Raj Kundra: బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శిల్పా శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే తాజాగా శిల్పా శెట్టి (Shilpa Shetty)రాజ్ కుంద్రా (Raj Kundra)దంపతులు మథురలోని ప్రేమానంద్ మహారాజ్ (Premanand Maharaj)ఆశ్రమాన్ని సందర్శించారు. ఈ క్రమంలోనే ప్రేమానంద్ మహారాజ్ తో మాట్లాడుతున్న సమయంలో ఆయన కిడ్నీ సమస్య(Kidney Issues)తో బాధపడుతున్నట్లు బయటపెట్టారు. ఇలా ప్రేమానంద్ మహారాజు కిడ్నీ వ్యాధి సమస్యతో బాధపడుతున్నారనే విషయం తెలుసుకున్న వెంటనే శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా వెంటనే స్వామీజీకి అభ్యంతరం లేకపోతే తన కిడ్నీ ఇస్తానని చెప్పడంతో ఒక్కసారిగా అక్కడున్న వారు షాక్ అయ్యారు.
మీ ప్రవచనాలు ఎంతో మందికి స్ఫూర్తి..
ఈ విషయం గురించి రాజ్ కుంద్రా మాట్లాడుతూ.. మీ ప్రవచనాల ద్వారా ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు.నేను మీరు చెప్పే ప్రవచనాలను అలాగే మీ వీడియోలను రెగ్యులర్ గా చూడడమే కాకుండా వాటిని అనుసరిస్తానని తెలిపారు. అలాగే నాకు కలిగే సందేహాలకు మీ వీడియోల ద్వారా సమాధానం వెతుక్కుంటానని, ఎంతో గొప్ప ప్రవచనాలు చెప్పే మీకు కిడ్నీ సమస్య కారణమైతే వెంటనే నేను నా కిడ్నీ ఇవ్వటానికి కూడా సిద్ధమేనని తెలిపారు.
కిడ్నీ సమస్యలతో ప్రేమానంద్ మహారాజ్..
ఇలా రాజ్ కుంద్రా ఆయన సమస్య తెలిసిన వెంటనే కిడ్నీ ఇవ్వటానికి ముందుకు రావడంతో వెంటనే ప్రేమానంద్ స్వామీజీ స్పందిస్తూ..” నీ మాటలు నాకు చాలా ఆనందాన్ని కలిగించాయి. మనకు పైనుంచి పిలుపు వచ్చేవరకు ఈ లోకం నుంచి వెళ్లలేము అంటూ ప్రేమానంద్ స్వామీజీ రాజ్ కుంద్రా కిడ్నీ ఇస్తానని చెప్పడంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఆయన మాటలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇక ప్రేమానంద్ స్వామీజీ గత కొంతకాలంగా రెండు కిడ్నీలు పాడవడంతో ఆరోగ్యపరంగా సమస్యలు ఎదుర్కొంటున్నారని స్పష్టమవుతుంది. ఇక రాజ్ కుంద్రా చేసిన వ్యాఖ్యలపై నెటిజన్స్ విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. ఆయన మంచి మనసుకు హ్యాట్సాఫ్ అంటూ కామెంట్లు చేయగా, ఇలాంటి గొప్ప మనసు అందరికీ రాదు అంటూ మరికొందరు రాజ్ కుంద్రా వ్యాఖ్యలపై స్పందిస్తున్నారు.
?igsh=bTZyaGh1azZ4azJk
ఇకపోతే గత రెండు సంవత్సరాల క్రితం ఈయన పోర్న్ వీడియోస్ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ వివాదం కారణంగా జైలుకు కూడా వెళ్లి వచ్చారు అయితే తన తప్పు లేకపోయినా జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఈ అవమాన భారంతో కొద్ది రోజులపాటు తన ఫేస్ కూడా చూపించడానికి ఇబ్బంది పడుతూ మాస్క్ వేసుకొని తిరిగేవారు. అయితే ఈ వివాదం నుంచి బయటపడిన ఈ జంట తమ వ్యాపార కార్యకలాపాలలో బిజీగా ఉన్నారు. రాజ్ కుంద్రా నిర్మాతగా బిజినెస్మెన్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక శిల్ప శెట్టి కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం పలు బాలీవుడ్ సినిమాలలో కూడా ఈమె బిజీగా గడుపుతున్నారు. ఇలా కెరియర్ పరంగా బిజీగా ఉన్న ఈ ఇద్దరు తాజాగా ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమాన్ని సందర్శించారని తెలుస్తోంది.
Also Read: Alia Bhatt: ఇదేమైనా మీ ఇల్లు అనుకున్నారా… ఫోటోగ్రాఫర్ల పై ఫైర్ అయిన అలియా!