Kishkindhapuri Teaser: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ కిష్కంధపురి. అతడి 11వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు కౌశిక్ పగళ్లపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది. రాక్షసుడు వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత మరోసారి బెల్లంకొండ హీరో, అనుపమ జతకట్టిన చిత్రమిది. దీంతో మూవీపై అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార పోస్టర్స్ మూవీపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ ప్రకటన సందర్భంగా విడుదల చేసిన టైటిల్ టీజర్, ఫస్ట్‌లుక్ మంచి స్పందన వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ మూవీ నుంచి తాజాగా క్రేజీ అప్‌డేట్ వచ్చింది.
టీజర్ విషయానికి వస్తే
ఈ మూవీ టీజర్ కాసేపటి క్రితమే విడుదలైంది. భయానక సన్నివేశాలు, బయపెట్టే బ్యాగ్రౌండ్ వాయిస్ కిష్కంధపురి టీజర్ ఆద్యాంతం ఆకట్టుకుంటుంది. డార్క్ థీమ్ లో ఓ పాతబడిన బంగ్లా చూట్టు సాగిన ఈ టీజర్ ప్రేక్షకులల్లో ఆసక్తిని పెంచుతుంది. ప్రారంభంలోనే భయపెట్టే అంశంతో టీజర్ మొదలైంది. ఇంట్లో ఒంటరిగా చిన్న పాప ఉన్నట్టు చూపించారు. ఇంటి డోరు గట్టిగా కొడుతున్నట్టు అనిపించడంతో ఆ పాప భయంతో తిరిగి చూస్తుంది. ఆ తర్వాత ఓ గుర్తు తెలియని వ్యక్తి ముసుగులో ఆ పాప నోరు మూసీ ఎత్తుకెళ్లినట్టు చూపించారు. ఆ తర్వాత నమస్కారం.. ఈ రోజు శుక్రవారం.. 9.8.1989 ఆకాశవాణి తలపులు తెరవబడ్డాయి.
పున:ప్రసారాలు నేటితో మొదలు అంటూ బ్యాగ్రౌండ్‌లో భయంకరమైన వాయిస్ వస్తుండగా.. పాతబడ్డ ఇంటిలో హీరో బెల్లకొండ శ్రీనివాస్, అనుపమలో టార్చ్ లైట్‌తో ఏదో వెతుకుతూ కనిపించారు. చివరిలో హీరో గాయాలతో కనిపించిన ఈ టీజర్ ఆద్యాంత ఆసక్తిగా సాగింది. టీజర్‌లో చూపించిన ప్రతి సన్నివేశంలో ఉత్కంఠ పెంచేలా ఉంది. ప్రస్తుతం కిష్కింధ టీజర్ మూవీపై మరింత హైప్ పెంచుతోంది. ఈ సినిమాలో హారర్ మిస్టరీ థ్రిల్లర్‌గా ఈ చిత్రం ఉండనుందని తాజాగా విడుదలైన టీజర్ చూస్తే తెలుస్తోంది. గుడి నగుడికి సంబంధించిన రహస్యం చూట్టు ఈ కథ సాగనుంది. ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పవర్ఫుల్ హీరో రోల్లో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది.
రిలీజ్ ఎప్పుడంటే?
ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ అలరించిన ఈ హీరో కొంతకాలం సినిమాలు తగ్గించాడు. ఆ తర్వాత భైరవం చిత్రంతో రీఎంట్రీ ఇచ్చాడు. మల్టీస్టార్‌గా వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇక కిష్కంధపురంతో సింగిల్ వస్తున్న సాయి శ్రీనివాస్‌కు ఈ మూవీ హిట్ చాలా ముఖ్యంగా. అందుకే డిఫరెంట్ కాన్సెప్ట్ హారర్ జానర్ సెలక్ట్ చేసుకుని హిట్ కోసం చాలా కష్టపడుతున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతుంది. షూటింగ్ జరుపుతూనే మరోవైపు ప్రమోషన్స్ కూడా చేస్తోంది చిత్ర బృందం. ఇందులో భాగంగా తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్‌ని కూడా ప్రకటించనున్నారు. ఈ సినిమాకు శ్యామ్ సంగీతం అందిస్తున్నారు.
Also Read: Shilpa Shetty: నా కిడ్నీ తీసుకోండి ప్రభూ.. శిల్పాశెట్టి భర్త షాకింగ్ నిర్ణయం, ఆమె ఒత్తిడే కారణమా?