E-Paper
Advertisement

Kanchana Re release: మళ్లీ భయపెట్టడానికి సిద్ధమవుతున్న కాంచన.. రీ రిలీజ్ డేట్ లాక్!

Kanchana Re release: మళ్లీ భయపెట్టడానికి సిద్ధమవుతున్న కాంచన.. రీ రిలీజ్ డేట్ లాక్!
Advertisement

Kanchana Re release:ఇటీవల కాలంలో ఆల్రెడీ థియేటర్లోకి వచ్చి సందడి చేసిన చిత్రాలు మళ్లీ రిలీజ్ అవుతూ అభిమానులకు మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో తెలుగు చిత్రాలు అలా విడుదలవుతూ అభిమానులను సందడి చేస్తుంటే.. ఇప్పుడు మరో సినిమా ఏకంగా భయపెట్టడానికి మరోసారి సిద్ధమయ్యింది. అదే కాంచన (Kanchana). స్టార్ కొరియోగ్రాఫర్ కం డైరెక్టర్ కం యాక్టర్ రాఘవ లారెన్స్(Raghava Lawrence) కెరియర్ లో ఒక మైల్ స్టోన్ గా నిలిచిన చిత్రం కాంచన. ఈ సినిమాకి ఆయనే స్వయంగా దర్శకత్వం వహించారు. కామెడీ , హారర్ అంశాలతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను కట్టిపడేసింది. 2011లో వచ్చిన ఈ సినిమా కోలీవుడ్ సినీ పరిశ్రమను శాసించింది అనడంలో సందేహం లేదు.ముఖ్యంగా వరుస కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ గా నిలిచి అబ్బురపరిచింది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు మళ్లీ థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది.

రీ రిలీజ్ కి సిద్ధమవుతున్న కాంచన..

2026 మార్చి 13న థియేటర్లలో మళ్లీ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. పైగా ఈ సినిమాని ఇప్పుడు డాల్బీ అట్మోస్ లో వీక్షించవచ్చు అని మేకర్స్ చెప్పడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవని చెప్పాలి. రాఘవ లారెన్స్ అదిరిపోయే పర్ఫామెన్స్ తో పాటు హారర్ అంశాలు ప్రేక్షకులను మరోసారి థ్రిల్ చేయబోతున్నాయి. ఇక ఈ సినిమాలో శరత్ కుమార్, కోవై సరళ, లక్ష్మీ రాయ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం తమన్ అందించారు. ఇప్పటికే థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా ఇప్పుడు మరోసారి థియేటర్లలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సిద్ధమవుతోంది. మరి రీ రిలీజ్ లో ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Advertisement

ALSO READ:Keerthi bhat: ఆ రోజే చనిపోదాం అనుకున్నా.. కార్తీక్ గురించి చెబుతూ సీరియల్ నటి కీర్తిభట్ కన్నీళ్లు

కాంచన 4 కి సర్వం సిద్ధం..

ఇకపోతే కాంచన ఫ్రాంచైజీలో భాగంగా ఇప్పటికే 2015లో కాంచన 2, 2019లో కాంచన 3 వచ్చి బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు కాంచన 4 కి సర్వం సిద్ధం అవుతోంది. మరోసారి రాఘవ లారెన్స్ రచనా దర్శకత్వంలో సహనిర్మాతగా తెరకెక్కిస్తున్న ఈ కామెడీ హారర్ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది ముని మూవీ సీరీస్ లో ఐదవ భాగం కావడం గమనార్హం.. ఈ చిత్రంలో రాఘవ లారెన్స్ , పూజా హెగ్డే, నోరాఫతేహి కీలక పాత్రలు పోషిస్తున్నారు . అలాగే కోవై సరళ , దేవదర్శిని , శ్రీ రామచంద్ర రాజు, హిమబిందు , రెడిన్ కింగ్స్ లీ తదితరులు సహాయక పాత్రలు పోషిస్తున్నారు.

Advertisement

గోల్డ్ మైన్స్ , టెలి ఫిలిమ్స్ బ్యానర్లపై సుమారుగా 65 కోట్లు బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే పొల్లాచి, హైదరాబాద్, ముంబై లలో ప్రధాన సన్నివేశాలు షూటింగ్ పూర్తి చేసుకున్నారు. ఇక త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే మూడు భాగాలతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న రాఘవ లారెన్స్.. ఈ కాంచన 4 తో ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అందుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Related News

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

Big Stories

Advertisement
×