E-Paper
Advertisement

Kartika Lamp: స్టాలిన్ సర్కారుకు ఎదురుదెబ్బ..! కార్తీక దీపంపై ఇష్యూ క్లియర్..

Kartika Lamp: స్టాలిన్ సర్కారుకు ఎదురుదెబ్బ..! కార్తీక దీపంపై ఇష్యూ క్లియర్..
Advertisement

Kartika Lamp: దీపం.. భక్తికి నిదర్శనం. అలాంటి దీపం చుట్టూ.. రాజకీయ రగడ రేగింది. తమిళనాడులో మొదలైన వివాదం.. దేశం మొత్తం చర్చకు దారితీసింది. తిరుప్పరకుండ్రం కొండపై కార్తిక దీపం వెలిగించే విషయంలో.. డీఎంకే సర్కార్ లేవనెత్తిన అభ్యంతరాలను మద్రాస్ హైకోర్టు తిరస్కరించింది. అసలు.. ఓ దీపం చుట్టూ ఇంత వివాదం ఎందుకు రేగింది? కోర్టు చెప్పాక కూడా ప్రభుత్వం దేనికోసం మొండిగా.. మళ్లీ కోర్టు మెట్లెక్కింది?

తమిళనాడు డీఎంకే ప్రభుత్వానికి ఊహించని ఎదురుదెబ్బ
తమిళనాడు డీఎంకే ప్రభుత్వానికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. మదురైలోని తిరుప్పరకుండ్రం కొండపై ఉన్న దీప స్తంభంలో.. కార్తీక దీపం వెలిగించేందుకు అనుమతినిస్తూ గతంలో సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను.. మద్రాసు హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ సమర్థించింది. శాంతిభద్రతలు, కస్టమ్స్ అభ్యంతరాలను తిరస్కరించింది. ఆ స్తంభంలో.. దీపం వెలిగించొద్దని ఆగమశాస్త్రంలో ఉన్నట్లుగా.. పిటిషనర్లు బలమైన ఆధారాలు చూపించలేకపోయారని డివిజన్‌ బెంచ్‌ తెలిపింది. దీపం విషయంలో తమిళనాడు ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలను ధర్మాసనం తిరస్కరించింది. ఏడాదిలో ఒక్కరోజు.. ఆ స్తంభంలో దీపం వెలిగిస్తే శాంతిభద్రతలకు ఆటంకం కలుగుతుందని.. స్టాలిన్ సర్కార్ చెప్పడం హాస్యాస్పదమని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని అనవసరంగా రాజకీయం చేశారంటూ.. కోర్టు అభిప్రాయపడింది. అంతేకాదు.. ఆ దీపస్తంభం సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి చెందిదేనని న్యాయస్థానం స్పష్టం చేసింది.

Advertisement

దీపం వెలిగించుకునేందుకు డిసెంబర్ 1న కోర్టు అనుమతి
తిరుప్పరకుండ్రంలోని అరుళ్మిగు సుబ్రహ్మణ్య స్వామి ఆలయ నిర్వాహకులకు.. కొండపై ఉన్న దీప స్తంభం దగ్గర కార్తీక దీపం వెలిగించుకునేందుకు అనుమతిస్తూ.. డిసెంబర్ 1న సింగిల్ బెంచ్ ఉత్తర్వులిచ్చింది. దాంతో.. ఈ వివాదం పెద్దదైంది. కొండపై ఉన్న హజరత్ సుల్తాన్ సికందర్ దర్గాకు.. ఈ పురాతన రాతి దీప స్తంభం కేవలం 15 మీటర్ల దూరంలోనే ఉంది. దాంతో.. దీనిపై కార్తీక దీపం వెలిగించొచ్చా? లేదా? అనే అంశం చుట్టూ కాంట్రవర్శీ రేగింది. డీఎంకే ప్రభుత్వం, ఇతర పిటిషనర్లు.. ఆచారం, శాంతిభద్రతలపై ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు.. దీప స్తంభం ఉన్న స్థలంపైనా వాదనలు వినిపిస్తూ.. దీపం వెలిగించే ఆచారాన్ని వ్యతిరేకించారు. కోర్టు ఉత్తర్వులున్నా.. అక్కడ దీపం వెలిగించేందుకు తగిన ఏర్పాట్లు చేయలేదని పిటిషనల్ మళ్లీ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. దాంతో.. సీఐఎస్ఎఫ్ సిబ్బందితో వెళ్లి దీపం వెలిగించుకోవచ్చని న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. అప్పటికే ఆలయం దగ్గర సుబ్రహ్మణ్యస్వామి ఆలయ నిర్వాహకుల తరఫున కార్తీక దీపం వెలిగించారు. దర్గా సమీపంలోని రాతి స్తంభంపై దీపం వెలిగించేందుకు హిందూ నేతలతో కలిసి పిటిషనర్ ప్రయత్నించగా.. తోపులాట జరిగింది. దాంతో.. కొండపై 144 సెక్షన్ విధించారు.

సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ కోర్టుకెక్కిన ప్రభుత్వం
ఈ ఘటన తర్వాత.. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ.. ప్రభుత్వం, పోలీసులు, దర్గా ప్రతినిధులు, తమిళనాడు వక్ఫ్ బోర్డు.. డివిజన్ బెంచ్‌ని ఆశ్రయించాయి. దీపం వెలిగించాలని కోరుకునే భక్తులకు.. కోర్టు ఉత్తర్వులను అమలు చేయగలిగే చట్టపరమైన హక్కు లేదని, ఆర్టికల్ 226 అధికారాలను ఉపయోగించి చాలా కాలంగా ఉన్న ఆచారాన్ని మార్చలేమని డీఎంకే ప్రభుత్వం వాదించింది. అయితే.. ప్రభుత్వ అధికారులు, దర్గాతో సహా.. అప్పీలుదారులంతా ఆగమశాస్త్రంలో దీపం వెలిగించడంపై నిషేధం ఉందని చూపించేందుకు.. బలమైన ఆధారాలు సమర్పించడంలో విఫలమయ్యారని ధర్మాసనం తెలిపింది.

Advertisement

శాంతిభద్రతలకు విఘాతం అనేది నమ్మశక్యంగా లేదన్న కోర్టు
రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యంతరాలను ఖండించింది. కార్తీకమాసంలో ప్రత్యేకమైన రోజున దేవస్థానం ప్రతినిధులు రాతి స్తంభంపై దీపం వెలిగిస్తే.. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని చెప్పడం అంత నమ్మశక్యంగా లేదని తెలిపింది. ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకొని, అభ్యంతరం చెబితినే గందరగోళ పరిస్థితులు తలెత్తుతాయని కోర్టు అభిప్రాయపడింది. అంతేకాదు.. పొలిటికల్ ఎజెండాను ముందుకు తీసుకెళ్లడానికి.. ఏ రాష్ట్రం కూడా ఈ స్థాయికి దిగజారదని ఆశిస్తున్నట్లు స్పష్టం చేసింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను సమర్థిస్తూ.. డివిజన్ బెంచ్ కూడా తిరుప్పరకుండ్రం కొండపై ఉన్న రాతి స్తంభం దగ్గర దీపం వెలిగించుకునేందుకు రూట్ క్లియర్ చేసింది.

ఏడాదిలో ఒక్కరోజు.. తిరుప్పరకుండ్రం కొండపై ఉన్న దీపస్తంభంలో దీపం వెలిగిస్తే.. శాంతి భద్రతలకు ఆటంకం కలుగుతుందని స్టాలిన్ ప్రభుత్వం వాదించిన తీరు.. అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఒక్క దీపం వెలిగిస్తే.. ఇంత రాద్ధాంతం ఎందుకు? దీపం విషయంలో.. ఇంత డ్రామా దేనికోసం? కోర్టులు కూడా ఈ అంశాన్ని ఇంతలా సాగదీయాల్సిన అవసరముందా? ఈ ఇష్యూని అనవసరంగా రాజకీయం చేశారా?

శతాబ్దాల సంప్రదాయం ఒకవైపు.. ప్రభుత్వ నిబంధనలు మరోవైపు..
తమిళనాడులో భక్తికి, రాజకీయానికి మధ్య జరిగిన న్యాయపోరాటంలో.. చివరికి ఆచారమే గెలిచింది. శతాబ్దాల సంప్రదాయం ఒకవైపు, ప్రభుత్వ నిబంధనలు మరోవైపు నిలవడంతో.. ఈ అంశం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. తమిళనాడులోని మధురై సమీపంలో ఉన్న తిరుప్పరకుండ్రం మురుగన్ ఆలయం కొండపై.. కార్తీక దీపం వెలిగించడమనేది దశాబ్దాలుగా ఓ వివాదాస్పద అంశంగా మారింది. ఈ కొండపై ఉన్న దీప స్తంభం దగ్గర.. కార్తీక మాసంలో మహా దీపం వెలిగించడం అనేది భక్తుల సెంటిమెంట్. ఇది.. శతాబ్దాలుగా వస్తున్న ఆచారం. అందువల్ల.. భక్తులు దీనిని అత్యంత పవిత్రంగా భావిస్తారు. అయితే.. ఈ దీపం వెలిగించే విషయంలో డీఎంకే ప్రభుత్వం పెట్టిన నిబంధనలు చిచ్చు రేపాయ్.

సున్నితమైన ప్రాంతంగా తిరుప్పరకుండ్రం కొండ
తిరుప్పరకుండ్రం కొండపై కేవలం హిందూ ఆలయమే కాకుండా, సికందర్ బాదుషా దర్గా కూడా ఉండటంతో.. ఇది సున్నితమైన ప్రాంతంగా మారింది. అయితే.. శాంతిభద్రతల పేరుతో డీఎంకే ప్రభుత్వం అభ్యంతరం చెప్పడం వెనుక కొన్ని కారణాలున్నాయ్. కొండపై ఉన్న దర్గా, ఆలయానికి సంబంధించి.. సరిహద్దు వివాదాలున్నాయ్. ఓ వర్గం దీపం వెలిగించేటప్పుడు.. మరో వర్గంతో ఘర్షణలు జరిగే అవకాశం ఉందని ప్రభుత్వం వాదించింది. కొండ పైభాగం ఇరుగ్గా ఉంటుందని.. భారీగా జనం తరలివస్తే.. తోపులాటలు జరిగే ప్రమాదం ఉందని గతంలోనూ నివేదికలు ఇచ్చారు. అంతేకాదు.. కొండపై ఉన్న చారిత్రక కట్టడాలు దెబ్బతినే అవకాశం ఉందనే వాదనలు కూడా వినిపించాయి.

దీపం వెలిగించడం పురాతన సంప్రదాయమన్న హిందువులు
దీపం విషయంలో.. భక్తులు, హిందూ ధార్మిక సంఘాల వాదన స్పష్టంగా ఉంది. అరుణాచలం కొండపై మహాదీపం వెలిగించినట్లేత.. ఇక్కడ కూడా దీపం వెలిగించడం పురాతన సంప్రదాయమని చెబుతున్నారు. ఇతర మతపరమైన వేడుకలకు అనుమతులిస్తూ, హిందూ ఆచార, సంప్రదాయమైన.. దీపం వెలిగించడానికి ఇన్ని నిబంధనలు పెట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు. డీఎంకే ప్రభుత్వం.. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం, ఓ వర్గాన్ని సంతృప్తి పరచడానికే.. దీపారాధనను అడ్డుకుంటోందని విపక్షాలు ఆరోపించాయి. అయితే.. ఈ అంశం మధురై హైకోర్ట్ బంచ్ ముందుకు ఎన్నోసార్లు వచ్చింది.

స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చేందుకు ఇంతకాలం పట్టిందా?
ఈ సమస్యకు ఎప్పుడో పరిష్కారం చూపాల్సి ఉన్నా.. దానిపై స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చేందుకు ఇంతకాలం పట్టింది. ఈ విషయంలో కోర్టు తీరుపైనా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయ్. అయితే.. ఇలాంటి మతపరమైన, శాంతిభద్రతల అంశాల్లో న్యాయస్థానాలు కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తాయనే వాదన వినిపిస్తోంది. అందుకనుగుణంగానే.. సంప్రదాయాల ప్రకారం దీపం వెలిగించే హక్కు భక్తులకు ఉందని కోర్టు స్పష్టం చేసింది. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ.. నిర్దేశిత ప్రాంతంలో దీపం వెలిగించుకోవచ్చని అనుమతిస్తూ మద్రాస్ హైకోర్ట్ మధురై బెంచ్ తీర్పునిచ్చింది. కోర్టు అనుమతిచ్చినా.. డీఎంకే ప్రభుత్వం ఈ తీర్పును సవాలు చేస్తూ డివిజన్ బెంచ్‌ని ఆశ్రయించడంతో దుమారం రేగింది.

హిందూ సంప్రదాయాలపై డీఎంకే ప్రభుత్వం ఆంక్షలు!
తమిళనాడు రాజకీయాల్లో.. ద్రవిడ సిద్ధాంతం, ఆధ్యాత్మికత మధ్య ఎప్పుడూ ఓ యుద్ధం నడుస్తూనే ఉంటుంది. డీఎంకే ప్రభుత్వం.. తమకు అంతా సమానమని చెబుతూనే.. మైనారిటీ హక్కుల పరిరక్షణ పేరుతో.. హిందూ సంప్రదాయాలపై ఆంక్షలు విధిస్తుందనే ముద్రపడింది. ఇదే అదనుగా.. విపక్షాలు కూడా ఈ అంశాన్ని ఓ పొలిటికల్ అస్త్రంగా మార్చుకున్నాయ్. దీపం వెలిగించడాన్ని అడ్డుకోవడమంటే.. తమిళ సంస్కృతిని, భక్తిని అవమానించడమేనని విమర్శించాయ్. డీఎంకే ప్రభుత్వం అనుసరించే నాస్తిక, హేతువాద దృక్పథం వల్లే.. హిందూ సంప్రదాయాలను అడ్డుకుంటోందని బీజేపీ సహా ఇతర ప్రతిపక్షాలు ఆరోపించాయ్. అదే కొండపై దర్గా కూడా ఉంది. అక్కడ జరిగే కార్యక్రమాలకు లేని అభ్యంతరాలు, దీపానికి మాత్రమే ఎందుకని భక్తులు సైతం ప్రశ్నించడంతో.. ఈ ఇష్యూ స్టేట్ మొత్తం హాట్ టాపిక్‌గా మారింది. కోర్టు కూడా ఒక్కరోజు దీపం వెలిగించినంత మాత్రాన.. శాంతి భద్రతలు దెబ్బతింటాయని చెప్పడం.. హాస్యాస్పదంగా ఉందని రియాక్ట్ అయింది.

Also Read: చుక్కలు చూపిస్తున్న బంగారం ధరలు.. నేడు ఎంత పెరిగిందంటే!

తగిన భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అనే వాదన
సంప్రదాయాలను పూర్తిగా అడ్డుకోవడం కంటే.. తగిన భద్రత కల్పించి, నియమ, నిబంధనలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ప్రభుత్వ బాధ్యత అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయ్. దీపం వెలిగించడాన్ని అడ్డుకోవడం కంటే.. ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదర్చడంలో శ్రద్ధ చూపితే.. వివాదాని శాశ్వత పరిష్కారం దొరికేది కదా అంటున్నారు. ప్రభుత్వం ఈ పని ముందే చేసి ఉంటే.. ఈ అంశం కోర్టు దాకా వెళ్లేది కాదు కదా అనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దీపం అనేది వెలుతురు మాత్రమే కాదు.. కోట్లాది మంది హిందువులకు ఉన్న అచంచలమైన భక్తికి సంబంధించిన విశ్వాసం. శాంతిభద్రతల పేరిట ఆచారాలను నియంత్రించాలనుకోవడం.. ఎంతవరకు సమంజసమనే ప్రశ్న ఈ వివాదంతో ఉద్భవించింది. కోర్టులు భక్తుల పక్షాన నిలిచినా, ప్రభుత్వం పట్టుదలకు పోవడం తమిళ రాజకీయాల్లో పెను దుమారాన్నే రేపింది.

Story By Anup, Bigtv

Related News

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

Big Stories

Advertisement
×