈమె మరో తెలుగు సినిమాలో నటిస్తోంది. శ్రీ విష్ణు(Sri Vishnu) హీరోగా వస్తున్న కామ్రేడ్ కళ్యాణ్ అనే చిత్రంలో బాలయ్య అభిమానిగా రాధికా శరత్ కుమార్ కనిపించారు. జై బాలయ్య అని ఉన్న హెడ్ బాండ్స్ ని ధరించారు. ప్రస్తుతం ఆమె ఈ సినిమాలో నటిస్తున్న క్యారెక్టర్ కి సంబంధించిన లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన బాలయ్య అభిమానులు ఈ పోస్టర్ను తెగ వైరల్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం రాధిక శరత్ కుమార్ కి సంబంధించిన ఈ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కామ్రేడ్ కళ్యాణ్ సినిమా విషయానికొస్తే.. శ్రీ విష్ణు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఇది. జానకిరామ్ మారెళ్ళ దర్శకత్వంలో కోన ఫిలిం కార్పొరేషన్ , స్కంద వాహన మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. విశాఖ జిల్లా మాడుగుల ప్రాంతంలో 1992లో జరిగిన నిజ జీవిత సంఘట ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విజయదశమిని పురస్కరించుకొని చిత్రబృందం కామ్రేడ్ కళ్యాణ్ టైటిల్ టీజర్ ను విడుదల చేసింది. ఇందులో శ్రీ విష్ణు కనిపించిన తీరు సినిమాపై అంచనాలు పెంచుతోంది. ఈ ఏడాది ఎలాగైనా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్న నేపథ్యంలో ఇక ఈ సినిమాకు సంబంధించి ఇలా రోజుకొక అప్డేట్ అంచనాలు పెంచేస్తోందని చెప్పవచ్చు. మరి భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ కామ్రేడ్ కళ్యాణ్ తో సక్సెస్ కొట్టే దిశగా అడుగులు వేస్తున్నారు శ్రీ విష్ణు.
ALSO READ:Film industry: నిర్మాతలుగా మారిన సెలబ్రిటీ సిస్టర్స్.. ఎవరెవరంటే?
రాధిక శరత్ కుమార్ విషయానికి వస్తే.. నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా, రాజకీయ నాయకురాలిగా చలామణి అవుతున్న రాధికా శరత్ కుమార్ ఎక్కువగా తెలుగు , తమిళ్ భాష ఇండస్ట్రీలో సినిమాలలోనే కాదు సీరియల్స్ లో కూడా నటించి ఆకట్టుకుంది. ఇక వెబ్ సిరీస్ లలో కూడా సందడి చేస్తున్న ఈమె హిందీ , మలయాళం, కన్నడ భాషల్లో కూడా నటించింది. ఈమె తన నటనతో నేషనల్ అవార్డుతో పాటు రెండు నంది అవార్డులు, మూడు తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డులతో పాటు ఆరు సౌత్ ఫిలింఫేర్ అవార్డులు కూడా దక్కించుకుంది.
బాలయ్య అభిమానిగా💥🔥 మారిన సీనియర్ నటి
సీనియర్ నటి రాధిక నందమూరి బాలకృష్ణ అభిమానిగా అవతారమెత్తారు. ఇదేంటి సడెన్‌గా అనుకుంటున్నారా? శ్రీవిష్ణు హీరోగా తెరెక్కనున్న ‘కామ్రేడ్ కళ్యాణ్’ 💥🔥చిత్రంలో ఆమె బాలయ్య అభిమానిగా కనిపించారు‘జై బాలయ్య’🥵 అని ఉన్న హెడ్ బ్యాండ్స్‌ను ఆమె ధరించారు. pic.twitter.com/aPGIg2v0c1— NANDAMURI_EDITS (@Nandamuri_Edits) January 6, 2026